ప్రభాస్.. రాజు .. రాజే

ప్రభాస్ ను చాలా మంది ముద్దుగా ప్రభాస్ రాజు అని కూడా పిల్చుకుంటారు. ఆయన పర్సనల్ విషయాలు కొన్ని వింటుంటే రాజు రాజే కదా అనిపిస్తుంది.

ప్రభాస్ ను చాలా మంది ముద్దుగా ప్రభాస్ రాజు అని కూడా పిల్చుకుంటారు. ఆయన పర్సనల్ విషయాలు కొన్ని వింటుంటే రాజు రాజే కదా అనిపిస్తుంది. ప్రభాస్ ఖాళీ దొరికినపుడల్లా ఇటలీ వెళ్లి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని వస్తారు. అక్కడ ఓ ఇల్లు తీసుకున్నారు. తాను తనతో పాటు కొందరు జనాలను అక్కడకు తీసుకెళ్లి, గడిపి, మళ్లీ రావడానికి కనీసం కొన్ని కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఎక్కువగా స్పెషల్ ఫ్లయిట్ లు వాడడం, ఇతర ఖర్చులు భారీగా వుంటాయట.

అలాగే ఇంటికి ఎవర్ని అయినా పిలిస్తే టిఫెన్ కింద ఎవరైనా ఒక రకం పెడతారు.. రెండు రకాలు పెడతారు. కానీ ప్రభాస్ స్టయిల్ అలా కాదంట. దోశ తింటా అంటే అందులో ఎన్ని రకాలు వుంటే అన్ని అక్కడ టేబుల్ మీదకు వస్తాయట. తింటూ వుంటే, అది చల్లారిపోయింది కదా.. అంటూ పక్కన పెట్టించి మళ్లీ వేయించి తెప్పిస్తారట.

ప్రభాస్ ఆతిధ్యం గురించి ఇప్పటికే కథలు కథలు గా చెప్పారు చాలా మంది సెలబ్రిటీలు. కానీ గమ్మత్తేమిటంటే ప్రభాస్ పెద్ద ఫుడ్డీ కాదట. ఆయనేమీ భీమవరం రాజుల మాదిరిగా మంచి రకరకాలు టేస్ట్ చేయరట. చాలా సింపుల్ గా తోటకూర లేదా ఆకుకూరలు కలిపి ఉప్మా లాంటిది తీసుకుంటారట. విదేశాల్లో వుంటే కేలరీలు లెక్క వేసుకుని అక్కడి ఫుడ్ తింటారట. తన ఫారిన్ చెఫ్ కు కూడా తను తినే ఇండియన్ రకాలు అన్నీ నేర్చించేసారట.

పాన్ ఇండియా లెవెల్ లో నూరు నూట యాభై కోట్లు తీసుకునే హీరో ప్రభాస్. అంతా ఏమనుకుంటారు. ఎంత సంపాదిస్తున్నారో అని. కానీ ప్రభాస్ రెమ్యూనిరేషన్ కు ఆస్తులకు బేరీజు వేసుకుంటే అస్సలు సంబంధం వుండదట. సంపాదించింది అంతా తను, తనతో వున్న వారు, తన కుటుంబీకులు హాయిగా వుండడానికి, తను చదవిస్తున్న చాలా మంది ఫీజులు కట్టడానికి, తను విదేశాలు వెళ్లి రావడానికి వీటికే ఎక్కువ ఖర్చు చేసేస్తారట.

మొన్న మొన్నటి వరకు పెద్దగా ఆస్తులు సమకూర్చుకునే ఆలోచనే చేయలేదట. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ భూములు కొనడం స్టార్ట్ చేసారట. అది కూడా వందల ఎకరాలు కాదు. నాలుగు ఎకరాలు.. అయిదు ఎకరాలు అనే లెక్కలో.

ప్రభాస్ తీరు వేరే.. ఆయన జీవన విధానం వేరే.

18 Replies to “ప్రభాస్.. రాజు .. రాజే”

  1. అన్నియకి చెప్పు రా ఈ రాతలు…తల్లి,చెల్లల్ని కూడా వేపుకొని తింటున్నాడు !!

  2. ప్రభాస్ అన్న గురించి వాగినా కొడకల్లారా గుద్ద పగులుద్ది 

Comments are closed.