ఉరుములేని పిడుగులా సినిమాలపై కూడా సుంకాలు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. విదేశీ గడ్డపై నిర్మించే సినిమాలు, అమెరికాలో రిలీజ్ అయితే ఏకంగా వంద శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందంటూ ప్రకటించారు. ఈ మేరకు వాణిజ్య శాఖకు పూర్తి అధికారాలు కట్టబెడుతూ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా విడుదల చేశారు.
ఈ సుంకాల ప్రభావం భారతీయ సినీ పరిశ్రమపై గట్టిగా పడబోతోంది. బాలీవుడ్ సినిమా అయినా, కోలీవుడ్-టాలీవుడ్ సినిమాలైనా ఓవర్సీస్ వసూళ్లపైనే ఆధారపడిన రోజులివి. హీరోలు రెమ్యూనరేషన్లు పెంచినా, సినిమాల బడ్జెట్లు పెరిగినా అదంతా యూఎస్ వసూళ్ల పుణ్యమే. ఇప్పుడు వందశాతం సుంకాలు అమలైతే, ఇండియన్ సినిమా కుదేలవుతుంది. అదెలాగో చూద్దాం..
ఉదాహరణకు ఓ భారతీయ సినిమా అమెరికా ప్రదర్శన హక్కుల్ని బయ్యరు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడని అనుకుందాం. వంద శాతం సుంకాలు అమల్లోకి వస్తే, ఆ సినిమాకు సంబంధించి అమెరికాకు అదనంగా మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది బయ్యర్ కు భారమౌతుంది. ఆ భారాన్ని అతడు ఆటోమేటిగ్గా ప్రేక్షకులపై వేస్తాడు.
ప్రస్తుతం అమెరికాలో భారతీయ ప్రేక్షకులు ఎక్కువగా నివశిస్తున్న రాష్ట్రాల్లో టికెట్ రేట్లు 14 డాలర్ల నుంచి 20 డాలర్ల మధ్య ఉన్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన సుంకాలు అమల్లోకి వస్తే, 14 డాలర్ల టికెట్ రేటు 28 డాలర్లు అవుతుంది. అమెరికాలోని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రంగా పన్నుల విధానం కలిగి ఉంది. కాబట్టి స్థానిక పన్నుల్ని కూడా కలిపితే, టికెట్ రేటు 30 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.
ఇది మిడ్-రేంజ్ సినిమా హాళ్ల టికెట్ రేటు మాత్రమే. ఏఎంసీ, రీగల్ లాంటి మల్టీప్లెక్సుల్లో ఈ ధరలు ఇంకాస్త పెరగొచ్చు. ఇక ఐమ్యాక్స్ స్క్రీన్ అయితే టికెట్ రేట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంత డబ్బు పెట్టి టికెట్ కొని భారతీయ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనేది అందరి అనుమానం.
ఇప్పటికే యూఎస్ఏలో ఆక్యుపెన్సీ బాగా తగ్గిపోయింది. పార్ట్ టైమ్ జాబ్స్ లేకపోవడంతో భారతీయ యువత తమ ఆనందాన్ని తగ్గించుకుంది. మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు చూసేందుకు అక్కడ ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. వంద శాతం పన్ను అమల్లోకి వస్తే, ఇకపై పెద్ద సినిమాలకు కూడా ఆక్యుపెన్సీ తగ్గే అవకాశం ఉంది.
దీని కంటే ముందు… ప్రీమియర్స్ పై ఈ ప్రభావం గట్టిగా పడబోతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు అమెరికాలో ప్రీమియర్స్ చాలా అడ్వాంటేజ్ గా ఉంటున్నాయి. టికెట్ రేట్లు పెరిగితే ఇక ఆ అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. ఇప్పటివరకు పెద్ద సినిమాల ప్రీమియర్స్ కు 25 డాలర్ల నుంచి 50 డాలర్ల మధ్య టికెట్ రేట్లు ఉన్నాయి. వంద శాతం టారిఫ్ అమలైతే, ప్రీమియర్ షోల కనీస టికెట్ ధర 35 డాలర్లకు చేరుకుంటుందని ఓ అంచనా.
