స‌త్య‌కుమారా… ఇదేం ప‌ద్ధ‌తి?

బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న స‌త్య‌కుమార్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఉద్యోగుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంద‌నే మాట వినిపిస్తోంది.

బ‌హుశా అధికారం అనేది విచ‌క్ష‌ణ కోల్పోయేలా చేస్తుందేమో! అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల భిక్షే త‌మ‌కు అధికారం అనే స్పృహ నాయ‌కుల్లో కొర‌వ‌డుతోంది. ర‌క‌ర‌కాల ఆశ‌లు, న‌మ్మ‌కాల‌తోనే త‌మ‌కు అధికారం క‌ట్ట‌బెట్టార‌ని, వాటిని నెర‌వేర్చాల్సిన బాధ్య‌త వుంద‌ని కొంద‌రు అధికార పెద్ద‌లు గుర్తించ‌డం లేదు. అధికారం అంటే, అంద‌రిపై పెత్త‌నం చేయ‌డ‌మ‌నే భావ‌న మ‌న‌సులో ఉండ‌డంతో ఏం మాట్లాడుతున్నారో వాళ్ల‌కే తెలియ‌డం లేదు.

అధికారమ‌నే అహంకారానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా వైద్య‌, ఆరోగ్యశాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ బెదిరింపు మాట‌లున్నాయ‌ని మ‌హిళా క‌మ్యూనిటీ హెల్త్ ఆఫీస‌ర్లు (సీహెచ్‌వో) విమ‌ర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ క్లినిక్స్ ద్వారా ప్ర‌జ‌ల‌కు వైద్య‌సేవ‌ల్ని సీహెచ్‌వోలు అందిస్తున్నారు. త‌మ‌ను రెగ్యుల‌ర్ చేయాల‌ని, అలాగే ఎన్‌హెచ్ఎం ఉద్యోగుల‌తో స‌మానంగా 23 శాతం వేత‌నాలు పెంచాల‌ని, ఇత‌ర స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల‌నే డిమాండ్స్‌పై వాళ్లు ఆందోళ‌న బాట ప‌ట్టారు.

స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై వుంటుంది. ఈ నేప‌థ్యంలో నెల్లూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన వైద్య, ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు విన‌తిప‌త్రం ఇవ్వ‌డానికి సీహెచ్‌వోలు వెళ్లారు. వాళ్ల‌ను చూడ‌గానే ఆయ‌న‌కు కోపం వ‌చ్చింది. త‌న వ‌ద్ద‌కు రావ‌డ‌మే నేర‌మ‌న్న‌ట్టుగా వాళ్ల‌ను ఆయ‌న క‌సురుకున్న‌ట్టు చెబుతున్నారు. క‌నీసం సీహెచ్‌వోల స‌మ‌స్య‌లేంటో కూడా విన‌కుండా, వెంట‌నే విధుల్లో చేరాల‌ని, లేదంటే ఉద్యోగాల నుంచి తీసేస్తామ‌ని హెచ్చ‌రించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అంతేకాదు, మిమ్మ‌ల్ని ఉద్యోగాల నుంచి తొల‌గిస్తే ప్ర‌భుత్వానికి రూ.500 కోట్ల భారం త‌గ్గుతుంద‌న‌డం గ‌మ‌నార్హం. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌క‌పోతే, త‌మ‌ను బెదిరించ‌డంపై సీహెచ్‌వోలు మండిప‌డుతున్నారు. ఆర్థిక భారంగా త‌మ‌ను చూడ‌డం ఏంట‌ని సీహెచ్‌వోలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగి, జీవ‌నం భారం కావ‌డం వ‌ల్లే వేత‌నాలు పెంచాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని వారు అంటున్నారు. బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న స‌త్య‌కుమార్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఉద్యోగుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంద‌నే మాట వినిపిస్తోంది.

9 Replies to “స‌త్య‌కుమారా… ఇదేం ప‌ద్ధ‌తి?”

  1. They can spend 300 crores on publicity stunts in the name of Amaravati restart programme but cannot solve the problems of CHOs. Since they do not have a direct answer, yellow kulifs will now start attacking asking question about what Jagan did in last 5 years. They must first realize that a counter question can never be an answer and if they want to back and question about past, they must start from 2014.

    1. As always Jaffa Casarla comes up with fake allegation of 300 crores Amaravati restart program. Blue baffons will live in fools paradaise day and night. #FakeJaffa

    2. ponile neeli kj lk , mana l 11 laga sakhi lo button programmes gurunchi ads ki 600 cr eddam .. nee lanti neeli kj lk laki branding gurunchi emi telustundi

      siddam sabhala neeli kj lk 

  2. ఆర్థిక భారం వాళ్లు కాదు ఈ సత్యం కుమార్ గాడు నారాయణ లోకేష్ గాడు ఈ పనికిమాలిన దేది తెలియని నాయకులకు జీతాలు వేయడం వల్ల ఖర్చులు ఇదే ఆర్థిక భారం రాష్ట్రానికి

    1. ponile neeli kj lk , irrigation minister polavaram gurunchi cheppamnte ghanta arghanta annattu kada

      alage 234 salhadarlu ane neeli lk ki janalu sommu echinatte kada 

      l11 neeli lk , annadu ga opposition leader hyd lo emi pani ani 

      mari eppudu bangalore lo nee …. 

  3. When suchbpeople win without support of people, this is the expected attitude. We have seen such behavior in more than three fourth of alliance leaders today.

  4. A.p government cho’s ki న్యాయం చేయండి 

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా జీవితాలను మారతాయని ఎంతో మేలు చేకూరుతుందని విశ్వాసం ఉందని chos APMCA అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్నాం కానీ కూటమి అధికారంలోకి రాగానే chos ni పట్టించుకోవడంలేదు ఇది చాలా బాధాకరంగా ఉంది అందరికీ అందుబాటులోకి కూటమి ప్రభుత్వం యూటుదని మా నమ్మకము 

Comments are closed.