మూవీ రివ్యూ: హిట్- ది థర్డ్ కేస్

ట్రైలర్ ఆకట్టుకోవడంతో…ఒక పవర్ఫుల్ క్రుయల్ కాప్ పాత్రలో నానిని చూడడానికి టార్గెట్ ఆడియన్స్ ఆసక్తి చూపించారు.

చిత్రం: హిట్- ది థర్డ్ కేస్
రేటింగ్: 2.5/5
తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి, సముద్రఖని, రావు రమేష్, తదితరులు
కెమెరా: సాను జాన్ వర్ఘీస్
ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్
సంగీతం: మిక్కీ జె మేయర్
నిర్మాతలు: ప్రశాంతి తిపిర్నేని, నాని
దర్శకత్వం: శైలేష్ కొలను
విడుదల: 1 మే 2025

ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి లేనంత ఓపెనింగ్ క్రేజ్ ఈ సినిమాకొచ్చింది. ఆల్రెడీ “హిట్” ఫ్రాంచైజ్ హిట్ కావడం, హిట్ 2 చివర్లో నాని ఇంట్రో కి మంచి స్పందనం రావడం, దానికి తోడు టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో…ఒక పవర్ఫుల్ క్రుయల్ కాప్ పాత్రలో నానిని చూడడానికి టార్గెట్ ఆడియన్స్ ఆసక్తి చూపించారు. ఇంతకీ ఎలా ఉందో చూద్దాం.

అర్జున్ సర్కార్ (నాని) ఒక సీరియస్ స్ట్రిక్ట్ కాప్. కేర్లెస్ గా ఉంటున్నట్టు కనిపిస్తూనే తన వృత్తి పట్ల నిబద్ధత, గౌరవం ఉన్నవాడు. విచిత్రమైన పద్ధతిలో అత్యంత క్రూరంగా ఒక మర్డర్ జరిగితే దాని మూలం కనుక్కునే పనిలో ఉండగా, అలాంటి మర్డర్లు దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయని తెలుస్తుంది. దాంతో ఆ టాస్క్ మీద పూర్తిగా దృష్టిపెడతాడు. అదంతా ఒక డార్క్ వెబ్ చేస్తున్న పని అని తెలుసుకుంటాడు. దాని వెనుక ఉన్నది ఎవరు? మోటివ్ ఏమిటి? అన్న విషయాల్ని చేదించే పనిలో పడతాడు. ఈ క్రమంలో అతనికొక ప్రియురాలు మృదుల (శ్రీనిధి శెట్టి). ఇంతకీ ఆ సైకో కింగ్ పిన్ ఎవరు? ఏమిటా కథ అనేదే కథనమంతా!

కథగా చూస్తే రియాలిటీకి చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బ్లూ వేల్ లాంటి సైకోపాతిక్ ఆన్లైన్ ఆటలు, స్క్విడ్ గేం లాంటి హింసాత్మక ఆఫ్లైన్ ఆటలు కలగలిపిన ఈ కాన్సెప్ట్ కొత్తగా అనిపించినా కృతకంగా అనిపిస్తూ ఆడియన్స్ లో ఎమోషన్ మీద పెద్దగా పనిచేయదు.

స్టైలిష్ మేకింగ్, ట్రెండ్ కి తగ్గ సాంకేతికత ఉన్నాయి తప్ప ఎక్కడా థ్రిల్లింగ్ మోమెంట్స్ లేవు. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో రక్తికట్టించాల్సినవి ఇన్వెస్టిగేషన్ సీన్లు. హీరో తెలివిగా ఒక క్రైం ని ఎలా ఛేదించుకుంటూ వెళ్తాడు, ఎలాంటి క్లూస్ తో విలన్ ని పట్టుకుంటాడు అనేది బలంగా ఉన్నప్పుడే ఇలాంటి సినిమాలు బాగున్నాయనిపిస్తాయి. ఆ పార్ట్ పూర్తి వీక్ గా ఉంది ఇందులో.

పరిస్థితులన్నీ హీరోకి అనుకూలంగా మారుతుంటాయి తప్ప, అతని తెలివికి పరీక్ష పెట్టే చాలెంజులు ఉండవు. ఒక వేళ చాలెంజు ఎదురైనా దానిని కండబలంతో ఎదుర్కుంటాడు తప్ప బుద్ధిబలంతో కాదు. అలా ఇంటిలిజెంట్ రైటింగ్ ఇందులో మిస్సయ్యింది.

ఒకవేళ అండర్ కవర్ కాప్ గా క్రైం ముఠాలోకి ప్రవేశించడం ఇంటిలిజెంట్ పార్ట్ అనుకుంటే అది ఆల్రెడీ 20 ఏళ్ల క్రితం “పోకిరి”లో చూసిందే.

ప్రధమార్ధం పాత్ర పరిచయం, అతని కుటుంబ నేపథ్యం, చిన్నపాటి లవ్ ట్రాక్ నడిచి ఇంటర్వెల్ టైం కి కథనం గాడిలో పడుతుంది. ద్వితీయార్ధం మొత్తం క్రైం ని ఛేదించడమే.

