మ‌రోసారి స‌త్య‌కుమార్ నోటి దురుసు…!

ఐదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓపెన్ చేస్తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. ఐదేళ్ల‌కు కూట‌మి అధికారంలో వుండ‌ద‌ని సీఐ మాట‌ల అర్థం.

వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ చూసేందుకు అమాయ‌కుడిలా క‌నిపిస్తారు. కానీ ఆయ‌న‌లో మ‌రో కోణం చూస్తే, స‌త్య‌కుమారేనా ఇలా మాట్లాడేది అనే అనుమానం క‌లుగుతుంది. ఇటీవ‌ల నెల్లూరు ప‌ర్య‌ట‌న‌లో త‌న‌కు విన‌తిప‌త్రం ఇవ్వ‌డానికి వ‌చ్చిన వైద్య సిబ్బందిపై నోరు పారేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏకంగా ఉద్యోగాల్లోంచి తీసి ప‌డేస్తా అని హెచ్చ‌రించారు.

తాజాగా తాడిప‌త్రి సీఐ సాయిప్ర‌సాద్‌ను ఫోన్‌లో దురుసుగా మాట్లాడిన‌ట్టు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆప‌రేష‌న్ సిందూర్ విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో తాడిప‌త్రిలో వీహెచ్‌పీ స‌భ్యులు బాణా సంచా పేలుస్తూ సంబ‌రాలు చేసుకున్నారు. అయితే ఇలాంటి వాటికి అనుమ‌తి లేద‌ని, పౌరుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌నే ఉద్దేశంతో ఏఎస్పీ రోహిత్‌కుమార్ ఆదేశాల మేర‌కు సీఐ వీహెచ్‌పీ కార్యాల‌యానికి వెళ్లి, వ‌ద్ద‌ని వారించారు. ఈ సంద‌ర్భంగా సీఐ కాల‌ర్‌ను వీహెచ్‌పీ నాయ‌కుడు ప‌ట్టుకున్న‌ట్టు తెలిసింది.

దీంతో సీఐకి కోపం వ‌చ్చి, వీహెచ్‌పీ నాయ‌కుల్ని స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. వీహెచ్‌పీ నాయ‌కులు మంత్రి స‌త్య‌కుమార్‌కు ఫోన్ చేసి సీఐపై ఫిర్యాదు చేశారు. ఇదే సంద‌ర్భంలో మాట్లాడాల‌ని సీఐకి సెల్‌ఫోన్ ఇచ్చారు. రోజూ చిల్ల‌ర తీసుకునే చిల్ల‌ర‌గాడివి అంటూ సీఐపై స‌త్య‌కుమార్ నోరు పారేసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

త‌న‌పై మంత్రి నోరు పారేసుకోవ‌డంపై సీఐ మ‌న‌స్తాపం చెందారు. తానేమీ చిల్ల‌ర తీసుకునే వాన్ని కాదంటూ సీఐ వీహెచ్‌పీ నాయ‌కుల‌పై ఆగ్ర‌హించారు. అంద‌రిపై కేసు న‌మోదు చేస్తాన‌ని, అధికారంలో ఉన్న కార‌ణంగా ప్ర‌స్తుతానికి మూసేసుకోవ‌చ్చ‌ని సీఐ వాళ్ల‌తో అన్న‌ట్టు స‌మాచారం. ఐదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓపెన్ చేస్తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. ఐదేళ్ల‌కు కూట‌మి అధికారంలో వుండ‌ద‌ని సీఐ మాట‌ల అర్థం. ఏది ఏమైనా వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి నోటి దురుసుపై ఇటీవ‌ల కాలంలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అస‌లు ఏం జ‌రిగిందో మంత్రి స‌త్య‌కుమార్ చెప్పాల్సిన అవ‌స‌రం వుంది.

7 Replies to “మ‌రోసారి స‌త్య‌కుమార్ నోటి దురుసు…!”

    1. ponile mana l11 rule ki vachina piskovadam tappa emi cheyaleru aa party ni 

      chusam ga 19-24 lo entha baga chesaroo

      annattu l 11 yedo annadu evm gurunchi 

  1. నొటి దురుసు లెనిది..

    రోజా

    కొడాలి నాని

    అంబటి

    వంశి (ఆందగాడు)

    జొగి రమెష్

  2. నొటి దురుసు లెనిది..

    రోజా

    కొడాలి నాని

    అంబటి

    వంశి (ఆందగాడు)

    జొగి రమెష్

    అనీల్ యాదవ్

    గొరెంట్ల మాదవ్

    తమ్మినెని సీతారం

  3. సీఐ గారిని దూషించడం తప్పే ,,, మొదట ఇవి చూసి అధికారం లోకి వస్తారా? రారా? ఒక అంచనాకీ రండి? ఆ తర్వాతే ఏదైనా..

    1.రిలయన్స్ ఇండస్ట్రీస్: రూ. 65,000 కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం, పర్యావరణ హిత శక్తి లక్ష్యాలకు అనుగుణంగా.

    2.లులు గ్రూప్: విశాఖపట్నంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, లగ్జరీ హోటల్ కోసం రూ. 2,200 కోట్ల పెట్టుబడి పునఃప్రారంభం.

    3.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): విశాఖపట్నంలో 10,000 ఉద్యోగాలతో డెవలప్‌మెంట్ సెంటర్ స్థాపన. 4.

    అమర రాజా బ్యాటరీస్: వై సీపీ ప్రభుత్వంతో వివాదాల తర్వాత, కొత్త పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తరణ.

    5.మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు: రూ. 4.8 లక్షల కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులు (ఉదా., NTPC గ్రీన్ హైడ్రోజన్ పార్క్ – రూ. 1.85 లక్షల కోట్లు, ఆర్సెలర్‌మిట్టల్/నిప్పాన్ స్టీల్). 6.లక్ష్యం: 2029 నాటికి రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల సృష్టి.

    అమలు చేయబడిన పథకాలు.

    .ఉచిత గ్యాస్ సిలిండర్లు: గృహాలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు; 42.40 లక్షల మంది లబ్ధిదారులు..అన్న క్యాంటీన్: రూ. 5కే భోజనం అందించే పథకం పునఃప్రారంభం; మొదటి దశలో 100 క్యాంటీన్లు.సామాజిక భద్రతా పెన్షన్లు: 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కోసం రూ. 4,500 కోట్లు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి 50 ఏళ్లు పైబడిన BCలకు నెలకు రూ. 4,000 పెన్షన్, 5 సంవత్సరాలకు రూ. 1.5 లక్షల కోట్లు. వాట్సాప్ గవర్నెన్స్: మెటాతో భాగస్వామ్యంతో 100 అత్యవసర సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులో. 13,326 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభలు, రూ. 4,500 కోట్ల విలువైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రతిపాదనలు. రాష్ట్ర రాజధానిగా అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యత, రూ. 1.5 లక్షల కోట్ల అంచనా వ్యయం. డ్రోన్ టెక్నాలజీ: కర్నూల్ సమీపంలో 300 ఎకరాల డ్రోన్ హబ్, 35,000 డ్రోన్ పైలట్ల శిక్షణ. ఉపాధి కల్పన: 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్రంలో నైపుణ్య లెక్కింపు చేపట్టడం.

    AP ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు: భూమి రికార్డుల రక్షణ కోసం వై సీపీ చట్టం రద్దు. మిగిలిన పథకాలు మే 2025 నుండి అమలుకు బడ్జెట్ కేటాయింపు జరిగింది.

Comments are closed.