వంద శాతం పన్నులు అమలైతే నిర్మాతలతో ఎగ్జిబిటర్లు లేదా బయ్యర్లు కుదుర్చుకునే అగ్రిమెంట్ల స్వరూపమే మారిపోవచ్చు. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలకు పెద్దగా టారిఫ్ లు పడలేదు. ఉదాహరణకు న్యూయార్క్ నే తీసుకుంటే, సినిమా టికెట్ పై గరిష్టంగా 7 శాతం పన్ను ఉంది. కానీ వంద శాతం పన్ను అమల్లోకి వస్తే, ఆ మొత్తం ఎవరు చెల్లించాలి? బయ్యర్ కట్టాలా లేక నిర్మాత కట్టాలా? అసలు గ్రాస్ నుంచి ఈ వంద శాతం పన్నును ఎలా మినహాయించుకోవాలి? ఇలా చాలా చిక్కుముడులు కనిపిస్తున్నాయి.
అటు హీరోల రెమ్యూనరేషన్లు, సినిమాల బడ్జెట్లు కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. వంద శాతం పన్ను కడితే అమెరికాలోని భారతీయ సినిమాలకు బ్రేక్ ఈవెన్ కష్టమౌతుంది. ఆ నష్టాల నుంచి బయటపడాలంటే సినిమా బడ్జెట్లు తగ్గించుకోవాలి, అదే క్రమంలో హీరోలు కూడా తమ పారితోషికాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది.
రాబోయే రోజుల్లో హరిహర వీరమల్లు, రాజా సాబ్, కింగ్డమ్, కుబేర, కూలీ, వార్-2, విశ్వంభర లాంటి పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వీటిలో చాలా సినిమాలకు యూఎస్ డిస్ట్రిబ్యూషన్ రేట్లు కూడా లాక్ అయిపోయాయి. ట్రంప్ ఎఫెక్ట్ తో ఇప్పుడా అగ్రిమెంట్లను మళ్లీ రాసుకునే పరిస్థితి వస్తుంది. ఈ సంగతి పక్కనపెడితే, రాబోయే రోజుల్లో అమెరికాలో భారతీయ సినిమాల మార్కెట్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ప్రస్తుతం ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. ఇవే సుంకాలు, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ వేదికలకు కూడా వర్తింపజేస్తే.. భారతీయ సినీ పరిశ్రమ అల్లాడిపోవడం ఖాయం.
us లో exhibitors, india lo లావాదేవీలు గుట్టు గా జరుపుకుంటారేమో టారిఫ్ ఎగ్గొట్ట దానికి.
Exactly.
మరి హీరోలందరూ వస్తున్నారా వంగి వంగి దండాలు పెడుతూ బేరానికి?
తెలుగు హీరో లు. రెమ్యూనరేషన్ ఘోరం అంత ఎక్కువ తీసుకుంటూ దోపిడీ చేస్తున్నారు.. వాళ్ళ దోపిడీ ఆగితే ఎవడో ఒకడు బాగుపడతాడు నిజంగా వీళ్లకు ఇస్తున్న hype చాలా ఎక్కువ వీల్లేదు యుద్ధ వీరులాగా scientist laaga చూస్తున్నారు
నిరుపేదల మీద కూడా చెత్త మీద సుంకాలతో ఖజానా నింపి దోచుకున్న జగన్ రెడ్డి గురించి ఎందుకు రాయటం లేదు
Vaalu rasindhi trump gurinchi nuvvu yendhuku veree vadi mogaa chiku
అంతేందుకు పిఠాపురం లో చెత్త పన్ను కూటమి govt వచ్చిన తరువాత వేశారు. ఐనా article ఏంటి నువ్వు రాసేది ఏంటి
Sunkam Movie industry ki bharamm kadhu hero’s, heroines, villains, director anthaa crores remuneration thesukuntaru