అమరావతి పునఃప్రారంభ సభ కాదు కానీ, భరణి నోట వెలువడిన దివాకరబాబు గేయం ఎల్లెడలా మారుమ్రోగింది. అదేమిటో వేరే చెప్పనక్కరలేదు. బాబు తన ఫస్ట్ టెర్మ్‌లోనే మళ్లీ, మళ్లీ శంకుస్థాపనలు చేశారు. ఈ టెర్మ్‌లో వస్తూనే అమరావతి మీదే పడ్డారు. ఉచితాలపై చేసిన బాసలు గట్టున పెట్టి, పథకాలు అటకకు ఎక్కించి, అమరావతి పని పట్టారు. ఎన్నికలకు ముందు అనేక వాటి గురించి మాట్లాడినా, ఆయన ఏకైక లక్ష్యం యిదేనని అందరికీ తెలుసు. తెలిసే ఓట్లేశారు. ఈ సారైనా ప్రాక్టికల్‌గా ఆలోచించి, ఏదో ఒక స్థాయిలో ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత నిర్మాణం చేస్తారేమోనని, ఆ తర్వాత ప్రయివేటు పెట్టుబడులు వాటంతట అవే వచ్చి క్రమేపీ వ్యాప్తి చెందుతుందనీ ఆశించినవారి సంఖ్య తక్కువేమీ కాదు. కానీ బాబు పదేళ్ల క్రితం చేసినదే మళ్లీ చేస్తున్నారు.
ఆకాశహర్మ్యాలకు నిచ్చెనలూ, విదేశీ నగరాలతో పోలికలూ, సెల్ఫ్ సస్టయినింగ్ కాపిటల్ అని చెప్తూనే అప్పులు తేవడాలూ, ఎడాపెడా భూములు పంచిపెట్టడాలూ, అంతా పట్టుకెళ్లి అక్కడే పెట్టడాలూ.. సేమ్ టు సేమ్. కూటమి పదవీకాలం 2029 (జమిలి ఎన్నికలు రాకపోతే) లోపున ఏ మేరకు పూర్తవుతుందో ఎవరూ గెస్ చేయలేరు. ఎందుకంటే రాబోయే తరంలో ఏ టెక్నాలజీ వుంటుందో కూడా దర్శించగల బాబు ఊహకి సైతం అందనంతగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని టిడిపియే చెప్తోంది. అప్పు పుట్టే పరిస్థితి లేదంటోంది. ప్రపంచ బ్యాంకైనా, మరొకటైనా అప్పు యిస్తుంది తప్ప ఉత్తినే డబ్బు ధారపోయదు కదా. అప్పన్నాక వడ్డీ అవీ తప్పవు. అమరావతి బంగారు గుడ్లు పెట్టే బాతు కావడానికి చాలా టైము పడుతుంది. ప్రస్తుతానికి అది బంగారం మింగే బాతుపిల్లే.
ఈలోగా జగన్ మళ్లీ వస్తే ఏమవుతుందోననే భయం వెంటాడుతోంది. రాడని మీరూ నేనూ అనుకోవచ్చేమో కానీ టిడిపి అలా చెప్పటం లేదు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడేమోనని పారిశ్రామిక వేత్తలు హడిలి ఛస్తున్నారనీ, రాడని గట్టి హామీ యిస్తేనే వచ్చి పెట్టుబడులు పెడతామంటున్నారని లోకేశ్ చెప్పారు. ఏ ప్రభుత్వమైనా అలా హామీ యివ్వగలదా? ఇస్తేగిస్తే ప్రజలంతా కలిసి, జగన్ పార్టీకి ఓట్లేయం అని బాండ్లు రాసి యివ్వాలి. పార్టీ అని ఎందుకంటున్నానంటే జగన్ జైలుకి వెళ్లినా, ఆ పార్టీ నుంచి మరొకరు వచ్చి జగన్ విధానాలే కొనసాగించవచ్చు. జగన్ కత్తి వేళ్లాడుతూనే వుందని అనుకోవడానికి మరో కారణం వుంది. తాము అధికారంలోకి రావడం కాదు, జగన్‌ని రానీవకపోవడమే తను పెట్టబోయే పార్టీ లక్ష్యమని టిడిపి పక్షపాతి ఎబి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇలా చెప్పే పార్టీ ప్రపంచంలోనే ఏకైక పార్టీ ఏమో! జగన్ తిరిగి వస్తే రాజధానిని మార్చకపోవచ్చు కానీ యీ హంగులూ, పొంగులూ వుండవని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఏదో సంసారపక్షపు రాజధానిగా మాత్రమే వుంటుంది.
ఇన్ని సందేహాల మధ్య బాబు పునర్నిర్మాణం మొదలుపెట్టారు సరే, దానికీ అట్టహాసం దేనికి? ఎవరైనా అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ అట్టహాసంగా జరిగినా పెళ్లి ఆగిపోయిందనుకోండి. మరో సంబంధం చూసుకున్నపుడు ఎంగేజ్‌మెంట్ వద్దంటుంది. తప్పదంటే సింపుల్‌గా చేద్దామంటుంది. ఎందుకంటే యీ ఎంగేజ్‌మెంట్ టైములో పాత దాని సంగతి గుర్తుకు వస్తుంది. ఆ పెళ్లి ఎందుకు తప్పిపోయిందనే ఆరాలు వస్తాయి. అమరావతి ముందుకు సాగకపోవడానికి జగన్ ముఖ్యమంత్రి కావడం అని బుకాయించడానికి లేదు. 2017 నాటికే అమరావతి పురోగతిపై సందేహాలు ముసురుకున్నాయి. రేట్లు పడిపోసాగాయి. 2018 నాటికి బాబు మోదీపై ధ్వజం ఎత్తేశారు – నమ్మకద్రోహం చేశారు, హోదా యివ్వలేదు, ప్యాకేజీ యివ్వలేదు, రాజధానికి సహకరించ లేదు.. అంటూ! నోట మట్టి కొట్టారు, ఆశలపై నీళ్లు చిలకరించారు అన్నారు.
ఈ సారి మోదీ వస్తున్నారనగానే మట్టీ నీళ్లూ మాత్రం తేరని తెలిసిపోయింది, ముల్లె తెస్తారా (గుజరాతీలు తరచుగా వాడే రోక్‌డా (క్యాష్) లేదా అనేదే సందేహంగా మిగిలింది. ఫంక్షన్ కాగానే ఆ సందేహమూ తీరిపోయింది. పరస్పర స్తుతిపాఠాలు వినిపించాయి తప్ప హామీలు వినిపించలేదు. గతంలో ఆంధ్రులు శక్తిమంతులు, కట్టుకోగలరు అనే టోన్‌లో మాట్లాడితే యీసారి బాబు శక్తిశాలి, కట్టగలరు అనే టోన్‌లో మాట్లాడారు తప్ప మా వంతుగా మేం యిది యిస్తున్నాం అనే ఆఫర్ యివ్వలేదు. అలాటివన్నీ బిహార్‌లోనే వినబడుతున్నాయి. అమరావతిలో కష్టపడి ఆకాశహర్మ్యాలు కట్టినా పెట్టుబడులు వస్తే తప్ప వాటికి గిరాకీ రాదు. పెట్టుబడులకు, ప్రత్యేక హోదాకు లింకు వుందని, దానికి డబ్బులేవీ ఖర్చు కావనీ అందరికీ తెలుసు. అయినా బాబు అడగరు, మోదీ ఆ మాట ఎత్తరు.
49 వేల కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్టులకు శంకుస్థాపన వంటివి జనాలు నమ్మడం మానేశారు. ప్రారంభోత్సవం జరిగినప్పుడే అమ్మయ్య ప్రాజెక్టు పూర్తయింది అనుకోవాలి. ఈ అంకెలంటారా? ఎంతైనా చెప్పుకోవచ్చు. టెండర్లు అస్మదీయులకు కట్టబెట్టాక, రివైజ్‌డ్ అంటూ యింకా పెంచుకోవచ్చు. నిధులు రాక, ఆలస్యం అయిన కొద్దీ ఆ అంకె యింకా పెరుగుతుంది. అదిగో మెట్రో, యిదిగో ఐకాన్ టవర్ అంటూ ఎన్నయినా చెప్పవచ్చు. బాబు తొలి టర్మ్‌లో కట్టిన సెక్రటేరియట్ వగైరాలు తాత్కాలికమైనవి అన్నారు. వైసిపి వాళ్లు వచ్చి ఐదేళ్లలో తాత్కాలికమైనవే కట్టారని ఎద్దేవా చేస్తే, ‘అవేమైనా అట్టముక్కలతో కట్టినవా? పర్మనెంటువే.’ అన్నారు. ఇప్పుడు మళ్లీ తాత్కాలికమైనవే, అసలైనవి గ్రాండున్నరగా రాబోతున్నాయంటూ మాట మారుస్తున్నారు.
