హ‌వ్వా.. టీటీడీ స్థ‌లం ముంతాజ్‌కు కేటాయింపు!

తిరుమ‌ల ప‌విత్ర‌త కంటే, ముంతాజ్ హోట‌ల్‌కు టీటీడీ స్థ‌లాన్ని కేటాయించ‌డానికి పాల‌క మండ‌లి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమ‌ల ప‌విత్ర‌త విష‌యంలో సీఎం చంద్ర‌బాబునాయుడు, టీటీడీ పాల‌క మండ‌లి చైర్మ‌న్‌, కూట‌మి నేత‌లు ఆకాశ‌మే హ‌ద్దుగా డైలాగ్‌లు చెబుతుంటారు. విన‌డానికి ఎంతో ముచ్చ‌ట‌గా వుంటాయి. తీరా ఆచ‌ర‌ణ విష‌యానికి వ‌స్తే, తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడ్డం పెనంలో నుంచి పొయ్యిలో ప‌డ్డ చందంగా ఉంటోంద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

తిరుమల శ్రీ‌వారి పాదాల చెంత పేరూరు గ్రామ ప‌రిధిలో ముంతాజ్ హోట‌ల్‌కు భూమి కేటాయింపు తీవ్ర వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ముంతాజ్ హోట‌ల్ నిర్మాణాల‌కు అనుమ‌తులు తామే ఇచ్చామ‌ని కూట‌మి స‌ర్కార్ ఘ‌నంగా చెప్పుకుంది. అయితే సాధువులు, భ‌క్తుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఏకంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదుట సాధువులు నిర‌స‌న‌కు దిగారు.

దీంతో ప్ర‌భుత్వం త‌ప్పును స‌రిదిద్దుకుంటుంద‌ని అంతా అనుకున్నారు. సీఎం చంద్ర‌బాబు త‌న మ‌న‌వ‌డు దేవాన్ష్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల‌కు వెళ్లిన‌పుడు, లీజును ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యింద‌ని సాధువులు, భ‌క్తులు న‌మ్మారు. కానీ ముంతాజ్ క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది.

తాజాగా టీటీడీ పాల‌క మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించింది. నిజానికి టూరిజం శాఖ‌కు చెందిన భూమిని ముంతాజ్ హోట‌ల్‌కు గ‌తంలో కేటాయించారు. దాన్ని ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఇప్పుడు టూరిజం స్థ‌లాన్ని టీటీడీ తీసుకుని, దానికి బ‌దులు త‌మ స్థ‌లాన్ని ఆ శాఖ‌కు బ‌ద‌లాయించింది. అంత‌టితో ఆగిందా అంటే.. లేనేలేదు.

అరవింద్ కంటి ఆస్ప‌త్రి, క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి మ‌ధ్య టీటీడీకి సంబంధించిన 24.68 ఎక‌రాల‌ను టూరిజం శాఖ‌కు కేటాయించి, దాన్ని ముంతాజ్ హోట‌ల్‌కు కేటాయిస్తూ టీటీడీ పాల‌క మండ‌లి తీర్మానించ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కంటే దుర్మార్గం మ‌రొక‌టి వుంటుందా? అని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ప్ర‌శ్నించారు. అంతిమంగా ముంతాజ్ హోట‌ల్‌కు ల‌బ్ధి క‌లిగించేందుకు ప్ర‌భుత్వ పెద్ద‌లు తాప‌త్ర‌య ప‌డడాన్ని చూడొచ్చు.

తిరుమ‌ల ప‌విత్ర‌త కంటే, ముంతాజ్ హోట‌ల్‌కు టీటీడీ స్థ‌లాన్ని కేటాయించ‌డానికి పాల‌క మండ‌లి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఏ ర‌కంగా చూసినా ఇది తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడిన‌ట్టు కానేకాద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కేవ‌లం టీటీడీ స్థ‌లాన్ని టూరిజంశాఖ‌కు బ‌ద‌లాయించినంత మాత్రాన‌, తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడిన‌ట్టు ఎలా అవుతుందో చెప్పాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు.

30 Replies to “హ‌వ్వా.. టీటీడీ స్థ‌లం ముంతాజ్‌కు కేటాయింపు!”

      1. 2018 lo Axis tho chesukunna PPA ni enduku approve chesthunnaru ani adigithe, gottam Ravi garu 2022 lo Jagan agreement execute chesadu ani chebutaadu enti? Agreement chesukunnaka, court orders prakaram execute chesadu kani APERC approval ivvaledu. Ippudu enduku ichindi APERC approval? Pakodi kharchulu kosamena?

  1. హవ్వా, స్వామివారి పట్టువస్త్రాలు మన ఏసుపాదం మాడా రెడ్డి గాడు ఇవొచ్చేమ్!! 

    1. ఒరేయ్ సిగ్గు లేని వెధవ.. ఇపుడు జరుగుతున్న తప్పుడు పని గురుంచి మాట్లాడరా… 

    1. ponile neeli kj lk , nava randralu laga aithe janalu 29 lo estaru .

      appudu kj lk l 11 2.0 festival chesuko 

  2. Tdp abhimana dogs ippudu emani bow bow antayo chudali ee vishayam lo. Ledhante silent ga noru musukuntayemo endhukante ee decision mana chandram thisukunnadhi kadha.

    1. oreyi erripooka emi teliyakunda neelanti voorakukkalu arusthoo vuntayi ee GA gaadilaga.

      Kinda paiba moosukoni choosthu vundu emi jaruguthundo.

  3. ముంతాజ్ హోటల్ కి వై చీపి ఎందుకు భూములు కేటాయించింది ? అప్పుడు భక్తులు లేరా??

Comments are closed.