విజయవాడ ఎంపీ కేశినేని చిన్న తన అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని దెబ్బకు హడలిపోతున్నారు. కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇది వరకే ప్రకటించారు. అయితే తమ్ముడైన విజయవాడ ఎంపీ చిన్ని విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చారు. నిత్యం చిన్నిపై ఏదో ఒక ఆరోపణ చేయడంతో పాటు ఆధారాలు కూడా షేర్ చేస్తూ, నిలదీస్తున్నారు. నాని దెబ్బకు చిన్నికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి.
రాజ్ కసిరెడ్డితో చిన్నికి అనుబంధంపై ఇటీవల నాని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తూ, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్ కసిరెడ్డి, చిన్ని కంపెనీలకు ఒకే మెయిల్ ఉండడాన్ని ఆయన బయటపెట్టారు. అప్పటి నుంచి నోరు తెరవని చిన్ని, ఎట్టకేలకు ఇవాళ మీడియా ముందుకు వచ్చారు.
రాజ్ కసిరెడ్డితో తనకు సాన్నిహిత్యం ఉన్న మాట నిజమే అని ఒప్పుకోవడం విశేషం. నాలుగుసార్లు రాజ్‌ని కలిసినట్టు అంగీకరించారు. ఇద్దరం కలిసి ఒకే కంపెనీ పెట్టామని అంగీకరించారు. ఆ కంపెనీ డెవలప్‌మెంట్‌తో సహా ఆరు నెలలు అన్ని ఖర్చులు తానే పెట్టినట్టు చిన్ని వెల్లడించారు. అయితే వైఎస్ జగన్‌తో రాజ్ కసిరెడ్డికి సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసినట్టు చిన్ని చెప్పారు.
కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని చిన్ని తన అన్నపై అక్కసు వెళ్లగక్కారు. మద్యం వ్యాపారంలో రూ.3,200 కోట్ల స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి వైఎస్ జగనే అని ఆయన ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాస్తున్నట్టు కేశినేని చిన్ని తెలిపారు. రూ. 3600 కోట్లు దోచేసిన జగన్ సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తనపై ఆరోపణలు నిరూపించేందుకు కేశినేని నాని, జగన్‌కు 24 గంటలు సమయం ఇస్తున్నట్టు కేశినేని చిన్ని సవాల్ విసిరారు.
అలాగే తన అన్నకు సంబంధించిన ఇంటర్నేషనల్, దుబాయ్, అమెరికాలోని రెండు కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లుగా వచ్చిన వార్తలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఖర్చు తానే పెట్టుకుంటానని ఆయన ప్రకటించారు. కేశినేని చిన్నికి సమాధానం చెప్పుకోడానికి రెండు రోజుల సమయం పట్టింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా అని జగన్‌ను డిమాండ్ చేయడం చిన్ని బేలతనాన్ని బయటపెట్టింది.
మరి తిరుమల లడ్డు కేసు సిబిఐ ని అడిగినప్పుడు గుర్తులేదా కేంద్రం లో భాగ్యస్వామి అని. అంటే టీడీపీ కేంద్రం లో ఉన్నంత కాలం సిబిఐ ఎంక్వయిరీ కి ఏ కేసు ఆడకూడదు అనేగా
ఊర్ని నువ్వు అలా ఫీల్ అయ్యవ్వ? .
ఇంకా రాయి 11 శామ్యూల్ జగన్ రెడ్డి దెబ్బకి 100 మంది టెర్రరిస్ట్పా లు హతం, పాకిస్థాన్ బారత్ తో రాజీ కి వచ్చింది.
రాయి దెబ్బ?