మరో సినిమా మొదలుపెట్టిన పవన్

ఈ ఏడాదిన్నర గ్యాప్ లో పవన్ ఫిజిక్ లో మార్పు వచ్చేసింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే, ఓజీ గ్లింప్స్ లో పవన్ కాస్త ఫిట్ గా కనిపించారు.

రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తిచేసిన పవన్ కల్యాణ్, అదే ఊపులో ఓజీ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. పవన్ గ్రీన్ సిగ్నల్ తో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇప్పుడు సెట్స్ పైకి పవన్ కల్యాణ్ వచ్చారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 70-75 శాతం షూటింగ్ పూర్తయింది. ఇదంతా జరిగి దాదాపు ఏడాదిన్నర అయింది. మళ్లీ ఇన్నాళ్లకు సెట్స్ పైకి వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ టైమ్ లో పవన్ కేవలం నటుడు మాత్రమే. తిరిగి సెట్స్ పైకి వచ్చేసరికి ఆయన డిప్యూటీ సీఎం. కాబట్టి బిజీ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా ఇంత టైమ్ తీసుకున్నారు. మధ్యలో హెల్త్ కూడా కాస్త ఇబ్బంది పెట్టింది.

అయితే ఈ ఏడాదిన్నర గ్యాప్ లో పవన్ ఫిజిక్ లో మార్పు వచ్చేసింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే, ఓజీ గ్లింప్స్ లో పవన్ కాస్త ఫిట్ గా కనిపించారు. ఇప్పుడేమో ఆయన కాస్త నీరసంగా, ఇంకాస్త బొద్దుగా కూడా కనిపిస్తున్నారు. దీన్ని ఎలా మ్యాచ్ చేస్తారో చూడాలి.

లుక్ సంగతి తర్వాత, పవన్ రెగ్యులర్ గా షూటింగ్ కు వస్తే అదే చాలు అనుకుంటోంది యూనిట్. ఈ సినిమాకు ఆయన 2-3 వారాలు కేటాయించాల్సి ఉంటుంది. అంత టైమ్ కేటాయించగలరో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

6 Replies to “మరో సినిమా మొదలుపెట్టిన పవన్”

    1. bongu emi kaadu… veedu hero entra…

      paritala gaadu gundu korigaadu…

      cbn gaadu assam Kerala trips…pampichadu

      veedu ekkuva matladithe unna dycm kuda poddi..

      1. ఆతులు గోకికి కూడా పనికి రావు నువ్వు ఆయన గురించి matladuthav యర్రీపుక్ గా

Comments are closed.