నటుడు విష్వక్ గతంలోనే దర్శకుడిగా ఓ సినిమా చేసాడు. ఫలక్‌నుమాదాస్ తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు. కానీ రైటర్ గా, డైరక్టర్ గా పని చేయడం అంటే విష్వక్ కు చాలా ఆసక్తి వుంది.
ఫలక్ నుమా దాస్ సీక్వెల్ చేస్తానని చెబుతూ వస్తున్నారు. కానీ ఈలోగా మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాజీ మంత్రి తలసాని కుమారుడు సాయి నిర్మాతగా ‘కల్ట్’ అనే సినిమాను విష్వక్ చేస్తున్నారు. అనుదీప్ తో ఫంకీ మూవీ చేస్తూనే కల్ట్ మూవీని సమాంతరంగా ప్రారంభించారు.
కల్ట్ మూవీకి విష్వక్ నే దర్శకత్వం వహించడం విశేషం. కెరీర్ స్టార్టింగ్ లోనే డైరక్షన్ చేసిన విష్వక్ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి అనుభవం సంపాదించారు. జనాలు ఏ సినిమా చూస్తారు. ఏది చూడరు అనే క్లారిటీ వుంది. అందువల్ల ఈ జనరేషన్ కు తగిన సబ్జెక్ట్ నే తీసుకుని వుంటారు. అందుకే కల్ట్ అనే టైటిల్ పెట్టి వుంటారు అనుకోవాలి.
ఇటీవల రెండు సినిమాలు విష్వక్ కు మంచి ఫలితాల ఇవ్వలేదు. మెకానిక్ రాకీ, లైలా సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అనుదీప్ తో సినిమా మీద మంచి హోప్స్ వున్నాయి. జాతిరత్నాలు అనుదీప్ కు ఇది మూడో సినిమా. రెండో సినిమాకు మూడో సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. ఈ సినిమాలో విష్వక్ సినిమా డైరక్టర్ గా నటిస్తున్నాడు. దాని తరువాత సినిమా నిజంగానే డైరక్టర్ చేస్తున్నారు. చిత్రం కదా?
Maas ka daas evadu teesadra GA ..visweksen kada ..fulkunama das okate cheptunav
Das ka Damki cinema directed by Viswaksen.. ఏరా నీకు సినిమాల పై కనీస అవగాహన కూడా లేకుండా articles రాసేస్తావా… గూగుల్ లో అయినా సెర్చ్ చేసుకోరా బాబూ రాసే ముందు…