అస్సలు బ్రేకప్ అయిన బాధ లేదు

తమన్నా మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. బ్రేకప్ అయిన బాధ ఆమె ముఖంలో కనిపించలేదు.

బ్రేకప్ అయితే సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడో ఫ్యాషన్ అయింది. మొన్నటికిమొన్న అనన్య పాండే తన స్నేహితులందరికీ బ్రేకప్ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి తన మాజీ ప్రియుడు ఆదిత్యరాయ్ కపూర్ ను కూడా ఆ పార్టీకి పిలిచింది.

ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. ఈమె కూడా తన బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం తమన్న, విజయ్ వర్మ కలిసి కనిపించడం లేదు. వీళ్లకు బ్రేకప్ అయినట్టు బాలీవుడ్ మీడియా దాదాపు కన్ ఫర్మ్ చేసేసింది.

ఇలాంటి కఠినమైన సమయంలో పాపం తమన్నా ఎలా లైఫ్ లీడ్ చేస్తుందోనంటూ ఆమె అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. అయితే తమన్నా మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. బ్రేకప్ అయిన బాధ ఆమె ముఖంలో కనిపించలేదు.

ఈరోజు తన ఫ్రెండ్స్ తో కలిసి హోలీని సెలబ్రేట్ చేసుకుంది తమన్న. తను ఎలాంటి బాధలో లేనని, సంతోషంగానే ఉన్నానని చెప్పడం కోసం ఆమె ఆ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.

నిజంగానే, తమన్నా చాలా సంతోషంగా ఉంది. బ్రేకప్ తర్వాత ఆమె తొలి పండగను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంది. 35 ఏళ్ల తమన్న బ్రేకప్ నుంచి ఈజీగానే కోలుకుంది. విజయ్ వర్మ నుంచి కూడా ఇలాంటి ఓ వీడియో వస్తే ఓ పనైపోద్ది.

7 Replies to “అస్సలు బ్రేకప్ అయిన బాధ లేదు”

  1. విజయ వర్మ కనీసం ఒక సంవత్సరం ” హ్యాపీ డేస్” గడిపాడు …ఇంకేం కావాలి సామీ ఆయనకు…తమన్నా నే పిచ్చిది

Comments are closed.