విక్టరీ వెంకటేష్ తో దర్శకుడు త్రివిక్రమ్ సినిమా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే. బన్నీ నో అని అంటే తప్ప సినిమా స్టార్ట్ కావడం ఖాయం. అయితే ఈ సినిమా లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? అని చూస్తే. త్రివిక్రమ్ దర్శకుడు కనుక, ఇటీవలే వందల కోట్ల సినిమా ఖాతాలో వేసుకున్న వెంకీ హీరో కనుక నాన్ థియేటర్ హక్కులు అన్నీ కలిపి ఎలా లేదన్నా 80 నుంచి 90 కోట్ల మేరకు ఉండొచ్చు. అలాగే థియేటర్ మీద నుంచి వరల్డ్ వైడ్ గా 60 నుంచి 80 కోట్లు రాబట్ట వచ్చు. అంటే 150 కోట్ల మార్కెట్ ఈ సినిమాకు రెడీగా ఉన్నట్లే.
అయితే ప్రొడక్షన్ ఎంత కావచ్చు. పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల మేరకు వెంకీ రెమ్యూనరేషన్ ఉండే అవకాశం వుంది. త్రివిక్రమ్ కు 25 కోట్ల మేరకు ఉండొచ్చు. మ్యూజిక్ సినిమాటోగ్రఫీ వంటి సాంకేతిక బృందానికి పది కోట్ల వరకు అవసరం పడుతుంది.
హీరోయిన్, ఇతర నటుల రెమ్యూనరేషన్లు మరో అయిదు కోట్లు ఉండొచ్చు. అంటే దగ్గర దగ్గర అరవై కోట్లు కేవలం రెమ్యూనరేషన్లే అవుతాయి. ఆ పైన ప్రొడక్షన్ ఎలా లేదన్నా 30 కోట్లకు కాస్త పై మాటే అవుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ ఏ మేరకు ఖర్చు చేయిస్తారు. ఎలాంటి సబ్జెక్ట్ అనుకుంటున్నారు అన్నది ఇంకా బయటకు రాలేదు. వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలిపి 110 కోట్లు దాటుతుంది.
అంటే సినిమా మంచి మార్జిన్ తో విడుదలయ్యే అవకాశం వుంది. కనీసం 40 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో విడుదలకు ఛాన్స్ వుంది. అందుకే ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ ఎక్కించాలని ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయి.
ట్రంప్ కొత్త టారిఫ్ కలిపావా G A???
I hope it will be a comedy film!