ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీమ్‌ను ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రాజకీయాల్లోనూ, పరిపాలన పరంగానూ ఆయన ఆచితూచి, ఎంపిక చేసుకుంటారు. ముఖ్యంగా చెడ్డపేరు రాకూడదని ఆయన భావిస్తుంటారని టీడీపీ నాయకులు అంటుంటారు. అయితే టైమ్ బాగా లేనప్పుడు, ఎంత మంచి అధికారుల్ని ఎంపిక చేసుకున్నా ప్రయోజనం వుండదు.
ప్రస్తుతం సీఎం ఏరికోరి ఎంచుకున్న ముఖ్య అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, సీఎంవోలో కీలక అధికారులు గతంలో మాదిరిగా ఫైల్స్‌ను క్లియర్ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు మంత్రులు, కూటమి ఎమ్మెల్యేల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి.
సీఎం సార్ చెబితే నో.. అదే మేడమ్స్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఎస్ అంటారేమో అని కూటమి ప్రజాప్రతినిధులు దెప్పి పొడుస్తున్నారు. చాలా వరకూ సీఎం నియమించుకున్న ఉన్నతాధికారుల వద్ద ఫైల్స్ మగ్గిపోతున్నాయని, అవి కదలాలంటే మేడమ్స్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలేమో అని … ప్రభుత్వ అనుకూల పత్రికలో వచ్చిన కథనాన్ని గుర్తు తెస్తున్నారు.
నిజానికి చంద్రబాబు ఎంచుకున్న ఓ ఉన్నతాధికారి గతంలో చిత్తూరు కలెక్టర్‌గా పని చేస్తూ అద్భుతమైన సేవలు అందించారు. ప్రజ్వలిక అనే పథకాన్ని చిత్తూరు జిల్లాలో ప్రవేశ పెట్టి పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు కార్పొరేట్ విద్యాసంస్థల్లో మంచి చదువు చెప్పించారు. ఆయనకు పిల్లలు కూడా లేరు. అయితే ఆయన నిజాయితీని ఎవరూ శంకించడం లేదు కానీ, ఎందుకనో ఆయన దగ్గర ఫైల్స్ క్లియర్ కావడం లేదని కూటమి ప్రజాప్రతినిధులు లబోదిబోమంటున్నారు.
బహుశా తన భార్యపై ప్రభుత్వ అనుకూల పత్రికలో వచ్చిన కథనంతో మనస్తాపం చెందినట్టు ప్రచారం జరుగుతోంది. ఏం చేయాలన్న మానసిక స్థైర్యం దెబ్బతినేలా, తన చేతుల్ని కట్టి పడేసినట్టు సన్నిహితుల వద్ద ఆయన వాపోతున్నారని తెలిసింది. సీఎం చేసిన సిఫార్సులన్నీ సదరు ఉన్నతాధికారి దగ్గరికి వెళుతున్నాయి. అయితే వాటిని ఆయన క్లియర్ చేయకుండా తన దగ్గరే నెలల తరబడి పెట్టుకుంటున్నాడని కూటమి ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. పైగా రకరకాల అంశాలపై లేఖలు ఇచ్చిన తమను అనుమానించే ధోరణిలో సీఎంవో అధికారులు చూస్తున్నారని కూటమి ప్రజాప్రతినిధులు లబోదిబోమంటున్నారు.
సీఎంవోలో మరో ఉన్నతాధికారి కథ.. రూటే వేరు అన్నట్టుగా వుంది. పట్టు విద్యలు బాగా తెలిసిన సదరు అధికారి, సీఎం చెప్పినా సరే, వ్యక్తిగతంగా తనకున్న మంచి సంబంధాలతో చేయకూడదని అనుకుంటే, ఏ శాఖలోనైనా ఆపుతున్నట్టు కూటమి ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఈ ఉన్నతాధికారి మాట వినే, ఫైబర్‌నెట్‌లో ఓ యువ ఐఏఎస్ అధికారి నెత్తిమీదికి తెచ్చుకున్నారని సమాచారం. సీఎంవోలోని ఆ అధికారి చెప్పుడు మాటలు వినే, ఫైబర్‌నెట్‌ను ఆర్థికంగా దివాళా తీసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరీ ముఖ్యంగా సీఎంవోలో నంబర్‌గా ఉన్నతాధికారిగా వ్యవహరించే ఆయనపై అందరికీ అనుమానమే. వైసీపీ నేతలతో కూడా టచ్‌లో వుంటూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వ రహస్యాలను తెలియజేస్తున్నారని ఇప్పటికే సీఎం బాబుకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి గుండెకాయ లాంటి సీఎంవో… నిష్క్రియగా మారడం కూటమిని ఆందోళనకు గురి చేస్తోంది.
అయ్యా గ్యాస్ ఆంధ్ర
అవి కూటమి సర్కార్కు సంబంధించిన విషయం నీది కాదు నీ పరిధిలో లేదు నీకు సంబంధమే లేదు దాని గురించి నువ్వు చింత పడనేలా గ్యాస్ ఆంధ్ర .
దానికి సంబంధించిన లాభనష్టాలు ఏమిటో వారికి వారు చూసుకుంటారు మధ్యలో నీకు వచ్చిన లాభ నష్టం ఏమిటి ఇది ఇందులో. మధ్యలో నువ్వు కలగజేసుకొని అవసరం ఉందా ? నీది కానప్పుడు పైన కింద మూసుకుని ఉంటే చాలా మంచిదేమో