ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్‌కు భారత్ షాక్ ఇచ్చింది. ఈ విషయమై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సంచలన ప్రకటన ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందనే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని ఎయిర్‌ఫోర్స్ విజ్ఞప్తి చేయడం విశేషం.
తమకు అప్పగించిన లక్ష్యాలను పూర్తి చేసినట్టు భారత విమానయాన సంస్థ తెలిపింది. విచక్షణ, వివేకంతో ఆపరేషన్ సిందూర్ కొనసాగించినట్టు ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. అంటే, పాక్ ఉగ్రవాద కార్యాలయాలు తప్ప, పౌరులపై ఎలాంటి దాడులు చేయలేదనేది ఎయిర్ ఫోర్స్ ప్రకటన సారాంశం.
కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత, పాక్ ఉల్లంఘించిన నేపథ్యంలో భారత్ ఎయిర్ ఫోర్స్ ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. పాక్ తీరుపై భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక శాంతి కుసుమాలు వికసిస్తాయని అనుకుంటున్న తరుణంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది.
ఈ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భవిష్యత్ ప్రణాళిక, టార్గెట్ ఏవో ఉండడం వల్లే ఆపరేషన్ సిందూర్ పూర్తి కాలేదనే ప్రకటన చేసి వుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా పాక్‌లో కొన్నింటిని ధ్వంసం చేసే వ్యూహంతోనే ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసిందనే చర్చకు తెరలేచింది. ఎయిర్ ఫోర్స్ మరింత వివరంగా ఇచ్చే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకుంది.
వాడెవడు మిశ్రీ అంట, వాడే కదా దేశాన్ని ఉద్దేశిస్తూ కాల్పుల విరమణ చేస్తున్నాము 5 గంటల నుంచి అని,12 కి చర్చలు ఉన్నాయి అని,ఆ ట్రంప్ గాడు నేను ఆపాను అని డబ్బా కొడుతున్నాడు,అసలు వాడెవడు, దెబ్బతింది మనం వాడికేమీ నొప్పి
maryada ga matladara lanj@k0dakaa