ఏ కథైనా సరే మొదటిసారి విన్నంత రంజుగా రెండోసారి వినరు. ఫస్ట్ టెర్మ్‌లో నవ్యాంధ్ర, స్వర్ణాంధ్ర అంటూ ఊదరగొట్టారు. నేను మామూలుగా ఆంధ్ర అని రాస్తే కొందరు పాఠకులు కోప్పడేవారు – స్వర్ణాంధ్ర అని రాయరేం? అక్కడ బంగారు గుడ్లు పెట్టే బాతు వుందిగా – అంటూ! ఐదేళ్లు గడిచాయి. ఊరించి, ఉసూరు మనిపించారని ఆగ్రహించిన జనం గద్దె దింపారు. మళ్లీ ఎక్కించారు కాబట్టి ఓ ఏడాదిలో ఏదైనా కట్టి చూపిస్తే జనాలు హర్షించేవారు. మళ్లీ పెద్దపెద్ద ప్లానులు, మరింతగా వేలాది ఎకరాల భూమి సేకరించడాలు.. జనాలకు దేజావూ ఫీలింగు వచ్చేసింది. దీనికి తోడు కొత్తగా వరదల భయం వచ్చి పడింది. అప్పట్లో పర్యావరణం నాశనమౌతుందన్న భయం మాత్రమే వుండేది. ఇప్పుడు వరదల కారణంగా అమరావతే దెబ్బ తింటుందన్న భయం వచ్చి చేరింది. అది నివారించడానికి రిజర్వాయర్లు కడతామంటున్నారు. అదో కొత్త ఖర్చు. మోదీ గారు వెళ్లిన మర్నాడు కురిసిన వర్షం అవేళే కురిసి వుంటే అందరూ బిత్తరపోయేవారు. ఇక్కడకు వచ్చి సొంత బిల్డింగులు కట్టాలంటే చాలా ధైర్యమే కావాలి. ప్రభుత్వం చవకగా భూములిస్తే పుచ్చుకోవచ్చు కానీ భవంతులు కట్టడమా, అమ్మో!
ప్రజల్లో యిన్ని భయాలు, సంకోచాలు వున్నపుడు కాస్తయినా కట్టి అప్పుడు ప్రారంభోత్సవానికి మోదీని పిలిస్తే యివి చూపించి, మరింత అప్పు యిప్పించండి అని అడగవచ్చు. ఆ మార్కెటింగుకి డబ్బు ఖర్చు పెట్టినా అదో అందం. ఏవీ లేకుండా, ఒట్టి ప్రణాళికలు వేయడానికి యింత ఖర్చు అవసరమా? గుజరాత్‌తో సహా తక్కిన రాష్ట్రాలు తమ రాజధానులను కట్టినప్పుడు యిలాగే చేశాయా? అనే ఆలోచనలు ప్రజలకు రావా? అనుకోకుండా మూడు రోజుల క్రితమే సింహాచలం గోడ కూలింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులే కూలుతూంటాయి. గోడ కూలడం అసాధారణమని అనడానికి లేదు. కానీ సరిగ్గా అమరావతి పునఃప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతూన్నపుడే యిలా జరగడం శంకలు రేకెత్తించింది. మొదటి టెర్మ్‌లో కట్టిన సెక్రటేరియట్ క్వాలిటీయే బాగా లేదని ఫిర్యాదులు వచ్చాయి. ఇదిగో, యిప్పుడీ గోడ. వర్షం ఉధృతికి కూలిందని దేవాదాయ శాఖ కమిషనర్ అన్నారు. ఆ మధ్య సరైన సమయంలో గేట్లు ఎత్తకపోవడం వలన అమరావతి పరిసరాలన్నీ మునక. వర్షానికే పడిపోయే గోడలు కట్టే యిలాటి ఎడ్మినిస్ట్రేషన్ కళ్లు చెదిరే ప్రపంచస్థాయి మహానగరం (బాబు మాటల్లో) కడతానంటే నమ్మడం కష్టంగానే వుంది.
కానీ మూడేళ్లలో పూర్తి చేసి మోదీ చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామని బాబు అన్నారు. మూడేళ్ల తర్వాత జగన్ కుట్ర వలన పూర్తి చేయలేక పోయానని అన్నా ఆశ్చర్యపడ నక్కరలేదు. బోట్లతో వరదల్ని, గాలిపటాలతో తుపానులను, రాళ్లతో భూకంపాలను తెప్పించి బిల్డింగులను కూల్చేశాడని అన్నా జోక్ అనుకునే స్థితి లేదు. తిరుపతిలో టిక్కెట్ల మరణాలకు, సింహాచలం గోడ మరణాలకు, అన్నిటికీ జగన్నే బాధ్యుణ్ని చేసి తెలుగు మీడియా రాస్తోంది. కేంద్రం సహకరించక పోవడంతో చేయలేక పోయాం అని యీసారి మాత్రం ఛస్తే అనరు. మోదీ ‘2015లో శంకుస్థాపన చేశాక యీ పదేళ్లుగా అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు యిచ్చాం.’ అని చెప్పేసుకుంటూ వుంటే కిమ్మనలేదు. దేశవ్యాప్తంగా వేయాల్సిన రోడ్లు, రైలు మార్గాలు ఆంధ్ర ద్వారా వెళుతూంటాయి కాబట్టి, వాటిని కూడా కలిపేసి, యిదంతా ఆంధ్ర కిచ్చాం అని లెక్కలు చెప్తూ వుంటే, అదేమిటి సార్, మాకు ప్రత్యేకంగా ఏమిచ్చారో చెప్పండి. అవన్నీ రాష్ట్రాలను కలుపుతూ వేసిన జాతీయ ప్రాజెక్టులు కదా అని అన్నవారు లేరు. మోదీ ప్రారంభోత్సవం చేసిన రూ.3680 కోట్ల పనులు 8 రహదారులకు సంబంధించినది. అలాగే రూ.254 కోట్ల ప్రాజెక్టు రైల్వేకు సంబంధించినది. కొన్ని డిఫెన్స్ ప్రాజెక్టులు కూడా స్ట్రాటజిక్ కాలిక్యులేషన్స్‌తో ఎలాట్ చేస్తారు. వాటినీ కలిపి చెప్పేశారు.
ఈ క్లెయిమ్స్ మాట సరే, కానీ పైసా పెట్టకుండా అమరావతి కట్టేస్తున్నామనీ, దాని ఖర్చు అదే రాబట్టు కుంటుందనీ బాబు చేసే క్లెయిమ్ ఎలా నమ్మగలం? భూములిచ్చిన రైతులు త్యాగం చేశారంటూనే నెలనెలా డబ్బులిస్తూన్నారు. వాళ్లు యిచ్చినది ఉత్తినే కాదు, డెవలప్‌మెంట్‌కి! డెవలప్ చేస్తానని తీసుకున్న బిల్డర్ (అనగా ప్రభుత్వం) ఆ పని పూర్తయ్యేదాకా డబ్బు చెల్లించాలి కాబట్టి యిస్తూన్నారు. పదేళ్లగా ప్రభుత్వానికి ఖర్చే తప్ప, ఆదాయం లేదు. ఇక పైసా ఖర్చు లేదని ఎలా అనగలరు? ఆంధ్ర ఏర్పడినప్పుడు రాజధాని నిర్మాణానికి.. అంటూ మీడియా సంస్థలతో సహా విరాళాలు సేకరించారు. అవి ఖర్చయిన తీరు గురించి ప్రభుత్వం శ్వేతపత్రం వేసిందేమో నాకు తెలియదు.
ఇప్పుడు కూడా పునఃప్రారంభానికి 31 వేల కోట్లు అప్పు తెస్తూ, 47 వేల కోట్ల టెండర్లు పిలిచారు. సెక్రటేరియట్ నాలుగు టవర్ల, సిఎంఓ అంచనా 2018లో రూ.2271 కోట్లయితే, యిప్పుడది రూ.4698 కోట్లు. తెలంగాణ సెక్రటేరియట్‌కు ఎంత అయిందని వాకబు చేయకండి, యిబ్బంది పడతారు. లోను విడుదల అయ్యే జాప్యం బట్టి ఈ అంచనాలు యింకా పెరగవచ్చు. ఇప్పించిన నిధులు ఎలా వినియోగం చేశారో, ఆ యుసిలు పంపండి అని కేంద్రం అడగడం, మీకెందుకు చెప్పాలని బాబు మొరాయించడం… యివన్నీ గతంలో చూశాం. ఇంత ఖర్చు యిక్కడే పెట్టి యిన్ని యిబ్బందులు ఎందుకు తెచ్చుకోవాలి? అనే ప్రశ్న సహజంగా వస్తుంది కాబట్టి దానికి సమాధానంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘అమరావతి కొందరిదా? అందరిదా?’ అంటూ కొత్త పలుకు పలికారు.
