ఎక్స్ క్లూజివ్.. బాలయ్య- క్రిష్- ఆర్కామీడియా

నందమూరి బాలకృష్ణ దర్శకుడు క్రిష్ తో మరోసారి జతకట్టబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ దర్శకుడు క్రిష్ తో మరోసారి జతకట్టబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. శాతకర్ణి, కథనాయకుడు సినిమాల తరువాత ఇది మూడో సినిమా అని లెక్కేసుకోవాలి.

ఆదిత్య 999 అనే సినిమా బాలయ్య మదిలో ఎప్పటి నుంచో వుంది. దానిని తెరకెక్కించాలని బాలయ్య చిరకాల కోరిక. తానే కథ రాసానని, తానే డైరక్ట్ చేస్తానని చాలా సార్లు చెప్పారు. అలా చెబుతూనే వస్తున్నారు కానీ తెరకెక్కే టైమ్ కనిపించడం లేదు. పైగా పలువురు క్రేజీ దర్శకులు బాలయ్యతో సినిమాల కోసం వెయిటింగ్ లో వుండడంతో ఆదిత్య 999 అలా వెనక్కు వెళుతూనే వుంది.

ఇదిలా వుంటే మోక్షజ్ఙను తెరమీదకు తీసుకురావాలని బాలయ్య ఆలోచన. అది కూడా పెండింగ్ లో పడుతూ వస్తోంది. ఇటు ఆదిత్య 999, అటు మోక్షు ఎంట్రీ రెండూ కలిసి వచ్చేలా బాలకృష్ణ ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తారు. బాహుబలి లాంటి సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తుంది. క్రిష్ ప్రస్తుతం తన ఘాటీ సినిమా మీద బిజీగా వున్నారు.

బాలయ్య జూన్ 10న గోపీచంద్ మలినేని సినిమాకు శ్రీకారం చుడతారు. జూలై లేదా ఆగస్ట్ నుంచి ఆ సినిమా షూట్ వుంటుంది. డిసెంబర్ నుంచి క్రిష్ సినిమాను కూడా సమాంతరంగా ప్రారంభించాలనే ఆలోచనలో బాలయ్య వున్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఆదిత్య 999 సినిమా, క్రిష్ డైరక్షన్, ఆర్కా మీడియా నిర్మాణం ..ఇది సెట్ మీదకు వెళ్తే ఆ సినిమాకు బజ్ మామూలుగా వుండదు.

2 Replies to “ఎక్స్ క్లూజివ్.. బాలయ్య- క్రిష్- ఆర్కామీడియా”

Comments are closed.