లోకేశ్‌లా జ‌గ‌న్ ఎందుకు దృష్టి సారించ‌లేక‌పోయారు?

యువ‌కుడు, పారిశ్రామిక‌వేత్త కూడా అయిన జ‌గ‌న్ త‌న‌కు తెలిసిన ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధిపై ఎందుకు దృష్టి సారించ‌లేదో ఆయ‌న‌కే తెలియాలి.

వైఎస్ జగన్‌, నారా లోకేశ్ యువ నాయకులు. స‌మాజంలో వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా యువ నాయ‌కుల ఆలోచ‌న‌లు కూడా అభివృద్ధి దిశ‌గా పరుగెత్తాలి. ఈ విష‌యంలో మంత్రి నారా లోకేశ్‌ను త‌ప్ప‌క అభినందించాలి. అధికారంలోకి వ‌చ్చిన మొదలు, మిగిలిన విషయాల్ని పక్కన పెడితే, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌పై లోకేశ్ ప్ర‌త్యేక దృష్టి సారించారు. విద్యావంతులు, నిరుద్యోగులు, అభివృద్ధిని కాంక్షించే వారి మ‌న‌సు చూర‌గొనేలా రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం, పెండింగ్‌లో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను త్వ‌ర‌గా ప్రారంభింప‌చేయ‌డంలో లోకేశ్ చొర‌వ చూపుతున్నారు.

ఇవాళ తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌ర్జాతీయ స్థాయి గృహోప‌క‌రాల త‌యారీ సంస్థ ఎల్‌జీ ఎల‌క్ట్రానిక్స్ శ్రీ‌సిటీ యూనిట్‌కు లోకేశ్‌కు భూమి పూజ చేశారు. లోకేశ్ మాట్లాడుతూ ఈ రోజు ఎల్‌జీ యూనిట్‌కు మాత్ర‌మే కాదు, ఏపీ భ‌విష్య‌త్ కోసం కొత్త పునాదులు వేస్తున్నామ‌న్నారు. ఇది మన రాష్ట్రంతోపాటు భారతదేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు త‌మ‌ జైత్రయాత్ర కొనసాగుతుంద‌న్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా ఎల్ జి శ్రీసిటీ యూనిట్ ఆవిష్కృతమైంద‌న్నారు.

వైసీపీ పాల‌న‌లో ప్ర‌ధానంగా ఇలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాల కొర‌త క‌నిపించింది. కేవ‌లం సంక్షేమ పాల‌న‌కే జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారన్న అభిప్రాయం ఏర్ప‌డింది. ఇది కొన్ని వ‌ర్గాల్లో వైసీపీపై వ్య‌తిరేక‌త‌ను పెంచింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి, పారిశ్రామీకర‌ణ‌కు వైసీపీ ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే చెడ్డ‌పేరు తెచ్చుకుంది. కొన్ని ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకొచ్చినా, ప్ర‌చారం చేసుకోలేని ద‌య‌నీయ స్థితిలో వైసీపీ పాల‌న ముగిసింది.

యువ‌కుడు, పారిశ్రామిక‌వేత్త కూడా అయిన జ‌గ‌న్ త‌న‌కు తెలిసిన ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధిపై ఎందుకు దృష్టి సారించ‌లేదో ఆయ‌న‌కే తెలియాలి. ముఖ్యంగా ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నార‌న్న మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇలా గ‌త ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ ఎందుకు చేయ‌లేద‌న్న ప్ర‌శ్న స‌హ‌జంగానే ఉత్ప‌న్న‌మ‌వుతోంది. రాష్ట్ర‌మంటే అన్ని ర‌కాల ప్ర‌జ‌లుంటార‌నే స్పృహ గ‌త పాల‌కుల్లో లోపించ‌డం వ‌ల్లే , ఎన్నిక‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకున్నార‌నేది నిజం.