నగరీకరణే అన్ని అనర్థాలకు మూలం అని ఎన్నాళ్లగానో వినవస్తున్న మాట. కానీ రాధాకృష్ణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహానగరం ఏర్పడి తీరాలని, గతంలో 23 జిల్లాల ఆదాయం హైదరాబాదులో కుమ్మరించడం చేతనే అది మహా నగరమై తెలంగాణ మొత్తానికి ఆదాయం సమకూరుస్తోందని, ఆంధ్ర విషయంలోనూ అదే జరిగితే మంచిదని వాదిస్తున్నారు. గంపగుత్తగా హైదరాబాదు అనడమే తప్ప చాలాకాలంగా పరిశ్రమలన్నీ హైదరాబాదు చుట్టూ వున్న జిల్లాలలో వస్తున్నాయని ఆయన గుర్తించలేదా? అమరావతికి చుట్టూ వున్న జిల్లాలకు పరిశ్రమలు పంచితే తప్పా? అక్కడే మరో 44 వేల ఎకరాలు సేకరించాలా? నగరనిర్మాణం గురించే మాట్లాడుతున్నవారు, నగరనిర్వహణ గురించి మాట్లాడరేం? నగరం పెద్దదైన కొద్దీ తాగునీరు, డ్రైనేజి, శాంతిభద్రతలు, ట్రాఫిక్, గృహవసతి… అన్నీ సమస్యలే కదా! వాటి కయ్యే ఖర్చు కూడా లెక్కలోకి వేసుకోవాలిగా!
అయినా అంతా రిమోట్‌లో జరిగే యీ రోజుల్లో అసలు అమరావతిలోనే ఆఫీసు పెట్టవలసిన అవసరమేముంది? బాబే చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశంతో నెలకు లక్షా, రెండు లక్షల జీతం వచ్చేలా యువతకు స్కిల్స్ సమకూరుస్తానని! అమలాపురంలో, హిందుపురంలో యింట్లో కూర్చుని సేవలందించే సౌకర్యం వుండగా మరి అమరావతిలో దివ్యసౌధాలెందుకు? ఒకప్పుడు ఆఫీసంటే టేబుల్సూ ఫైళ్లూ వ్యవహారం వుండేది. తర్వాత లాప్‌ట్యాప్ ఎక్కడికి పట్టుకెళితే అదే ఆఫీసనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అరచేతిలో సెల్ వుంటే చాలు. రిస్ట్‌వాచ్‌లోనే చాలా ఫీచర్స్ వచ్చేశాయి. ఏఐ ముదిరాక ఏ ఉంగరమో గీకితే గాల్లో అంకెలూ, అక్షరాలూ కనబడే రోజులు రావచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసులు, టెలీ మెడిసిన్స్ వచ్చేశాయి. ఇలాటి కాలంలో బ్రిక్ అండ్ మోర్టార్ బిల్డింగులు కట్టవలసిన అగత్యమేముంది? ఇన్నీ ఒకే చోట కట్టి, స్పేస్ కొనేవారు లేక, బావురుమంటూ ఖాళీగా పడి వుంటే, అది బంగారు గుడ్ల బాతెలా అవుతుంది? తెల్ల ఏనుగవుతుంది తప్ప!
ఇలా అడిగితే ఆంధ్రద్రోహి అంటారు. ‘ఆంధ్ర నాయకులు నిలువీత యీదుతున్నారు, అంగుళం పురోగతి లేద’ని శ్రీశ్రీ ఎప్పుడో అన్నాడు. నిలువీతలో యాక్టివిటీ కనబడుతుంది, ఫార్వార్డ్ మూవ్‌మెంట్ వుండదు. బాబు యాక్టివిటీ కూడా అలాటిదే, దానికి తోడు ఆర్భాటాలొకటి! ఏదో చేస్తామంటారు, ఎలా చేస్తారు? అని అడిగితే ఆగ్రహం వస్తుంది. గెలిచే ముందు వరాలు కురిపించారు, ఎలా అమలు చేస్తారంటే సంపద సృష్టిస్తామన్నారు. ఈ 11 నెలల్లో ఎంత సృష్టించారో చూశాం. అలాగే అమరావతీ సృష్టిస్తామంటున్నారు. మనం ఏమనుకున్నా ఆయన దారి ఆయనదే, లేకపోతే ఆయన వెనకాల వున్నవారు ఊరుకోరు. మూడేళ్లలో ఆయన చెప్తున్న రాజధాని పూర్తి అవుతుందా లేదా అంటే యువర్ గెస్ యీజ్ ఏజ్ గుడ్ ఏజ్ మైన్. గుఱ్ఱం ఎగురుతుందేమోనని ఆకాశం వైపు చూడడం తప్ప మనం చేసేదేమీ లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్
/// గతంలో 23 జిల్లాల ఆదాయం హైదరాబాదులో కుమ్మరించడం చేతనే అది మహా నగరమై తెలంగాణ మొత్తానికి ఆదాయం సమకూరుస్తోందని, ఆంధ్ర విషయంలోనూ అదే జరిగితే మంచిదని వాదిస్తున్నారు. ///
.
అలా చెయాలి అనుకుంది మన జగన్ అన్నే!
ఇప్పటికె బాగా అబిరుద్ది చెందిన విశాకలొనె రాజదాని కూడా పెడితె హైదెరాబాదు లా అబిరుద్ది చెందుతుంది అని చెప్పింది మన బులుగు నాయకులె! మరిచిపొతె ఎలా?
అమరవతిలొ భూమి ఇచ్చిన రైతుకి 25% శాతం మాత్రమె భూమి తిరిగి వస్తున్న దరిమిలా.. రొడ్లు, పార్కులు, రాజదాని భవనాలు, పరిశ్రమలకి భూములు, లాంటి వాటికి భూములు పొయినా కొంత భూమి ప్రబుత్వాని మిగులుతుంది. అవి అమ్మితె నిర్మాణ భారం కొంత అన్నా తిరిగి వస్తుంది. విశాలలొ ఆ వెసులుబాతు లెదు!
///సెక్రటేరియట్ నాలుగు టవర్ల, సిఎంఓ అంచనా 2018లో రూ.2271 కోట్లయితే, యిప్పుడది రూ.4698 కోట్లు. తెలంగాణ సెక్రటేరియట్‌కు ఎంత అయిందని వాకబు చేయకండి, యిబ్బంది పడతారు. ///
.
మన రిషికొండ ప్యాలెస్స్ తొ పొచుకుంటె ఇంకా బాగా అర్ధం అవుతుంది అనుకుంటా!
సుమారు ఒక లక్ష చదరపు అడుగులతొ కట్టిన జగన్ ఆన్న ప్యాలెస్ కి కర్చు అయ్యింది సుమారు 450 కొట్లు. మరి 56 లక్షల చదరపు అడుగులతొ కడుతున్న సెక్రటెట్ 4698 కోట్లు చెయదా?
.
ఒక భవనాన్నిపొల్చెటప్పుడు కనీసం అక్కడ ఎన్ని చదరపు అడుగులలొ కడుతున్నరొ తెసుకొని పొల్చండి.
rey musaloda nuvvu maha batikite inko 5-10 yellu.. nee chaadastaniki AP youvata bhavishyattu yenduku balipedutunnav … G moosukuni koorcho ee vishyamlo
Farmers or anyone compensation lekunda lands ela istharu. Is any examples ? .. who told that they r getting compensation for every month ?? It’s for Annually and nominally ( 1 acre ki 20000 approximately.. where as others getting pinchan 4000 every month without doing nothing.. is it not waste to state ?? ).. In normal deals also if builder will not finish in the stipulated time, court will tell to pay the compensation for the prolonging time.
Far mers or anyone com pensation lekunda lan ds ela istharu. Is any examples ? .. who told that they r getting co mpensation for every month ?? It’s for Ann ually and nominally ( 1 acr e ki 20000 app roximately.. where as others getting pin chan 4000 every month without doing nothing.. is it not waste to state ?? ).. In normal de als also if builder will not finish in the stipulat ed time, cout will tell to pay the compensation for the prolonging time.
