సాధారణంగా ఎంత భారీ సినిమాలు అయినా హిందీ సినిమాలు తెలుగులో అయితే నేరుగా పంపిణీ చేసుకుంటారు. లేదా పంపిణీకి ఇస్తారు. కానీ మన హీరోలు నటిస్తుండడంతో భారీ రేట్లకు విక్రయించుకునే అవకాశం వారికి వస్తోంది. ఆదిపురుష్ సినిమా తెలుగు హక్కులు అప్పట్లో 120 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా పరిస్థితి కూడా ఇదే. ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. హృతిక్ రోషన్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో ఒక హీరో.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫైట్లు వున్నాయి. పాటలు వున్నాయి. డ్యాన్స్ లు వున్నాయి. అందువల్ల ఈ ప్రాజెక్ట్ మీద తెలుగులో క్రేజ్ ఏర్పడింది. దాంతో సినిమా రైట్స్ కు పోటీ వచ్చేసింది. ఎన్టీఆర్ తో సన్నిహితంగా వుంటూ, నీల్సన్ కాంబినేషన్ లో సిన్మా ప్లాన్ చేస్తున్న నిర్మాత నాగవంశీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ మాట సాయం ఎలాగూ చేస్తారు. ఎందుకంటే ఎన్టీఆర్ దేవర సినిమాకు మంచి రిలీజ్ ఇచ్చారు కనుక.
ఇదిలా వుంటే ఆసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ సినిమా తెలుగు హక్కుల రేటు ఎంత వుంటుంది అన్నది డిస్కషన్ పాయింట్ గా వుంది. తెలుగు హక్కులు 120 కోట్ల మేరకు పలుకుతాయనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ అంత రేటు కిట్టుబాటు అవుతుందా అన్నది అనుమానం?
దేవర సినిమాను 120 కోట్ల మేరకు తెలుగు రాష్ట్రాల్లో విక్రయించారు. కొన్ని చోట్ల జిఎస్టీతో, మరి కొన్ని చోట్ల కాస్త అటు ఇటుగా పాస్ అయ్యారు. అది స్ట్రయిట్ తెలుగు సినిమా. వార్ 2 హిందీ డబ్బింగ్. ఎన్టీఆర్ పాత్ర మాత్రమే ఫుల్ గా వుండదు. ఆయనతో పాటు హృతిక్ రోషన్ కూడా వుంటారు. అందువల్ల తెలుగులో ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే మిగిలిన వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. యాక్షన్ జానర్ కనుక బయ్యర్ల ధైర్యం చేయచ్చు.
పోటీ ఎప్పుడైతే వుందో, నిర్మాతలు ఏ రేటు వరకు వెళ్తారో చూడాలి. ఒకటి రెండు రోజుల్లో డీల్ ఫైనల్ కావచ్చు.
Nagavamshi gadu 120crores ki koni e cinema tho modda gudisi povali.