ఆనందం అనేది ఎవరికైనా జీవిత పరమావధి అయితే కాకూడదు అంటాడు ఒక వేదాంతి. ఆనందం అంటే జీవితంలో అది ఎప్పుడో అంత్యదశలో అనుభవించేది కాకూడదనేది, అలా అనుకుని మిగతా జీవితాన్ని నిస్సారంగా గడిపేయకూడదని ఆ తాత్వికుడి అభిప్రాయం. చాలా విలువైన అభిప్రాయం అది. హ్యాపీనెస్ అనేది చేరే డెస్టినేషన్ కన్నా, హ్యాపీనెస్ అలాంగ్ ది జర్నీ చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి హ్యాపీనెస్ ఎక్కడ నుంచి వస్తుందంటే.. భౌతికపరమైన వాటి నుంచి, లేదా ఇతర వ్యక్తుల నుంచి కన్నా.. మీ నుంచి మీకే ఎక్కువ ఆనందం దక్కుతుందనేది మరెందరో వేదాంతులు, కాస్త తెలిసిన వారు చెప్పే మాట! మరి మీ ఆనందానికి మీరే కారణం అనేది వారు చెప్పే థియరీ. మరి మన ఆనందానికి మనమే కారణం కావాలంటే..మనకంటూ కొన్ని అలవాట్లు, ఆలోచణా ధోరణులు చాలా ఇంపార్టెంట్ అనేది మనస్తత్వం శాస్త్రజ్ఞులు చెప్పే విషయం. మరి జీవితం ఆనందకరంగా ఉండాలంటే.. మనసులో కొన్ని లక్షణాలు ఉండాలంటారు. అవేమిటంటే..!
కృతజ్ఞతాభావం!
గ్రాటిట్యూడ్.. ఈ భావన అనేది మన కు అంతర్లీనమై ఉండాలి. మనకున్న పరిస్థితులు, మనకున్న సౌకర్యాలు, మనం చూసే ప్రపంచం పట్ల కృతజ్ఞతాభావం. ఇదంతా ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి కదా.. అనే భావన ఉన్నప్పుడు మనిషి కచ్చితంగా ఆనందంగా ఉంటాడు. తనకు ఉన్నది ఎంత అయినా, లెక్కలేస్తే ఎన్ని లోట్లు ఉన్నా.. ఉన్నదాని పట్ల ఆనందం ఉంటే.. సగం జీవితం ఆనందమయం అయిపోయినట్టే! అందుకే ఆటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్.
వ్యాయామం!
వ్యాయామం అంటే కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. వ్యాయామం చేసే వారిలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయట. ఇవి మెదడుకు ఆనందాన్ని కలిగించే వెల్ నెస్ కెమికల్స్. వ్యాయామం అలవాటు ఉండేవారిలో ఈ ఆనందం ఆటోమెటిక్ గా జనరేట్ అవుతుందట!
ప్రకృతితో గడపడం!
ప్రకృతిలో ఎన్నో భాగమై ఉంటాయి, వాటితో అనుబంధం ఏర్పరుచుకువడం జీవితంలో సానుకూల ధోరణి ఏర్పడేలా చేస్తుంది. ఒక చెట్టును పెంచడమో, కనీసం ఇంటి దగ్గరే కొన్ని మొక్కలను పెంచుకుంటూ వాటిని రోజులో కాసేపు చూడటమో.. మంచి ప్రకృతి రమణీయతను ఆస్వాధించే మనస్తత్వం ఉండటమో! దీనికోసం కిలోమీటర్ల కొద్దీ ట్రావెల్ చేసే అవకాశమే అక్కర్లేదు. మీ ఊరి అవతలకు, ఇంటిని దాటి పార్కుకు వెళ్లి అక్కడ పచ్చదనాన్ని ఆస్వాధించగల మనస్తత్వం అయినా ఉండాలి కనీసం!
సోషల్ మీడియాను తగ్గించడం!
ప్రస్తుతం మనం ఆనందంగా ఉండాలంటే చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి సోషల్ మీడియాలో గడపడం తక్కువ చేయడం. ఎక్కడలేని చెత్తనంతా తెచ్చి వీడియోలుగా, రీల్స్ గా జనాలు మన మీదకు రుద్దుతున్నారు. అవి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పరిస్థితి తలెత్తుతూ ఉంది. అయితే రోజులో కనీసం నాలుగైదు గంటలకు మించి కూడా సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నవాళ్లు ఇండియాలో కోట్లలో ఉంటారు. సోషల్ మీడియాను ఎంత తగ్గిస్తే అంత మానసిక ఆరోగ్యం, ఆనందం దక్కుతుందనేది కచ్చితంగా చెప్పగలిగిన అంశం.
నిద్రకు ప్రాధాన్యతను ఇవ్వడం!
బ్యాడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ ను కలిగి ఉండకుండా.. నిద్రకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ.. పెందలాడే నిద్రపోయి, ఉదయాన్నే నిద్రలేవడం కూడా రోజును అందంగా మలిచే అంశాల్లో ఒకటి. దీని వల్ల చాలా మంచి ప్రయోజనాలుంటాయి ఆరోగ్యపరంగా, మానసికంగా!
దానగుణాన్ని కలిగి ఉండటం, జాలిని కలిగి ఉండటం!
సాటి మనిషిపై జాలితో శరీరాన్నీ కోసిచ్చేంత అవసరం లేదు కానీ.. ఇలాంటి మానసిక భావనలను కలిగి ఉండటం కూడా సవ్యమైన జీవన శైలే. వీలైతే అవసరం అయిన వారికి దానం చేయగలిగినవి, దానం ఇవ్వగలగడం, ఇతరులపై జాలిని కలిగి ఉండి.. ఎంపతీని ఫీలవ్వడం మంచి జీవిన శైలిలో భాగమే.
Nice ఆర్టికల్
Good one
కొందరికి మందు కొందరికి విందు కొందరికి పొందు….కొందరికి డబ్బు ఆనందం…అవి దక్కకుంటే విషాదం…అప్పుడేలా మ గు… డాలో రాయి….