Far mers or anyo ne com pensation lekunda lan ds ela istharu. Is any e xamples ? .. who told that they r getting co mpensation for every mo nth ?? It’s for Ann ually and nom inally ( 1 acr e ki 20 000 app roximately.. where as others getting pin chan 4000 every mon th without doing nothing.. is it not wa ste to sta te ?? ).. In nor mal de als also if bui lder will not finish in the stip ulat ed time, co ut will tell to pay the compen sation for the prolo nging time.
Far mers or a nyo ne com pens ation leku nda lan ds ela istharu. Is any e xamples ? .. who tol d that th ey r get ting co mpensation for ever y mo nth ?? It’s for Ann ually and nom inally ( 1 a cr e ki 20 000 app roxima tely.. where as ot hers get ting pin chan 40 00 ev ery mon th with out d oing not hing.. is it not wa ste to sta te ?? ).. In nor mal de als also if bui lder will not fin ish in the stip ulat ed time, c o ut will t ell to pa y the compen sation for the prolo nging time
Did they include single penny in state budget?
///అక్కడే మరో 44 వేల ఎకరాలు సేకరించాలా? నగరనిర్మాణం గురించే మాట్లాడుతున్నవారు, నగరనిర్వహణ గురించి మాట్లాడరేం? నగరం పెద్దదైన కొద్దీ తాగునీరు, డ్రైనేజి, శాంతిభద్రతలు, ట్రాఫిక్, గృహవసతి… అన్నీ సమస్యలే కదా! వాటి కయ్యే ఖర్చు కూడా లెక్కలోకి వేసుకోవాలిగా!///
.
హైదరాబాదు ORR లొపలి బాగమె సుమ్మరు 3.5 లక్షల ఎకరాలలొ ఉంది.
అమరవతిలొ ఇప్పటికె సెకరించిన 33 వెల ఎకరాలతొ పాటు మరొ 40 వెల ఎకరాలు సెకరించినా అది 73 వెల ఎకరాలు మాత్రమె!!
.
ఇక ట్రాఫిక్, నగర నిర్వహణ ఇతర నగర సమ్యలు వచ్చెది, సరైయిన సిటీ ప్లానింగ్ లెకపోవటం వల్ల! మన నగరాలు ఎది ఒక ప్లాన్ ప్రకారం చెయలెదు. అందుకె కొన్ని వందల కొట్లు కొర్చు చెస్తూ ఇప్పుడు ట్రాఫిక్ తప్పించటానికి ఒక్కొ బ్రిడ్జ్ కడుతున్నారు! అలానె త్రగునీరు, డ్రైనీజి ఆదునీకరించటానికి ఎంతొ దబ్బు కర్చు చెస్తున్నారు! అయినా పలితం శూన్యమె!
.
అమరవతి లొ మొదటి నుంది విశాలమయిన రొడ్లకి స్తలం వదిలిన దరిమిలా, అలానె భవిషత్తు త్రగునీరు, డ్రైనీజి అవసరాలకి తగు జాగ్రతాలు తీసుకుంటున్న దరిమిలా… ఇలాంటి ట్రాఫిక్, నిర్వహన సమస్యలు రాకపొవచ్చు!
సీతారామ కళ్యాణం వనవాసం తరువాత రావణాసురుడు ( ఇక్కడ జగన్ రెడ్డి ని ) ని సంహరించాక వైభవంగా జరిగింది ఇప్పటికి ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉన్నాము అలాగే అమరావతి పునః నిర్మాణం
300c skill gurinchi avagahana icharu maaku appatlo… 3000c liquor gurinchi Kuda maaku avagahana kalpinchandi.
.
//// అక్కడే మరో 44 వేల ఎకరాలు సేకరించాలా? నగరనిర్మాణం గురించే మాట్లాడుతున్నవారు, నగరనిర్వహణ గురించి మాట్లాడరేం? నగరం పెద్దదైన కొద్దీ తాగునీరు, డ్రైనేజి, శాంతిభద్రతలు, ట్రాఫిక్, గృహవసతి… అన్నీ సమస్యలే కదా! వాటి కయ్యే ఖర్చు కూడా లెక్కలోకి వేసుకోవాలిగా!///
.
హైదరాబాదు ORR లొపలి బాగమె సుమ్మరు 3.5 లక్షల ఎకరాలలొ ఉంది.
అమరవతిలొ ఇప్పటికె సెకరించిన 33 వెల ఎకరాలతొ పాటు మరొ 40 వెల ఎకరాలు సెకరించినా అది 73 వెల ఎకరాలు మాత్రమె!!
.
ఇక ట్రాఫిక్, నగర నిర్వహణ ఇతర నగర సమ్యలు వచ్చెది, సరైయిన సిటీ ప్లానింగ్ లెకపోవటం వల్ల! మన నగరాలు ఎది ఒక ప్లాన్ ప్రకారం చెయలెదు. అందుకె కొన్ని వందల కొట్లు కొర్చు చెస్తూ ఇప్పుడు ట్రాఫిక్ తప్పించటానికి ఒక్కొ బ్రిడ్జ్ కడుతున్నారు! అలానె త్రగునీరు, డ్రైనీజి ఆదునీకరించటానికి ఎంతొ దబ్బు కర్చు చెస్తున్నారు! అయినా పలితం శూన్యమె!
.
అమరవతి లొ మొదటి నుంది విశాలమయిన రొడ్లకి స్తలం వదిలిన దరిమిలా, అలానె భవిషత్తు త్రగునీరు, డ్రైనీజి అవసరాలకి తగు జాగ్రతాలు తీసుకుంటున్న దరిమిలా… ఇలాంటి ట్రాఫిక్, నిర్వహన సమస్యలు రాకపొవచ్చు!
//// అక్కడే మరో 44 వేల ఎకరాలు సేకరించాలా? నగరనిర్మాణం గురించే మాట్లాడుతున్నవారు, నగరనిర్వహణ గురించి మాట్లాడరేం? నగరం పెద్దదైన కొద్దీ తాగునీరు, డ్రైనేజి, శాంతిభద్రతలు, ట్రాఫిక్, గృహవసతి… అన్నీ సమస్యలే కదా! వాటి కయ్యే ఖర్చు కూడా లెక్కలోకి వేసుకోవాలిగా!///
.
హైదరాబాదు ORR లొపలి బాగమె సుమ్మరు 3.5 ల.-.క్ష.-.ల ఎకరాలలొ ఉంది.

Since MBS is well settled in Hyderabad, he does not care whether AP has a capital or not. He expects people of AP to continue to be beggars in other State capitals for education, employement, medical & other facilities. The present Govt is making an attempt and so give them some space to complete the works. Still 4 years are left.
We dont want all 3 states drama and other bogeys to spoil. It is a shame that AP does not have a proper capital even after 10 years of formation thanks to Jagan who put brakes with his drama of 3 states.
పార్లమెంట్ భవనానికి కేంద్రం వె*య్యి కో*ట్లు లోపు ఖర్చు పెట్టి కట్టింది. మీరు ఆమధ్య రాసారు chattisgarh, జార్ఖండ్ రాష్ట్రాల రాజధానులకి ఎక్కువ ఖర్చు చెయ్యలేదు అని. ఇప్పటికే కేంద్రం అమరావతి లో నిర్మాణాలకి 4*200 కో*ట్లు పైన ఇచ్చింది అని.
ఇవేవి రాయకుండా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు.
చంద్రబాబుగారిది ఎప్పుడూ ఆర్భాటమే. పని తక్కువా పబ్లిసిటీ ఎక్కువా ! తోడుగా ఆస్థాన భజన మీడియా హై హై నాయకా అంటూ చిడతల మోత.
విజనరీ విజనరీ అంటూ దరువు. ఎవరైనా పంటభూములు నాశనం చేసి రాజధాని కడతారా ? నిజంగా విజనరీ అయితే పంటపొలాల జోలికి పోకుండా బీడుభూముల గురించి ఆలోచిస్తారు.