37 Replies to “లోకేశ్‌లా జ‌గ‌న్ ఎందుకు దృష్టి సారించ‌లేక‌పోయారు?”

  1. GA నీది మరీ అత్యాశ ఏమో ? మటన్ షాప్ లు, ఫిష్ షాపులు స్థాయి వాడిని ఖ్వాటం టెక్నాలజీ గురుంచి ఆలోచించమంటే ఎలా ?

  2. GA, నువ్వు కూడా లోకేష్ మెచ్చుకుంటూ ఆర్టికల్స్ రాస్తే ఇంక మాకు తిట్టడానికి ఏముంటుంది?

    1. మీరు లేని పోయినవి చెప్పి దువ్వాడ  లాగా ఎంకి బొచ్చలో రాయి వెయ్యకండి!!

  3. ఆయనకు తెలిసిన పారిశ్రామిక అభివృద్ధి….డబ్బా కంపెనీలు, క్విడ్ ప్రో కో, డబ్బు నొక్కడం.

    1. వీడు ఎక్కడ తాత అవుతాడో అని పిల్లల పెళ్లి కూడా చెయ్యడు.

  4.  ప్రజలు బానిసల్లా పడి ఉండాలంటే, అభివృద్ధి చెయ్యకుండా.. అప్పుడప్పుడు పరదాల్లో ఊరేగి బటన్ నొక్కీ, మనం వేసే బిక్ష కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేలా చెయ్యాలి .. ఇదీ మావోడి తిక్క థియరీ.. 

  5. GA, Jagan started so many development projects. He didn’t gave publicity like 420 party and also no proper counters to yellow media and 420 party leaders. 420 party doing publicity stunts on Jagan projects

  6. వాలంటీర్ ఉద్యోగం పేరుతో యువత కష్టాన్ని 5000 కి బేరం పెట్టి.. వాళ్ళని పార్టీ కి బానిసలుగా వాడుకోవాలని చూసాడు.. జగన్ రెడ్డి..

    ..

    ఉత్తరాంధ్ర కి ఐటీ .. రాయలసీమ కి మ్యానుఫ్యాక్చరింగ్.. కోస్తా ప్రాంతాలకు రిఫైనరీ, ఉక్కు ఇండస్ట్రీస్.. రాజధాని కి క్వాంటం టెక్ లాంటి ఫ్యూచర్ ఇండస్ట్రీస్..

    ఇలా కనీసం 2 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు.. మరో సుమారు 4 లక్షల సపోర్ట్ ఉద్యోగాల ఆలోచనతో యువత భవిష్యత్తు కోసం కష్టపడే నాయకుడు.. లోకేష్..

    వాళ్ళు టీడీపీ కి ఓటు వేసినా, వేయకపోయినా మాకు అనవసరం.. వాళ్ళ బతుకులు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కి ఉపయోగపడితే.. అదే చాలు..

    ..

    కంపారిసన్ ఏంటి రా.. కొండెర్రిపప్ప..

  7. ఇండస్ట్రీస్ రాలేదా? కడప వచ్చి ప్రాన్స్, ఫిష్,  చికెన్, మటన్  షాప్స్ ,  ప్రతి వైన్స్ షాప్స్ పక్కనే చికులు కొట్టు చూసి అప్పడు చెప్పు ఇండస్ట్రీస్ వచ్చాయా రాలేదా అని.

  8. మొత్తానికి జగన్ పరిశ్రమలు స్థాపించలేదని ఒప్పేసుకున్నావు…. సంతోషం….ఇది కూటమి ప్రభుత్వం…. ఏ శాఖా మంత్రి ఆ పని చేస్తారు….ఐటీ శాఖ మంత్రి ఆయన పని ఆయనే చేస్తాడు….గత ప్రభుత్వంలో మంత్రులు అందరికి ఒక్కటే పని, మీడియా ముందుకి వచ్చి బూతుల పురాణం…. అన్ని నిర్ణయాలు సకల శాఖా మంత్రి సజ్జల గారు, బటన్ నొక్కే ముఖ్య మంత్రి గారు…. కనీసం లోకేష్ ఆలోచనలు గుడివాడ అమర్నాథ్ కి ఎందుకు రాలేదు అని కూడా అడగట్లేదు మీరు…. మీరు కూడా మంత్రులు ఎవ్వరు ఏ శాఖో మరిచిపోయారు….

