లిక్క‌ర్ కేసులో ఆ ముగ్గురి కి సుప్రీం షాక్‌…కింక‌ర్త‌వ్యం?

అంతిమంగా జ‌గ‌నే సిట్ లేదా కూట‌మి స‌ర్కార్ టార్గెట్‌. ఆ దిశ‌గా సిట్ రిమాండ్ రిపోర్టుల‌ను న్యాయ‌స్థానాల‌కు స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే.

లిక్క‌ర్ కేసులో సుప్రీంకోర్టులో త‌ప్ప‌క ఊర‌ట ల‌భిస్తుంద‌ని ఆశించిన మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కార్య‌ద‌ర్శి, ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య‌రెడ్డి, పీఏ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, భార‌తి సిమెంట్స్ డైరెక్ట‌ర్ బాలాజీ గోవింద‌ప్ప‌ల‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ముంద‌స్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఇప్ప‌టికే ఏపీ హైకోర్టులో వాళ్ల‌కు చుక్కెదురైన సంగ‌తి తెలిసిందే.

స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ముంద‌స్తు బెయిల్‌ను తిర‌స్క‌రించ‌డంతో ఆ ముగ్గురి కింక‌ర్త‌వ్యం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఒక‌వైపు న్యాయ పోరాటం చేస్తూనే, మ‌రోవైపు విచార‌ణ టీమ్ సిట్‌కు దొర‌క్కుండా ఆ ముగ్గురు అజ్ఞాత‌వాసం గ‌డుపుతున్నారు. కొన్ని రోజులుగా వాళ్లు సెల్‌ఫోన్లను స్విచ్ఛాప్ చేసి ఎక్క‌డో గ‌డుపుతున్నారు.

ఇప్ప‌టికే లిక్క‌ర్ కేసులో న‌లుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, బాలాజీల‌ను కూడా నిందితులుగా చేర్చి, ఏసీబీ కోర్టులో సిట్ టీమ్ మెమో దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ముగ్గురి ద్వారానే వైఎస్ జ‌గ‌న్‌కు లిక్క‌ర్ డ‌బ్బు చేరింద‌నేది సిట్ ఆరోప‌ణ‌. అంతిమంగా జ‌గ‌నే సిట్ లేదా కూట‌మి స‌ర్కార్ టార్గెట్‌. ఆ దిశ‌గా సిట్ రిమాండ్ రిపోర్టుల‌ను న్యాయ‌స్థానాల‌కు స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే.

అయితే రిమాండ్ రిపోర్ట్‌ల‌పై రాజ్ క‌సిరెడ్డి, స‌జ్జ‌ల శ్రీ‌ధ‌ర్‌రెడ్డి సంత‌కాలు చేయ‌ని సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా విచారించి, అలాంటి రిమాండ్ రిపోర్ట్‌ల‌నే న్యాయ‌స్థానాల‌కు స‌మ‌ర్పించే అవ‌కాశం వుంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా లిక్క‌ర్ కేసులో సిట్ దూకుడు మీద ఉంది. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు కూడా ముంద‌స్తు బెయిల్‌ను నిరాక‌రించ‌డంతో వాళ్ల‌ను అరెస్ట్ చేయ‌డానికి సిట్ వేట మొద‌లు పెట్టింది. ఇదిలా వుండ‌గా ఈ 13వ తేదీకి సుప్రీంకోర్టు విచార‌ణ‌ను వాయిదా వేసింది.

27 Replies to “లిక్క‌ర్ కేసులో ఆ ముగ్గురి కి సుప్రీం షాక్‌…కింక‌ర్త‌వ్యం?”

  1. Why no heritage employee involving in govt activities ?? Y only from yakshi and it’s cement company ??.. Made Govt as a private property 

    1. ఇప్పుడు కాదు.. 2009 లో వాడి అయ్య సచ్చినప్పటి నుండి.. ఈ రాష్ట్రం వాడి సొంత జాగీరు అనే భ్రమల్లో ఉన్నాడు..

      అధికారం వాడి సొంతం అని కలల్లో బతుకుతుంటాడు..