చంద్రబాబు పేరు చెప్పగానే ఆయనే IT సృష్టికర్త అంటూ పరవశించిపోతారు. ఇంతకీ ఈ ఐటీ కేవలం హైదరాబాద్ లోనే ఉన్నదా ? బెంగుళూరూ పూణే, చివరకు మన తర్వాత మొదలైన చెన్నై తో సహా గౌహతి, గాంగ్‍టక్ పాట్నాలాంటి అనేక ఊళ్ళల్లో కూడా ఉన్నదా ? పోనీ హైదరాబాద్ ఐటీ కు మూలాధారమైన సైబర్ టవర్స్ ను మొదలెట్టింది ఈయన కాదు. నేదురుమిల్లి జనార్ధనరెడ్డి
పోనీ ఈయన గురించి ఐటీ భజన చేస్తే చేస్తారు, మరి ఈయన మొదలెట్టిన ఇర్రిగేషన్ ప్రాజెక్టులూ, పవర్ ప్లాంట్, భారీపరిశ్రమలూ లాంటివి ఏమైనా ఉన్నవా ? అది మాట్లాడరు. చివరకు కేంద్రం కట్టి అప్పచేప్పాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ను భుజాన వేసుకుని దాన్ని ఏ స్థితికి దిగజార్చారో అందరికీ తెలుసు. జీవనాడి లాంటి హైదరాబాద్ విజయవాడ రోడ్డు కూడా వేయలేకపోయిన దీర్ఘదర్శి గురించి ఎంత పొగిడితే అంత గొప్ప.
రాజధాని అంటే సచివాలయం అసెంబ్లీ హైకోర్టు ఇవేగా. రాజధాని లో పబ్బులూ మాల్సూ కూడా ప్రభుత్వం కట్టి తీరాలా ? అదీ అనేకరెట్ల వ్యయంతో
విజనరీ అయితే మొత్తం ఒక చోట కుప్పగా పోగు వేయకుండా రాష్ట్రం మొత్తం పంచుతాడు.
బాగానే ఊర్లు పేరు చెప్పావు కానీ .. ఐటీ పక్కన ఉన్న భుబనేశ్వర్ లో ఎందుకు లేదు ? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొదలు పెట్టారు అందుకే మైక్రోసాఫ్ట్ వొచ్చేసింది.. బాగుంది నీ వరస .. … ఇంకా పంట పొలాల్లో రాజధాని ఎందుకా అంటావు సరే …. మరి పంట పొలాల్లో మన బీజేపీ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కట్టేస్తోంది .. బీజేపీ వల్ల దేశం ప్రగతి పధం లో దూసుకు పోతోంది అని డప్పు వేసేది మీలాంటోళ్లే … ..కానీ బాబు గ్రీన ఫీల్డ్ కాపిటల్ అంటే మాత్రం తప్పు .. బీడు భూముల్లో ఉన్న హైదరాబాద్ కి నీటి ఎద్దడి ఎంత ఉండేదో తెలుసా , నాలుగు రోజులకి ఒకేసారి నీళ్లు వొచ్చేవి కావు ఒక్కప్పుడు .. కృష్ణ గోదావరి పైప్లైన్ వేసుకుంటే కానీ నీళ్లు లేవు …. ఇలాంటి సమస్యలు లేకుండా నీళ్లు పుష్కలముగా ఉన్న ప్రాంతంలో పెడుతున్నారు రాజధాని , ప్లాన్డ్ గ ఒక సిటీ కడుతున్నారు … ఆయనకి పేరు ఎక్కడ వొస్తుందో అనే ఏడుపు తప్పించి ఏమి లేదు నీ రాతలో .. .. అయినా మొన్న వొచ్చిన మోడీ గారికి తెలీదా అవి పొలాలు అని ..బాబు గారికి వొద్దు అని ఎందుకు చెప్పలేదో మరి .. ..
Who told you that there is no IT in Bhubaneswar. IT is on high scale even in Patna, Ok leave IT, what are the other magnificent achievements of CBN apart from IT. Is he specialized for IT only. Why IT not developed in A.P in between 2014-2019.
Who told you that there is no IT in Bhubaneswar. IT is on high scale even in Patna, Ok leave IT, what are the other magnificent achievements of CBN apart from IT.
The visionary would develop the wastelands but do not waste fertile lands. I think you are aware highways have to be built throughout the country whether those are fertile or non fertile.
Hyderabad is on the banks of Musi River. Yet there is scarcity of water because of the abnormal growth of expansion. Do you prefer same fate for other cities. What is the use if a Mega city is built. Is it better to concentrate all the projects at one place or spread those throughout the state for the benefit of people of all the districts.
What is there earning of fame by CBN. He is beating self drums wince 1995 as if he is almost pioneer to the entire universal leaders. Did the people believe it ? He was thrown out of power many times. Without someone’s push up why such a leader could not win any election.
Modi is a shrewd politicians. He has his own games. He praised CBN both in 2015 and 2025 toooo, without slipping a single pie
IT IS OUR IDIOCITY TO ELECT THOSE LEADERS WITHOUT BUILDING A SMALL BRIDGE DROWNED THE STATE INTO 6 LACS CRORE DEBT
no need to argue with you .. cause how much I try, you will not convince. .
వరంగల్ కరీంనగర్ రాజమండ్రి లో కూడా ఉంది IT అంతే కదా సింహాద్రి గారు? విమర్శించాలంటే ఎంతైనా విమర్శించొచ్చు కానీ దానికీ ఓ హద్దు ఉండాలని కదా. సైబర్ టవర్ నీ జనార్దన్ రెడ్డి గారు ఎంతవరకు కట్టారండి, కనీసం పునాదులు తీసాడా? పోలవరం ఎవరు కట్టారు అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టారు అనేలా ఉన్నారు మీరు ఎందుకంటే మొదట పోలవరం కడదాం అనే ఐడియా వాళ్ళదే కనుక.
నేను అన్నది మీకు సరిగ్గా అర్థం అయినట్లు లేదు. తానే IT పితామహుడిగా ముద్ర కొట్టుకుంటున్నాడు. దేశంలో IT లేనిది ఎక్కడ, మరి వాటి పితమహుడు ఎవరు అని? తనే IT కు మూలపురుషుడు తనే IT కు పునాది వేస్తే 2014-19 మధ్యలో కాసిని IT లు విశాఖ కు కూడా తెచ్చే పని కదా అన్నాను. హైదరాబాద్ IT కు మూలాధారం అయిన సైబర్ టవర్స్ ను ఎవరు మొదలెట్టారో వాళ్ళు హైదరాబాద్ IT కు మూలపురుషులు అవుతారు.
ఇకపోతే పోలవరం 1980 లో శంఖుస్థాపన చేసారు. 2004 లో రాజశేఖర్ వచ్చే వరకూ ఎవరూ పట్టించుకోలేదు. అయిదేళ్ళల్లో పోలవరం కుడి కాలవ తవ్వాడు. మరి చంద్రబాబు చేసింది ఏమిటి? కేంద్రం కు వదిలేస్తే పోలవరం ఎప్పుడో అయిపోయేది. భుజన వేసుకుని కనీసం కూడా కొద్దిగా కూడా చేయలేపోయాడు అన్నాను. చంద్రబాబు గారు తనహాయాంలో స్వంతంగా మొదలెట్టి కొద్దో గొప్పో పనిచేసిన ప్రాజెక్టు పేరు ఒక్కటైనా ఏ రంగంలో నైనా చెప్పాలి

నేను అన్నది మీకు సరిగ్గా అర్థం అయినట్లు లేదు. తానే IT పితామహుడిగా ముద్ర కొట్టుకుంటున్నాడు. దేశంలో IT లేనిది ఎక్కడ, మరి వాటి పితమహుడు ఎవరు అని?
తనే IT కు మూలపురుషుడు తనే IT కు పునాది వేస్తే 2014-19 మధ్యలో కాసిని IT లు విశాఖ కు కూడా తెచ్చే పని కదా అన్నాను. హైదరాబాద్
హైదరాబాద్ IT కు మూలాధారం అయిన సైబర్ టవర్స్ ను ఎవరు మొదలెట్టారో వాళ్ళు హైదరాబాద్ IT కు మూలపురుషులు అవుతారు.
తనే IT కు పునాది వేస్తే 2014-19 మధ్యలో కాసిని IT లు విశాఖ కు కూడా తెచ్చే పని కదా అన్నాను.
ఇకపోతే పోలవరం 1980 లో శంఖుస్థాపన చేసారు. 2004 లో రాజశేఖర్ వచ్చే వరకూ ఎవరూ పట్టించుకోలేదు. అయిదేళ్ళల్లో పోలవరం కుడి కాలవ తవ్వాడు. మరి చంద్రబాబు చేసింది ఏమిటి? కేంద్రం కు వదిలేస్తే పోలవరం ఎప్పుడో అయిపోయేది. భుజన వేసుకుని కనీసం కూడా కొద్దిగా కూడా చేయలేపోయాడు అన్నాను. చంద్రబాబు గారు తనహాయాంలో స్వంతంగా మొదలెట్టి కొద్దో గొప్పో పనిచేసిన ప్రాజెక్టు పేరు ఒక్కటైనా ఏ రంగంలో నైనా చెప్పాలి
Who told you that there is no IT in Bhubaneswar. IT is on high scale even in Patna, Ok leave IT, what are the other magnificent achievements of CBN apart from IT. Is he specialized for IT only.