సాంకేతికంగా చూస్తే మిక్కీ జె మేయర్ సంగీతం పెద్దగా మూడ్ ని ఎలివేట్ చేయలేదు. ఈ తరహా చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ చేసి తన మార్క్ నిలబెట్టుకోవాలన్న తపన కనపడింది కానీ ఫలితం పెద్దగా చేకూరలేదు. పాటలు కూడా ఈ సారి అంతంతమాత్రమే. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అంటే మ్యూజికల్ హిట్స్ ఆశించడం సహజం. కానీ ఆ దాఖలాలు కనిపించలేదు. ఒక పాట రాక్ స్టైల్లో రణగొణ ధ్వనులతో సాగితే మరొకటి మాత్రం మిక్కీ జె మేయర్ స్టైల్లోనే ఉంది కానీ చెవుల్ని దాటి గుండెల్లోకి వెళ్లలేదు.

కెమెరా, ఎడిటింగ్ విభాగాలు బాగానే పని చేసాయి. ముఖ్యంగా కొన్ని చేజింగ్ సీన్స్ లో డ్రోన్ వాడిన విధానం బాగుంది.

నటీనటుల విషయానికొస్తే సహజనటుడు నానీ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేసాడు. అయితే తన సిగ్నేచర్ స్టైల్ కాని డొమైన్ లో బూతులు మాట్లాడుతూ నటించాడు. మరీ “దెం..”, “బాల్స్ ఫ్రీజ్ అవుతున్నాయ్..ఏం చేద్దాం”…ఇలాంటి వాటికి మించినవి కూడా కొన్ని వినిపించాయి.

దీనికి తోడు తన హీరో ఇమేజ్ ని ధ్వనించే డైలాగ్స్ కూడా కొన్ని చెప్పాడు. అవి బాగా పేలాయి. “క్లాస్ అనుకుని జనం ఇన్నాళ్లూ మోసపోయారు. ఇప్పుడు చూపిస్తా మాస్” అంటాడు ఒక చోట. మాస్ అంటే బూతులే అనుకున్నట్టున్నాడు కాబోలు! అలాగే ఇంకో చోట “యూ కాంట్ సర్వైవ్ హియర్” అని విలన్ అంటే, “నా కెరీర్ బిగినింగ్ నుంచీ వింటున్నాను ఈ మాట” అంటాడు. నాని నటనని వంక పెట్టడానికేం లేదు కానీ తాను పొషించిన క్రుయాల్టీకి, తన పర్సనాలిటీకి, ఇమేజ్ కి పూర్తిగా మ్యాచ్ అయినట్టు అనిపించదు.

హీరోయిన్ శ్రీనిధి శెట్టిది మునుపు తాను పోషించిన పాత్రలకంటే కాస్త నిడివి ఉన్న పాత్ర. హీరో-సెంట్రిక్ సినిమాల్లో హీరోయిన్లు షో పీసుల్లా ఉంటారంతే అని ఆమె ఈ మధ్యన అంది. దానికి భిన్నంగా కాస్త ఆమెకి ఇందులో స్కోపు దొరికింది. ప్రధమార్ధంలో అటూ ఇటుగా ఉన్నా సెకండాఫులో కాస్తంత యాక్షన్ యాంగిల్లో ఆకట్టుకుంది.

సముద్రఖని ఓకే. కానీ తననోటి వెంట కూడా ద్వంద్వార్ధాలు పలికించారు. రావు రమేష్ ది పెద్దగా ఇంపార్టెన్స్ లేని సగటు పోలీసాఫీసర్ పాత్ర.

ఇందులో ప్రధానమైన మైనస్ బలమైన విలన్ లేకపోవడం. ఎవడో సైకో కిల్లర్ ని విలన్ అనుకోమంటే ఆడియన్స్ కి హీరోయిజం కనపడదు. తెర మీద జరుగుతున్న ఫైట్స్ గట్రా బాగున్నాయి కానీ విలన్ చస్తున్నప్పుడు పొయెటిక్ జస్టిస్ జరిగిన ఫీలింగ్ కలగదు.

మొత్తం సినిమాలో మూడు సార్లు చాగంటి కోటేశ్వరరావు వాయిస్ లో హీరోయిజం గురించి చెప్పించడం కాంట్రాస్ట్ ఫ్లావర్ తో బాగుంది.