      దానికోసం ఎంతకాయినా బరి తెగిస్తాడు .. ఎంతకయినా దిగజారిపోతాడు..

      1. అందులో భాగంగానే 2009 ఎన్నికల తరువాత, 2019 ఎన్నికల ముందు జరిగిన సంఘటనలు ..

  2. ///ఒక‌వైపు న్యాయ పోరాటం చేస్తూనే, మ‌రోవైపు విచార‌ణ టీమ్ సిట్‌కు దొర‌క్కుండా ఆ ముగ్గురు అజ్ఞాత‌వాసం గ‌డుపుతున్నారు. కొన్ని రోజులుగా వాళ్లు సెల్‌ఫోన్లను స్విచ్ఛాప్ చేసి ఎక్క‌డో గ‌డుపుతున్నారు.///

    .

    పరారి లొ ఉన్నారు అని చెప్పటనికి వచ్చిన తంటానా ఇది? అయినా పారిపొయారు అని చెప్పెటానికి బలె బులుగు రంగెసావ్!

  3. మరి ఇంత జరుకుతున్నా మన అన్న ప్యాలెస్ బయటకి వచ్చి, ఈ లిక్కర్ స్కాం తొ నాకు సంబందం లెదు అని ఎ వివరణా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతాడు ఎమిటి?

  4. పరారీ ల లిస్ట్ పెరిగిపోతుంది..త్వరలో పెద్దిరెడ్డి,భూమన, ద్వారంపూడి.ఇప్పటికే కాకాని, తోపుదుర్తి..

  5. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో సిట్ ఇలాగే పనిచేసిందా అంత కంగారు పడుతున్నారు..

    1. ఇప్పటికే లేటు.. ఇలా గ్యాప్ లు ఇచ్చుకుంటు పోతే.. రాజమండ్రి జైలు కి చేరేసరికి లేట్ ఐపోతుంది..

      సూపర్ ఫాస్ట్ బండి ఎక్కించేసే సమయం వచ్చేసింది..

      ఈడీ కేసులు తెరిస్తే.. బెయిల్ కూడా దొరకదు..

      ..

      ఆహా.. ఎంత చక్కగా.. పక్కాగా.. ప్లాన్ చేసుకుంటూ పోతున్నారు..

      జై లోకేష్.. అసలు నాకేమీ తెలీదన్నట్టు ఫేస్ పెట్టుకుని ఉంటాడు..

  6. Cbn gaadu jagan aatu kuda peekaledu..akkada emi proof ledu Bongu lo cash transactions ki proof entra pooka

    1. లోపలేసి నాలుగు పీకితే.. వాడే ఒప్పుకొంటాడు..

      నువ్వు టెన్షన్ పడమాకు.. అన్నీ సక్రమంగా జరిగిపోతాయి..

      ఆతులేమి ఖర్మ.. ఒంట్లో రక్తం కూడా లాగేస్తారు..

      మన ఆరు జిల్లాల అందగాడు .. వల్లభనేని వంశి ని చూసావుగా.. తోలు తీసిన కప్పలాగా తయారయ్యాడు..

      నెక్స్ట్ వంతు.. జగన్ రెడ్డే..

      కోర్ట్ కి జైలు కి మధ్య పాదయాత్ర చేస్తూ శేష జీవితం గడిపేస్తాడు..

  7. ఒకసారి అజ్ఞాతం / పరారీ లోకి వెళితే, అసలు ఇవ్వకుండా చట్టం చెయ్యాలి

  8. They dont have choice now , these 3 candidates have to surrender asap.

    మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కార్య‌ద‌ర్శి, ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య‌రెడ్డి,

    పీఏ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి,

    భార‌తి సిమెంట్స్ డైరెక్ట‌ర్ బాలాజీ గోవింద‌ప్ప‌ 

  9. avunu neeli kj lk lara , tappu chesina vale bail kosam veltaru ani annaru kada

    mari eppudu aaa neeli kj lk lu emi cheyaka pothe sc ki enduku vellaru ??

    netizens talk on paytm neeli kj lk lu 

Comments are closed.