రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహకరించడంలేదా? ఈ ప్రశ్నకు ‘అవును’ అనే విధంగానే ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇక్కడ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అని అర్థం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నెలకోక సంక్షేమ పథకం ప్రవేశపెడుతోందని, కాని నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఆ పథకాలకు తగిన ప్రచారం కల్పించడం లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నాడట.
పథకాలపై ప్రచారం జరగకపోవడంతో లబ్ధిదారులకు అవసరమైనంత మేరకు ప్రయోజనం కలగడంలేదని చెబుతున్నాడట. దీంతో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారమే ఎక్కువగా ప్రజల్లోకి వెళుతుందని సీఎం అభిప్రాయపడుతున్నాడు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో తిరగకుండా ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటూ కాలం గడుపుతున్నారని గతంలో కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రతి గ్రామంలో తిరగాలని సీఎం ఇదివరకే ఆదేశించాడు.
అయినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరిగితేనే వారికీ ప్రయోజనం ఉంటుందని, ఎన్నికల్లో పార్టీకీ ప్రయోజనం కలుగుతుందని రేవంత్ రెడ్డి అన్నాడు. చేసిన పనులు చెప్పుకోవడంలో వెనకబడి పోయామని రేవంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జాగ్రత్తగా పనిచేస్తే రెండోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నాడు. ప్రతీ ఒక్కరూ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెబుతున్నాడు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి చేర్చే బాధ్యత తీసుకోవాలని అంటున్నాడు. ప్రతీ ఎమ్మెల్యే..ప్రజాప్రతినిధి ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు అవకాశం తావివ్వకుండా పని చేసుకోవాలన్నాడు.
జాగ్రత్తగా పని చేసుకుంటే రెండోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమన్నాడు. ప్రభుత్వం ఎన్నో చేసినా… వాటి గురించి మాట్లాడకుండా లోపాలను ఎత్తి చూపుతున్నారని కూడా రేవంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఈ లోపం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాటి గురించి పార్టీ నాయకులు పెద్దగా ప్రచారం చేసుకోరు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా పార్టీ నాయకులు అందరూ ఆయనను మోశారు. ఫలితంగానే ఆయన రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పథకాలను ప్రచారం చేయడం లేదు.
అనుభవం లేనందున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమవుతున్నాడన్న ప్రచారమే పెరిగింది. ఈ ప్రచారమే అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి కీడు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టాడు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి.. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఏం చేశారనే దానిపై సమీక్షలు ప్రారంభించాడు. ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు నియోజకవర్గంలో ఉంటున్నారు.. ప్రజలను కలుస్తున్నారా.. ఎన్నికల సమయంలో లోకల్‌గా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా.. అనే అంశాలపై సీఎం రిపోర్ట్ తెప్పించుకున్నాడు. ఎమ్మెల్యేల అందరి జాతకాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో తన దగ్గర ఉన్నాయన్నాడు రేవంత్ రెడ్డి.
పనితీరు మెరుగు పర్చుకోవాలన్నాడు. ఇప్పటికైనా వర్గవిభేదాలను పక్కనబెట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నాడు. ఎవరు ఏం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? లేదా? అన్న విషయాలపై తన దగ్గర పూర్తి సమాచారం ఉందన్నాడు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించాడు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గాని కాంగ్రెసు పార్టీకి నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అనేది తెలుస్తుంది.
అసలు ఏం చేశాడు రేవంత్ రెడ్డి,ఏమని చెప్పుకుంటారు mla లు జనాల దగ్గర
ఎంత ఉన్నా 2లక్షల వరకు రుణమాఫీ అని చెప్పి ఆపైన ఉన్నవాళ్ళకు చేయలేదు
రైతు బంధు ఇంతవరకు రాలేదు
గ్యాస్ సిలిండర్ పథకం ఎగ్గొట్టాడు
ప్రతి మహిళకు అకౌంట్ లో డబ్బులు వేస్తా అన్నాడు 2500/- ఎగ్గొట్టాడు
ఇంకా ఏ మొహం పెట్టుకొని జనాల దగ్గరికి వెళ్తారు MLA లు
GHMC elections jaripithe appudu telusthundi potreddy thadakha..lol
avunara sull1 kachara ga
orey pichhi poo..ku su..lliga nee ammanu panda..bettu..chetha la..kodaka.. edanna unte vaadini thittukuntavo..pogadukuntavo nee ishtam.. la kodaka.. nee ip address tho nee kuth..a pagulthundi.. jagratha.
Asalu veedu em chyadu ani prajalloki veltharu mla‘s
ఎప్పుడుకైనా కేటీఆర్ & కవిత కి జగన్ & షర్మిల రేంజ్ లో గొడవలు అవుతాయి.. కెసిఆర్ ఖర్మ కాలితే ఎలెక్షన్స్ కి ముందే అవ్వొచ్చు