ర‌ఘురామా.. కోరుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వు క‌దా!

త‌న‌ను క‌స్టోడియ‌ల్ హింస చేశార‌ని, తీవ్రంగా గాయ‌ప‌రిచినా, ఏమీ కాలేద‌ని నివేదిక ఇచ్చిన డాక్ట‌ర్‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డం త‌ప్ప‌కుండా ఆయ‌న మ‌న‌సు క‌ల‌త చెందుతూ వుంటుంది.

క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్‌లో త‌న‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని జీజీహెచ్ నాటి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ నీలం ప్ర‌భావ‌తి నివేదిక ఎలా ఇస్తార‌ని, ఆమెను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అరెస్ట్ చేయించాల‌ని డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు కోరుకున్నారు. కానీ ఆయ‌న ఆశ నిరాశే అయ్యింది. సుప్రీంకోర్టులో ఆమెకు పూర్తిస్థాయిలో బెయిల్ ల‌భించింది.

ర‌ఘురామ కేసులో ఇప్ప‌టికే ఆమె విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అప్పుడు ఏం జ‌రిగిందో గుర్తు లేద‌ని డాక్ట‌ర్ ప్ర‌భావ‌తి విచార‌ణ‌లో చెప్పారు. ఆమెకు అన్నీ గుర్తు రావాల‌ని ర‌ఘురామ మీడియా ముఖంగా కోరుకున్నారు. కానీ డాక్ట‌ర్ ప్ర‌భావ‌తి విష‌యంలో ర‌ఘురామ కోరుకున్న‌వేవీ జ‌ర‌గ‌క‌పోవ‌డం ఆయ‌న‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. తాజాగా డాక్ట‌ర్ ప్ర‌భావ‌తి మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌డంపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

ఇప్ప‌టికే ఆమె విచార‌ణ‌కు హాజ‌ర‌య్యార‌ని, ఇంకా ఏం రాబ‌ట్టాల‌ని అనుకుంటున్నార‌ని స‌ర్వోన్న‌త న్యాయ స్థానం ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. చివ‌రికి ఆమెకు పూర్తిస్థాయిలో బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వ‌డం విశేషం. ఈ ప‌రిణామం ముమ్మాటికీ ర‌ఘురామ‌కు తీవ్ర వేద‌న క‌లిగించేదే. ర‌ఘురామ సున్నిత మ‌న‌స్కుడు. దేన్నీ ఆయ‌న త‌ట్టుకోలేరు.

ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్ప‌టికీ, త‌న కేసులో అల‌స‌త్వాన్ని ఆయ‌న బ‌హిరంగంగా విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రైనా త‌న‌ను చిన్న మాట అన్నా ర‌ఘురామ జీర్ణించుకోలేరు. ఇటీవ‌ల సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి శ్రీ‌నివాస‌రావుపై ఏ విధంగా నోరు పారేసుకున్నారో చూశాం. ఈ విష‌యంలో ర‌ఘురామ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. నోటికి హ‌ద్దూఅదుపూ లేకుండా ర‌ఘురామ మాట్లాడ్డం ఏంట‌నే నిల‌దీత‌లు ఎదుర‌య్యాయి.

అలాంటిది త‌న‌ను క‌స్టోడియ‌ల్ హింస చేశార‌ని, తీవ్రంగా గాయ‌ప‌రిచినా, ఏమీ కాలేద‌ని నివేదిక ఇచ్చిన డాక్ట‌ర్‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డం త‌ప్ప‌కుండా ఆయ‌న మ‌న‌సు క‌ల‌త చెందుతూ వుంటుంది. కోరుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వు క‌దా రాజుగారు. అర్థం చేసుకోవడం త‌ప్ప‌, చేయ‌గ‌లిగేదేమీ వుండ‌దు.

11 Replies to “ర‌ఘురామా.. కోరుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వు క‌దా!”

    1. జనాలు అవి పిసికేస్తేనే కదా… 151 నుండి 5 రాలిపోయి.. 11 మిగిలాయి..

  1. ఒక MP గారిని అకారణం గా రాజద్రహం కెసు పెట్టి 3rd డెగ్రీ ట్రీట్మెంట్ ఇస్తె, అయన ఆ కెసులొ న్యాయం కొరటం కూడా ఎదొ గొత్తెమ్మ కొరికలు కొరుతునట్టు GA చెప్పుకొస్తుంది.

    .

    ఈమె రఘురామ కెసులొ ఎమి గుర్తు లెదు అని చెప్పటం చూస్తెనె, అర్దం అవుతుంది ఈమె ఎంత సుద్దపూసనొ. అలా చెప్పి ముందస్తు బైల్ పొందితె, అదెదొ న్యాయం గెలిచింది అన్నట్టు GA బిల్డుప్ ఇస్తున్నాడు! 

    .

    మరి మన బులుగు రాతలు అంతె!

    1. అయితె ఈమె ఎంతొ కాలం తప్పించుకొలెరు! ఎదొ ఒక రొజు జైలు పాలు అవ్వాల్సిందె!

  2. ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకొంటూ ఈ రకమైన తప్పుడు రిపోర్ట్ లు ఇచ్చి న్యాయాన్ని అపహాస్యం పాలు చేస్తే రేపు ఆమెకు ఏమి జరిగిన ఇలాంటి రిపోర్ట్ లే ఆ తర్వాత డాక్టర్స్ ఇస్తారు జనం సొమ్ము తీసుకొంటే ఎంతోకొంత న్యాయం చేయాలి మనలాంటి సామాన్య జనాలకైతే ఇలాంటి డాక్టర్ లు ఉంటే న్యాయం జరగదు ప్రభుత్వం కూడా ఇలాంటోళ్ళ విషయం లో కఠిన చర్యలు తీసుకోవాలి

  3. అక్కడ బూమ్ బూమ్ బాటిళ్లు పగులుతున్నాయి చూడు ..జగన్ గా..డి..తొత్తు అధికారులు ని సుప్రీంకోర్టు ఇప్పుడే మింగి బయటకు విసిరేసింది. అన్నీయ్య కి త్వరలో బుమ్చిక్ బుమ్చిక్ తప్పదంటా వా ?

  4. Veedu asale heart patient..ippudu emi avutundi ani BP raise ayi pothaademo….

    endukaina veedu dochukunna 700 crores katteyamanu..

    never know right 

  5. ఇప్పటికి తప్పిచుకోవచ్చు ఏమో గాని ఈవిడా ..!కానీ ఎదో ఒక రోజు అనుభవిచక తప్పదు …

    అవినీతి, అరాచకాలు దోపిడీ చేయడానికి ఐఏఎస్ ,ఐపీఎస్, డాక్టర్ లని వైఎస్ అండ్ కొడుకు జగన్ వాడినట్టు ఎవరూ వాడరు. ఇద్దరి హయాంలో పని చేసి కోర్ట్ ల చుట్టూ తిరిగే వాళ్లే సాక్ష్యం.

    అదే అధికారం లో లేకపోతే ఏ అధికారి అయినా నిజాయితీగా పని చేస్తూ వాడికి మాటలకి కౌంటర్ ఇచ్చారు అనుకోండి.బట్టలు విప్పదీస్తా అని బెదిరిస్తాడు.

    ఏ అధికారి అయినా చంద్రబాబు దగ్గర పనిచేసి జైలుకి వెళ్ళారా ఇప్పటివరకు ?

Comments are closed.