The visionary would develop the wastelands but do not waste fertile lands. I think you are aware highways have to be built throughout the country whether those are fertile or non fertile.
Hyderabad is on the banks of Musi River. Yet there is scarcity of water because of the abnormal growth of expansion. Do you prefer same fate for other cities. What is the use if a Mega city is built. Is it better to concentrate all the projects at one place or spread those throughout the state for the benefit of people of all the districts.
What is there earning of fame by CBN. He is beating self drums wince 1995 as if he is almost pioneer to the entire universal leaders. Did the people believe it ? He was thrown out of power many times. Without someone’s push up why such a leader could not win any election.
Modi is a shrewd politicians. He has his own games. He praised CBN both in 2015 and 2025 toooo, without slipping a single pie
IT IS OUR IDIOCITY TO ELECT THOSE LEADERS WITHOUT BUILDING A SMALL BRIDGE DROWNED THE STATE INTO 6 LACS CRORE DEBT
బీహార్ లో అయినా ఆంధ్రలో అయినా ఒరిస్సాలో అయినా కేంద్రం చేసేది రైల్వేలూ రోడ్లూ లాంటివే . లోపల కుళ్ళు మురగటాన్ని బట్టి బీహార్ కు ఏదో చేసేస్తున్నట్లూ ఆంధ్రలో ఏమీ చేయనట్లూ కుళ్ళు కంపు కొట్టిస్తూ చిచ్చు పెట్టరు
చాలా ఐడియాస్. ఇంప్లిమెంట్ design లెవెల్లో వృథా గా తీస్తాయి. ఉదాహరణ కు ఎవరు పెద్దగా ఆసక్తి చూపించని సమయం.లో ఆంధ్రా CM. మైక్రోసాఫ్ట్. Bill gates ను కలవడం. సెంషబాద్ ఎయిర్పోర్ట్. కోసం ప్రయత్నించడం. గచ్చిబౌలి I S B. తేవడం. Flyovers మరియు. ఇతర రోడ్ ల కోసం హైదరాబాద్ ఆ రోజున ప్రతిపక్ష నేత ysr తీవ్రంగా ఆక్షేపించారు. ఆంధ్రా లో కరువయితే ఈ cm ఏంటి బయట తిరుగుతాడుబనేవారు కానీ. Redmond తరువాత మైక్రోసాఫ్ట్. లాంటి ఐకానిక్ సంస్థ ఆంధ్రా లో రావడం. తర్వాత I T capital of India gaa andhra ఎద్గడం. Ee roju thelngana ఆదాయం లో సింహ భాగం హైదరాబాద్ నుండి రావడం మీరు తప్పు అంటూనా నగరీకరణ వల్లనే జరిగింది. ఇదంతా కాళ్ళ ముందే జరిగింది. మల్ల అమరావతి దాని ఆర్భాటాలు పిచ్చి గానే తీస్తున్నాయి కాలమే చెప్పాలి ఈ లోపు ఎవరికి తోచింది వాళ్ళు ప్రచారం చెయ్యొచ్
ఈ రోజు. L G. Electronics. Sri City లొ పెట్టుబడులు పెట్టింది. సుమారు 25000 ఉద్యోగాలు వచ్చాయి. Tcs. Vizag lo vachhindhi kotyha start-ups ku భూములు vizag lo ఇస్తున్నారు ivannai అభివృద్ధి వికేంద్రీకరణ కాదా
Singapore may developed in many years.. But they have master plan for next 50 years… So planning is very important.. and regarding unnecessary publicity, it is required as ours is democratic and needs to face the elections.
అంటే అన్నాను అంటారు గానీ, ఈ రచయిత కి పూర్తి స్థాయిలో మతి పోయింది ఏమో అనిపిస్తుంది. ఆయనకు ఏమీ కావాలో ఆయనకే తెలీదు.
2050 to 2060 సంవత్సరంలో 60 నుంచి 70 సాతం జనాభా నగరాల్లో ఉంటారు అని అంచనాలు ఉన్నాయి. అప్పటికి ముసలి నక్క, జగన్ కి తొత్తు అయిన ఈ రచయిత గారు ఎటు బ్రతకడు.
అదీ గాక ఇప్పటి వరకు చండీగర్ కాకుండా ప్రణాళిక తో కట్టిన నగరం ఒక్కటి కూడా దేశంలో లేదు. ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ ఒక చిన్న వర్షం వస్తే మునిగి పోయే విషయం అందరికీ తెలిసిందే. పైగా సరైన ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా ఉంటాయి. ఒక నూతన నగరం మనం కట్టుకున్నాo అనే ఆనందం లేకుండా యెప్పుడూ ఒకే ఏడుపు. మీ జగన్ గారు చేసిన మూడు రాజధానిల ప్రహసనం వికటించుట మనకి తెలిసిందే.
ఈ ముసలి, ముదనష్టపు నక్క గారు మొన్న వర్షం పడితే నిల్వ ఉన్న నీళ్లను చూసి అమరావతి మునిగి పోయింది అనే దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా ముసలి నక్క గారు మీరు రాసిన కారు కూతలను నమ్మే స్థితిలో జనాలు లేరు అని గ్రహించ వలసినది గా నా విన్నపము.
మొత్తం మనం కాసేపు గ్రాఫిక్స్ అనుకున్నా, కనీసం 20 శాతం అందులో నిజమైన ఆంధ్రాకి ఒక గౌరవమైన రాజధాని ఏర్పడుతుంది అని అనడం లో నా కు యెటువంటి సందేహం లేదు. రాజధానికి 33000 ఎకరాల భూమి సరిపోదు అని మీ ముద్దుల జగన్ అసెంబ్లీ లో చెప్పిన మాటలను ఒక సారి గుర్తు చేసుకుని తీరాల.
అలాగే ముసలి నక్క గారు Vanpic కి దోచుకున్న 100000
ఎకరాల భూమి, లేపాక్షి knowledge hub ki దోచుకున్న 1,00,000 ఎకరాల భూమి,
బ్రహ్మణి steels, బయ్యారం, సరస్వతి power ఇలాంటి కంపెనీలు కి అన్నీ కలిపితే 3 నుంచి 4 లక్షల ఎకరాల భూమి అవసరమైతే రాజధాని కి 50000 నుంచి 100000 ఎకరాల భూమి అవసరమే. వాటికి మీరు పడేసిన ముష్టి కంటే రైతుకు ఎన్నో రెట్లు లాభం కలిగే లాగా ల్యాండ్ pooling స్కీమ్ పెట్టారు.
అయ్యా ముసలి నక్క రచయిత గారు మీ జీవిత చరమాంకం లో చంద్రబాబునాయుడు, అమరావతి అని మాటి మాటికి రాయడం కంటే రామ, రామ అని రామ కోటి రాసుకో.
మీ వల్ల అటు గ్రేట్ ఆంధ్ర కి ఇటు పాటకులు కి ఎటువంటి ఉపయోగం లేదని గ్రహించ వలసినది గా నా ప్రార్థన. మీ వయసు ఉన్న అమ్మమ్మ ఉన్నది నాకూ. మాటి మాటికి ముసలి నక్క అన్నందుకు నన్ను క్షమించండి. కానీ మీ వ్రాసిన ఈ దరిద్రము చూసి రక్తం మరిగింది. ఒక qualified chartered accountant మరియు కంపెనీ secretary ga చెప్తున్నా ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి ఒక వరం. దానికి చేసిన అప్పులు, దానికోసం పడుతున్న తిప్పలు 10 సంవత్సరాలలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పటం లో ఎటువంటి సందేహం లేదు
https://www.un.org/development/desa/en/news/population/2018-revision-of-world-urbanization-prospects.html
https://www.google.com/amp/s/timesofindia.indiatimes.com/city/bengaluru/ms-ahluwalia-india-needs-more-cities-than-villages/amp_articleshow/118190897.cms
మీరు ఒకసారి ja*** ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి లేదా అరాచకాల గురుంచి కూడా ఒక ఆర్టికల్ రాయండి సర్, selective criticism చేయటానికి మాకు ఉండవల్లి అనే మేధావి already ఉన్నారు!!