చివరిగా చెప్పేదేంటంటే, క్లైమాక్స్ లో రెండు స్పెషల్ కేమియోలు కనిపించారు. వాటికి హాలు దద్దరిల్లింది. హిట్ ఫ్రాంచైజ్ మీద యూత్ కి ఉన్న ఆసక్తికి, ఆదరణకి అది నిదర్శనం. తెరమీద మితిమీరిన హింసకి, రక్తపాతానికి యువత మొగ్గుచూపుతున్నారని “యానిమల్”, “మార్కో” చిత్రాలు నిరూపించాయి. అదే కోవలో నాని ఈ చిత్రంతో ముందుకొచ్చాడు. “హిట్” ఫ్రాంచైజ్ కి తగ్గట్టుగా ఒక కాప్, అతనికొక కేరెక్టరైజేషన్, డిపార్ట్మెంట్ కల్పించే టాస్క్, దానిని ఛేదించడం…ఇదే ఫ్లో. ఈ టెంప్లేట్ ని ఎంత కొత్తగా, ఎంత ట్రెండీగా చేయాలన్నదానిమీదే దృష్టి పెడుతూ వస్తున్నారు. ప్రతి పార్ట్ కి రేంజ్ పెరగడమంటే కేవలం వయొలెన్స్ తో కాదు..కంటెంట్ లో ఉన్న డెప్త్ తో కూడా పెంచుతున్నారన్నట్టు ఉండాలి. హిట్ 4 లో అయినా ఆ రకమైన రైటింగ్ ఉంటుందేమో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ హిట్ అనుకున్నంత గట్టిగా ప్రేక్షకుల మనసుల్ని హిట్ చేయలేదు. నేచురల్ స్టార్ నానిని కాసేపు వయొలెంట్ స్టార్ గా కొత్త స్టైల్లో చూడాలనుకునేవారికి ఓకే. కొత్త అనుభూతి ఏదో వస్తుందనుకుంటే మాత్రం రాకపోవచ్చు!

బాటం లైన్: వయొలెంట్ స్టార్ నాని

32 Replies to “మూవీ రివ్యూ: హిట్- ది థర్డ్ కేస్”

  1. నేచురల్ హీరో నాని నటించిన హిట్ 3 మూవీ మంచి ఇంట్రెస్టింగ్ మూవీ, బాగుంది సూపర్ మూవీ…

  2. ఇలా నెగటివ్ రివ్యూస్ ఇచ్చిన హిట్ పడింది పడుతుంది కూడా

  3. HIT3 

    పర్పస్ ఏంటి? 

    మోటో ఏంటి?

    క్రియేటివ్ స్పేస్ లో నుంచి బయటికి వచ్చి చూస్తే షైకో ప్రపంచం తప్ప ఏమి కనిపించదు. 

    మూవీ ఎంటర్టైన్మెంట్ అనే మూస లో హింసాత్మక షాట్స్, బూతులతో యువతకి మత్తెక్కించి డబ్బు సంపాదించడమే మేకర్స్ మోటో లా ఉంది.

    డబ్బు సంపాదించడమే ప్రథమ ప్రాధాన్యం అనుకొంటే ఈ ప్రపంచం లో చాలా వ్యాపారాలు ఉన్నాయి.. 

    ఎందుకు సినిమా అనే ముసుగులో భారత యువత జీవితాలను పాడుచేస్తారు ? 

    కొంచెం వదండయ్యా…

  4. ఈ గ్రేట్ ఆంధ్రా గాడిద కొడుకు మంచి సినిమాలకు కూడా చెత్త రివ్యూస్ ఇస్తాడు, సినిమా నిజంగా చాలా బాగుంది, ఈ Paytm రివ్యూ గాడు లంగా పనులు చేస్తూ రివ్యూ లు రాస్తాడు 

    1. orey Adda Gadidha kodaka Sriram.. Nenauthe ee nani lanj koduku over action movie li rating 1 ivvvadame ekkuvara chettha naakodaka.. neeku nani gaadi modda antha tastie ga vunte nee pellam notlo pettinchu badako

  5. నువ్వు తియ్యరా సినిమా ఎర్రి పూకా ప్రతి ఒక్కడు రివ్యూ ఇచ్చే వాడే

          1. ఆ సినిమా నేను చూసినా? నాకు తెలీదే? పొర దరిద్రపు వెధవ, అసలు నీలాంటి మ్యానర్ లెస్ బ్రూట్ కి రిప్లై ఇవ్వడం నా తప్పు. 

      1. వాడిని తిడితే నీ ఏడుపెంట్రా? కళ్లు తుడుచుకోరా ఏడుపుగొట్టు.

  6. ఇన్ని బూతు పదాలు వాడటం అవసరమా …. ఛీ ఛీ

    కోర్ట్ సినిమా తో పెరిగిన నాని స్థాయి…. ఈ సినిమాతో దిగజారింది…

    1. సినిమా ఫ్లో లో బూతులు రావడం వేరు, కేవలం బూతులు ఉండడానికే కొన్ని డైలాగ్స్, సీన్స్ క్రియేట్ చేశారు. మాస్ అంటే బ్లడ్, బూతులు అనుకుంటున్నాడు నాని. 

  7. భూతులు చాలా ఓవర్ గా ఉంది . ఫ్యామిలి తో చూడటం చాలా ఇబ్బింది గా ఉంది 

  8. The movie was fairly average overall. While it had some interesting moments, the excessive violence overshadowed any meaningful storytelling or character development. It felt like the filmmakers relied too heavily on shock value rather than focusing on a compelling plot. Personally, I would have enjoyed it more if there had been better pacing and a stronger emotional connection with the characters

Comments are closed.