  9. ఆ ఏ ముంది పొరపాటున మా అన్నయ్య ముఖ్యమంత్రి అయితే ఎల్జి కంపెనీ రాజశేఖరరెడ్డి గారు లేఖ రాయడం వల్లే వచ్చిందని చెబుతారు మన బుగ్గన గారు 

  10. “లోకేశ్‌లా జ‌గ‌న్ ఎందుకు దృష్టి సారించ‌లేక‌పోయారు?”. Because, he lacks content in character and hence need lot of elevations

  11. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయాయి.

    విశాఖపట్నం లో గ్లోబల్ పారిశ్రామికవేత్త ల summit మర్చిపోయావా?

    వందల కొద్దీ MOU లు సైన్ చేయించాడు, డజన్ల కొద్దీ టీ అమ్ముకునే వాళ్లు సూట్ వేసుకొని వచ్చి,వాటి మీద సంతకాలు పెట్టారు.

    ఆ కంపెనీ ల ను పర్యవేక్షణ చెయ్యడానికి కొండ మీద 500 కోట్ల ప్రజా ధనం తో గుడిసె కూడా వేసుకున్న యువ నాయకుడి మీద ఇలాంటి ఆర్టికల్ రాస్తావా?

    1. ఆ పారిశ్రామికవేత్తలు లంచ్ టైంలో ఫుడ్ కోసం కొట్టుకున్నారు కూడా .

  12. యమగోల సినిమాలో రావు గోపాల్రావు గారి డైలాగ్ ఒక్కొక్కడిని దేవుడు ఒకందుకు పుట్టిస్తాడు అని లోకేష్ గారు బాత్రూం గొడ్డలి కి unfit మనోడు పరిశ్రమలు ఉపాధి తేవటానికి unfit ఆధారాలు లేకుండా కేసు లు అరెస్ట్ లు లోకేష్ గారు చేయించడు మనకు ఆధారాలతో పనిలేదు లోపలేసేయడం అయన సొమ్ము తింటా ఇలాంటి ఆర్టికల్ వేయడం బాగోలేదు ga గారు

  13. “60 ఏళ్ళ లెవెన్ మావ” ఇంకా యువకుడా?? యా ఊర్లో అంటారు??

    పిల్లకి పెళ్లి చెయ్యలేదు కానీ, చేస్తే just 9 నెలల్లో తాత ని చెయ్యడానికి 11 మంది రెడీ గా ఉన్నారు

  14. నువ్వే ఒప్పేసుకుంటున్నావ్ నిజాలు .. మనది అంతా ఇంత ముష్టి పడేసి ఓట్లు లాగేసి వ్యాపారం ..

  15. సజ్జల చెప్పినట్లు వైసీపీ వోటర్లు వేరు. వారికి కావాలసింది సంక్షేమపథకాలే కానీ పరిశ్రమలు కాదు. పరిశ్రమల ద్వారా వచ్చే కొద్ది ఉద్యోగాల కన్నా వేలాది వాలంటీర్, సచివాలయ ఉద్యోగాలు వారికి నచ్చుతాయి, అందుకే జగన్ గారు పరిశ్రమల మీద దృష్టి పెట్టలేదు.

  16. జ/ గ /న్ వయసు 52. ఆవయసు వాళ్ళని యువకులు అంటారని ఇప్పుడే తెలిసింది.

    విధ్వంసకారునికి అభివృద్ధి చేసే ఆలోచనలు ఎలా వస్తాయి GA

  17. లోకేష్ బాగానే మేనేజ్ చేస్తున్నాడు “గ్రేట్ ఆంధ్రా “ని … ఎంత ఏంటి ? లేకపోతే నువ్వు లోకేష్ గురించి పాజిటివ్ గా రాయడం ఏంటి .. విడ్డురం కాకపోతే ..!

Comments are closed.