Arey MBSprasadu, nee valla andhra ki yentra upayogam?
yentha Tax kadathavu ?
kaneesam votu anna vunda neeku?
ipppch manchi musugulo tappu chesina leda chestuna adhi palinchadu lord Sri Krishna Says
అంటే అన్నాను అంటారు గానీ, ఈ రచయిత కి పూర్తి స్థాయిలో మతి పోయింది ఏమో అనిపిస్తుంది. ఆయనకు ఏమీ కావాలో ఆయనకే తెలీదు.
2050 to 2060 సంవత్సరంలో 60 నుంచి 70 సాతం జనాభా నగరాల్లో ఉంటారు అని అంచనాలు ఉన్నాయి. అప్పటికి ముసలి నక్క, జగన్ కి తొత్తు అయిన ఈ రచయిత గారు ఎటు బ్రతకడు.
అదీ గాక ఇప్పటి వరకు చండీగర్ కాకుండా ప్రణాళిక తో కట్టిన నగరం ఒక్కటి కూడా దేశంలో లేదు. ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ ఒక చిన్న వర్షం వస్తే మునిగి పోయే విషయం అందరికీ తెలిసిందే. పైగా సరైన ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా ఉంటాయి. ఒక నూతన నగరం మనం కట్టుకున్నాo అనే ఆనందం లేకుండా యెప్పుడూ ఒకే ఏడుపు. మీ జగన్ గారు చేసిన మూడు రాజధానిల ప్రహసనం వికటించుట మనకి తెలిసిందే.
ఈ ముసలి, ముదనష్టపు నక్క గారు మొన్న వర్షం పడితే నిల్వ ఉన్న నీళ్లను చూసి అమరావతి మునిగి పోయింది అనే దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా ముసలి నక్క గారు మీరు రాసిన కారు కూతలను నమ్మే స్థితిలో జనాలు లేరు అని గ్రహించ వలసినది గా నా విన్నపము.
మొత్తం మనం కాసేపు గ్రాఫిక్స్ అనుకున్నా, కనీసం 20 శాతం అందులో నిజమైన ఆంధ్రాకి ఒక గౌరవమైన రాజధాని ఏర్పడుతుంది అని అనడం లో నా కు యెటువంటి సందేహం లేదు. రాజధానికి 33000 ఎకరాల భూమి సరిపోదు అని మీ ముద్దుల జగన్ అసెంబ్లీ లో చెప్పిన మాటలను ఒక సారి గుర్తు చేసుకుని తీరాల.
అలాగే ముసలి నక్క గారు Vanpic కి దోచుకున్న 100000
ఎకరాల భూమి, లేపాక్షి knowledge hub ki దోచుకున్న 1,00,000 ఎకరాల భూమి,
బ్రహ్మణి steels, బయ్యారం, సరస్వతి power ఇలాంటి కంపెనీలు కి అన్నీ కలిపితే 3 నుంచి 4 లక్షల ఎకరాల భూమి అవసరమైతే రాజధాని కి 50000 నుంచి 100000 ఎకరాల భూమి అవసరమే. వాటికి మీరు పడేసిన ముష్టి కంటే రైతుకు ఎన్నో రెట్లు లాభం కలిగే లాగా ల్యాండ్ pooling స్కీమ్ పెట్టారు.
అయ్యా ముసలి నక్క రచయిత గారు మీ జీవిత చరమాంకం లో చంద్రబాబునాయుడు, అమరావతి అని మాటి మాటికి రాయడం కంటే రామ, రామ అని రామ కోటి రాసుకో.
మీ వల్ల అటు గ్రేట్ ఆంధ్ర కి ఇటు పాటకులు కి ఎటువంటి ఉపయోగం లేదని గ్రహించ వలసినది గా నా ప్రార్థన. మీ వయసు ఉన్న అమ్మమ్మ ఉన్నది నాకూ. మాటి మాటికి ముసలి నక్క అన్నందుకు నన్ను క్షమించండి. కానీ మీ వ్రాసిన ఈ దరిద్రము చూసి రక్తం మరిగింది. ఒక qualified chartered accountant మరియు కంపెనీ secretary ga చెప్తున్నా ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి ఒక వరం. దానికి చేసిన అప్పులు, దానికోసం పడుతున్న తిప్పలు 10 సంవత్సరాలలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పటం లో ఎటువంటి సందేహం లేదు
https://www.un.org/development/desa/en/news/population/2018-revision-of-world-urbanization-prospects.html
https://www.google.com/amp/s/timesofindia.indiatimes.com/city/bengaluru/ms-ahluwalia-india-needs-more-cities-than-villages/amp_articleshow/118190897.cms
‘ఒరే ముసలి పేసాదం.. నీలాంటి పనికిమాలిన ముసలి నాయాళ్ళు ఇలా ఏడ్చి ఏడ్చి మా “లెవెన్ మావ” ని మునగ చెట్టు ఎక్కించి .. Why not 175 అంటూ ఛాలెంజ్ చేయించి, చివరికి ‘మొడ్డ గుడిపించి, 11 ఇంచులు దె0గి పంగనామాలు పెట్టేలా చేశారు .. మావోణ్ణి ఇక వదిలేయ్యాండ్రా..
Orey MBS, enni rojulu ee uchitha pathakalu ichhi janalanu somaripothulani chestharura vedavallara.. ninnu kanapadithe pichha kottudu kottali
మీకొక చిన్న ఉదాహరణతో నా అభిప్రాయం చెప్తాను!! నేను ఒక large scale port develop చేయాలని ప్లాన్ చేశాను so that “Large ports offer several advantages, primarily revolving around efficiency and economic impact. They can accommodate larger ships, handle more cargo, and serve as key hubs for international trade. This leads to optimized shipping routes, streamlined logistics, and increased trade volumes, ultimately contributing to economic growth and job creation” small ports cant have those advantages but they do have their own positives “Small ports offer several advantages, including reduced congestion, potentially faster cargo movement, simpler customs processes, and the opportunity to provide more personalized and flexible customer service. They can also be cost-effective for shippers and support local economic development.” it applies to capital cities too, my point here is “both have there importance in well being of the state” but we need self sustaining big capital which can act as growth engine for rest of the state. I took port example just to illustrate my point!!
ento ee article…this article is a proof that educated does not mean you have good intentions…
Why did amaravati stopped? because Jagan betrayed..simple fact…Why restart..why not…
Just to criticize CBN, this article talked about economy, innovation, how to build cities, decentralization, increase GDP blah blah..where were you when Jagan was ruining Andhra…where were your ideas…unbelievable…Andhra does not need enemies..these people are enough..
Its not about whose idea is great..who implements matter…
MBS baabu neekunna jnaanam chaala takkuva, andulonu annadi naa…kadam ane oka pavitra kaaryam chestunnav, nee bo…..kkalo vijnaana pradarshana avasaramaa
///మూడేళ్లలో ఆయన చెప్తున్న రాజధాని పూర్తి అవుతుందా లేదా అంటే యువర్ గెస్ యీజ్ ఏజ్ గుడ్ ఏజ్ మైన్. గుఱ్ఱం ఎగురుతుందేమోనని ఆకాశం వైపు చూడడం తప్ప మనం చేసేదేమీ లేదు.///
.
5 ఎళ్ళ పాటు 3 రాజదానులు అన్నప్పుడు గాలి లొకి ఎన్నిసార్లు చూసారు!
ఇవ్వాల అన్ని అడ్డంకులు తొలగి రాజదాని పనులు కూడా మొదలు అవుతుంటె మీరు గుర్రం ఎగరవచ్చు అనిపిస్తుందా? గాలిలొకి చూడాలా???
“జగన్‌ని రానీవకపోవడమే తను పెట్టబోయే పార్టీ లక్ష్యమని టిడిపి పక్షపాతి ఎబి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు”..
donot even bring up ABV name. You must have no shame knowing full well how he was mistreated with fake allegations..
siggue vadilesava?
an absolute and perect analysis , almost all telugu peoples true words are in this column. will CBN listen? never, never say never again to him
an absolute and perect analysis , almost all telugu peoples true words are in this column. will CBN listen? never, never say never again to him
all telugu people .. which all you are talking about .. the one who voted for three capitals .. or those who voted CBN to power ..
ఈ పెద్దాయన పైన రాసినట్టు అందరూ అని మీకు మీరే అనుకుంటే సరిపోయిందా? ఆ చేతకాని దద్దమ్మ ను సపోర్టు చేసే వాళ్ళందరూ అనుకుంటున్నారు అనండి సబబుగా ఉంటుంది
I am telugu and what MBBS wrote is anti-CBN blah blah
yes an absolute and perect analysis , almost all telugu peoples true words are in this column. will CBN listen? people listened and gave 3 star comedian 11 seats.
