చిన్నిని వెంటాడుతున్న నాని.. ఈడీకి ఫిర్యాదు!

రూ. 2,000 కోట్ల చైన్-లింక్ స్కామ్‌పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో కేసు న‌మోదైంద‌ని ఈడీ దృష్టికి నాని తీసుకెళ్లారు

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్నిని ఆయ‌న అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని నీడ‌లా వెంటాడుతున్నారు. చిన్ని ప‌చ్చి అవినీతిప‌రుడ‌నేది నాని అభిప్రాయం. ఇలాంటి వాళ్ల‌ను ప్రోత్స‌హించొద్ద‌ని ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబుకు నాని ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా లిక్క‌ర్ స్కామ్ ప్ర‌ధాన నిందితుడు రాజ్ క‌సిరెడ్డితో చిన్నికి వ్యాపార సంబంధాలున్నాయ‌ని, ఇద్ద‌రూ క‌లిసి ఒకే మెయిల్‌పై వ్య‌వ‌హారాలు న‌డిపార‌నే ఆధారాల‌తో స‌హా నాని బ‌య‌ట పెట్టిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా చిన్నిపై నాని మ‌రో ఫిర్యాదు చేశారు. ఏకంగా ఈడీకి ఫిర్యాదు చేసి, చిన్ని అంతు తేల్చాల‌ని ఈడీని నాని కోర‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈడీకి చేసిన ఫిర్యాదును సోష‌ల్ మీడియాలో ఆయ‌న షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ ఫిర్యాదులో ఏముందో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నం. 21/2024 తేదీ 23.09.2024 కింద జరుగుతున్న విచారణకు సంబంధించి కీలక వాస్తవాలను మీ దృష్టికి తెస్తున్నానంటూ ఈడీ డైరెక్ట‌ర్‌ను ఉద్దేశించి ఆయ‌న పేర్కొన్నారు.

సీఎం చంద్ర బాబు నాయుడు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)పై తనకు నమ్మకం లేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అధికారికంగా సీబీఐ విచారణకు అభ్యర్థించడం ఆందోళన క‌లిగిస్తోందని నాని తెలిపారు.

అధికారిక రికార్డులు, పబ్లిక్ డొమైన్ స‌మాచారం ప్రకారం, కేశినేని శివనాథ్, అతని భార్య జానకి లక్ష్మి, రాజ్ కసిరెడ్డి ఇతర వెంచర్లలో ప్రైడ్ ఇన్‌ఫ్రాకామ్ LLPలో భాగస్వాములు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002ని ఉల్లంఘించి ఆదాయ లావాదేవీల‌కు ఈ సంస్థలు ఉపయోగించి ఉండొచ్చ‌ని ఈడీకి ఫిర్యాదు చేశారు. అలాగే చిన్ని కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, సుదీర్ఘ కాలంగా వ్యాపార భాగ‌స్వాముల‌తో స‌హా దేశంలోనే, విదేశాల్లోనూ వివిధ కంపెనీల ద్వారా మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిపి వుంటార‌నేందుకు బ‌ల‌మైన ఆధారాలున్నాయ‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా కేశినేని చిన్ని భార్య జాన‌కి ల‌క్ష్మి, కుమారుడు వెంక‌ట‌చౌద‌రి, మ‌ధు బాబు కందిమ‌ళ్ల‌, సురేష్ పీటీ, రామ్ వెనిగ‌ళ్ల‌, చ‌క్ర‌వ‌ర్తి క‌డియాల‌, వంశీ క‌డియాల‌, కుమార్ అడుసుమ‌ల్లి, రాజేష్ పోసం, మోహ‌న్‌రావు బొల్లినేని, వెంక‌ట‌కృష్ణ కిషోర్ తాళ్లూరి, నాగేశ్వరరావు గాలిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న ఈడీని అభ్య‌ర్థించారు.

పైన పేర్కొన్న వ్యక్తులలో కొందరిపై రూ. 2,000 కోట్ల చైన్-లింక్ స్కామ్‌పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో కేసు న‌మోదైంద‌ని ఈడీ దృష్టికి నాని తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం ఆ కేసు విచార‌ణ‌లో వుంద‌ని పేర్కొన్నారు. లోతైన విచార‌ణ జ‌రిపి నిజానిజాల్ని వెలికి తీయ‌డానికి నిష్పాక్షిక ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఈడీని ఆయ‌న కోర‌డం విశేషం. దీనిపై ఈడీ స్పంద‌న ఎలా వుంటుందో చూడాలి.

9 Replies to “చిన్నిని వెంటాడుతున్న నాని.. ఈడీకి ఫిర్యాదు!”

  1. ఇవన్నీ కేవలం ఆర్ధిక విషయాలు.

    తన తండ్రిని గొడ్డలితో చంపించిన ప్యాలెస్ పులకేశి అన్న మీద చెల్లి పోరాటం గురించి కూడా రాయి, గ్యాస్ ఎంకి.

  2. ///ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002ని ఉల్లంఘించి ఆదాయ లావాదేవీల‌కు ఈ సంస్థలు ఉపయోగించి ఉండొచ్చ‌ని ఈడీకి ఫిర్యాదు చేశారు.///

    .

    ఉండొచ్చ‌ని.. అల్లా చరిగి ఉండవచ్చు… అన్ని కూడా పిర్యాదు చెస్తారా?

    బలమైనా ఆదారాలు అని పదె పదె రాసె బదులు అవి ఎవొ నిజంగా ఉంటె ED కి ఇవ్వు!

  3. ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యపాన సంబంధిత వ్యాధులు తీవ్రంగా పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా కాలేయ, నాడీ సంబంధిత వ్యాధుల్లో భారీ పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో జరిగిన అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది.

  4. Good work నాని గారు, ఐనా మీ బ్రాంతి కానీ, bjp washing machine తో కూటమి కదా మీ letter wrong addreess అని మీకు తిరిగి వస్తుంది 

  5. Why is Chinni upset and scared if he is not involved in the scam or has no links with Raj Kasireddy in the liquor matter? He should be able to come out clean with this inquiry from ED but recent statements from Chinni garu and TDP are raising more doubts about their role in this scam. Happy to know that ED is getting involved in this case.

Comments are closed.