యధా వెంకట రెడ్డి తధా MBS
ఔను సార్.ఈ వీడియో గేమ్స్ చూడాలంటే బోర్ గా ఉంది .emina చేసే చూపిస్తే బాగుండేది…ఆస్తమాను ఈ డప్పు
పడకకుర్చీ మేధావులు చాలా తేలిగ్గా చెప్పేస్తుంటారు – ఒకటే మహానగరం ఎందుకు, అనేక చిన్న పట్టణాలు అభివృద్ధి చెయ్యొచ్చుగా, అమలాపురంలో ఆపిల్, అనకాపల్లిలో గూగుల్ తీసుకురావచ్చుగా అని చెప్పేస్తుంటారు. సాధ్యాసాధ్యాలు పట్టవు. ఒక ముఖ్యమంత్రి అయిదేళ్లలో రాజధాని కట్టకపోతే అసమర్థత, మరొక ముఖ్యమంత్రి అయిదేళ్లలో రాజధాని మార్పు బిల్లు కూడా పెట్టలేకపోతే అది ప్రతిపక్షనాయకుడి అసమర్థత. రాజకీయనాయకుడు ఎవరైనాచేసిన పనికి పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు. అదేదో మహాపరాధం అంటే ఎలా? “మీకు ఇన్ని కో..ట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాను” అని మీ నాయకుడు చెబితే, “అది ఎవరి డబ్బు, ఎందుకీ పబ్లిసిటీ” అని అడిగారా ఈ పెద్దాయన?
జగన్ గారి వెంట ప్రసాద్ గారి వంటి అభిమానులు ఉన్నంతకాలం టీడీపీకి ఎదురు లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అని ప్రశాంత్ కిషోర్ చెబితే “పీకే నవ్వులపాలయ్యాడు” అని తమని తాము మభ్యపెట్టుకుంటూ, జగన్ ని కూడా మభ్య పెట్టారు. ఈనాడు ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంటే మళ్ళీ లబ, లబలాడిపోతున్నారు.ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో కానీ అసలు ప్రయత్నమే వద్దు, అప్పు చేసుకుంటూ, ఫ్రీబీలు ఇచ్చుకుంటూ బతకడమే గొప్ప అనడం తగదు.
Prasad garu?
Prasad yekkuva
prasad gadu correct
So true. Look at this article, as if CBN is doing eternal sin…
మాదాపూర్ కొండాపూర్ ఎవడు kattadraa konderripoo…నీ ఏడుపు ఆగదు…ap గుర్రం already ఎగురుతుంది..మీపై yeragadame next….
Why deleting comment…reposting..
“జగన్‌ని రానీవకపోవడమే తను పెట్టబోయే పార్టీ లక్ష్యమని టిడిపి పక్షపాతి ఎబి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు”..
do not even bring up ABV name. You must have no shame knowing full well how he was mistreated with fake allegations..
Good
మరల మరల నొక్కుతున్నాడు బట్టన్ అని అప్పట్లో జగన్ గారిని ఇలానే వెక్కిరించలేదు, ఏందో!
Mee Super Six em ayyindhiraa….
super :-p unlike button pichodu
Ye buildings lekunda gali lo laptops adinche companies vachinappudu alane capitals kadataru le…
నవరత్నాల మాయ ఛేదించిన 5 కోట్ల ప్రజలు!
2019లో జగన్ మోహన్ రెడ్డి అసాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆ ప్రజాధారాన్ని ఆయన ఓ బాధ్యతగా కాకుండా, ఓ అహంకార ధర్మంగా తీసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే అవకాశం ఉండగానే, ప్రజల మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం మొదలుపెట్టారు. సంక్షేమ పథకాల పేరిట ప్యాకేజీలు పంచుతూ, ప్రజల్ని శాశ్వతంగా తనవారిగా మార్చుకోగలననే అహంభావంతో వ్యవహరించారు. ఆయన నమ్మకమేమిటంటే – “ప్రజల భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. వీరు నన్నే ఓటేస్తారు.” కానీ ప్రజలు ఆశీర్వాదాలు ఇవ్వగలవారు గానీ, అంధమతంగా గులాములవ్వరు అనే నిజాన్ని ఆయన నిర్లక్ష్యంగా వదిలేశారు.
ఇక కుటుంబ విషయాల్లో ఆయన తీరూ ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. తన తల్లిని రాజకీయంగా పక్కకు నెట్టి, సొంత సోదరిని ప్రత్యర్థిగా మారినట్టుగా చిత్రీకరించడం జగన్ లో ఆత్మీయత కన్నా అధికారం మీద మక్కువ ఎంత ప్రబలంగా ఉందో నిరూపించింది. ప్రజలు చూసింది ఒక్కటే – కుటుంబాన్ని గౌరవించని నాయకుడు ప్రజలను ఎలా గౌరవిస్తాడు?
మద్యం పాలసీ పేరుతో రాష్ట్రాన్ని మద్యం మాఫియాల చేతిలో పెట్టిన వాస్తవాన్ని ఎవ్వరూ మరచిపోలేరు. ప్రభుత్వ నియంత్రణ పేరుతో మద్యం విక్రయం పూర్తిగా అధికార కూటాలను ధనికం చేసే విధంగా మారింది. ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి, ఆదాయాన్ని దోచుకున్న ఈ వ్యవస్థకు, వ్యాపారంగా ఏర్పడిన స్కాంలకు అసలైన శిల్పిగా ప్రజలు జగన్‌కే బాధ్యత వహించడాన్ని ప్రారంభించారు.
ఇంతవరకూ ఉన్నదే కాదు – జగన్ పాలనలో మరో ముప్పు ఏమిటంటే, కులవాద రాజకీయాలకు పాలుపోవడం. కాపు, కమ్మ వర్గాలపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు, చర్యలు వర్గవిభజనకు దారి తీసేలా మారాయి. రాష్ట్రాన్ని ఒక్కటిగా చూడాల్సిన ఒక ముఖ్యమంత్రి, రాజకీయ ప్రయోజనం కోసం సామాజిక చీలికను ప్రోత్సహించినప్పుడు – ప్రజల మౌనం కోపంగా మారడం తప్పదు.
అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రజల నుంచి పూర్తిగా వేరుగా జీవించారు. ప్రజల మధ్య తిరగడం, మానవ సంబంధాలను నెరిపించడం లేదు. ప్రభుత్వంపై పట్టును తన కోటరీకి అప్పగించారు. ఆ కోటరీ – నాలుగైదు మందితో ఏర్పడిన నియంత్రిత వ్యవస్థే రాష్ట్రానికి పెద్ద ప్రమాదమైంది. ఇదే కారణంగా పార్టీకి పనిచేసిన కార్యకర్తలే వదిలిపోతున్నారు. ఇప్పటికే 60 శాతం YCP కేడర్ జగన్ వైఖరిపై విసుగుతో పార్టీకి వీడ్కోలు చెప్పారు. ఇది జగన్ లో introspection లేనిదానికి బలమైన ఆధారం.
ఇవన్నీ కలిపి చూడగానే, జగన్ మోహన్ రెడ్డి ఎందుకు తిరిగి ముఖ్యమంత్రి కాలేరు అనే ప్రశ్నకు ప్రజలే జవాబు ఇచ్చారు. ఈసారి ఆయనకు 175లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే ప్రజల మొదటి హెచ్చరిక. కానీ అదే తీరుతో ఆయన కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు అసలైన ‘నవరత్నాలు’ ఇస్తారు – అంటే 9/175. ఇది ఒక వ్యంగ్యపు తీర్పు కాదు గారు – ఇది ప్రజాస్వామ్యపు తిరుగుబాటు.
జగన్ నవరత్నాలు అన్నాడు. ప్రజలు ఇప్పుడు నిజమైన 9 రత్నాలు చూపించబోతున్నారు. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన నేతకు, అవమానంతో కూడిన తుది తీర్పు ఇదే. ఇది ఓటమి కాదు – ఇది గర్వానికి తగిన గుణపాఠం. ప్రజలు ఎప్పుడూ మౌనంగా ఉండరని, అవమానం భరించరని, జగన్‌కి ఈసారి స్పష్టంగా చెప్పారు. ఇక జగన్‌కు తిరిగి ముఖ్యమంత్రి పదవి చేరడం దాదాపు అసాధ్యం – ఎందుకంటే ప్రజలు తాము చేసిన తప్పును గుర్తించారు, మరల చేయరు.
.