మళ్లీ జోకులు పేల్చిన మెగా కమెడియన్…!

మన మెగా కమెడియన్ మళ్లీ తెరమీదికి వచ్చాడు. జోకులు పేల్చాడు. అప్పుడప్పుడు ఆయన తెర మీదికి వచ్చి నవ్వులు పండిస్తుంటాడు. ఆయన చెప్పే జోకులకు పడీపడీ నవ్వాల్సిందే. ఆయన జోకులను చాలా సీరియస్గా చెబుతాడు.…

మన మెగా కమెడియన్ మళ్లీ తెరమీదికి వచ్చాడు. జోకులు పేల్చాడు. అప్పుడప్పుడు ఆయన తెర మీదికి వచ్చి నవ్వులు పండిస్తుంటాడు. ఆయన చెప్పే జోకులకు పడీపడీ నవ్వాల్సిందే. ఆయన జోకులను చాలా సీరియస్గా చెబుతాడు. ఆయన చెప్పే జోకులకు మనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే తప్ప ఆయన తొణకడు, బెణకడు. వెనకటికి ఒక ఊళ్లో ఒకడిని సరదాగా ‘బొంకారా…బొంకరా’ అని కొందరు అడిగారట. బొకడం అంటే అబద్ధాలన్న మాట.

అంటే వాడితో అబద్ధాలు చెప్పించుకొని నవ్వడం ఆ ఊళ్లో వాళ్లకు సరదా అన్న మాట. ఏవైనా అబద్ధాలు చెప్పరా అని అంటే వాడు ‘మా ఊళ్లో మిరియాలు తాటి కాయలంత ఉంటాయి’ అన్నాడట. వాస్తవానికి అంత పెద్ద మిరియాలు ఉండవు కదా. మన మెగా కమెడియన్ కూడా అలాంటివాడే. ఆ మెగా కమెడియన్ బ్రహ్మానందం అనుకొని ఉంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఆయన ఎవరో కాదండి…క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్.

ఆయన ఏం బోధిస్తున్నాడో మనకు తెలియదుగాని ఆయనకు రాజకీయాల పిచ్చి మాత్రం బాగా పట్టుకుంది. ఆల్రెడీ ప్రజాశాంతి అనే పార్టీ కూడా పెట్టాడు కదా. ఎన్నికల సమయంలో ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ హడావుడి చేస్తుంటాడు. ఆ తరువాత దాని అడ్రసు దొరకదు. కొన్ని ముఖ్య సందర్భాల్లో కేఏ పాల్ తెర మీదికి వచ్చి ఏదో మాట్లాడి పోతుంటాడు. జనం కాసేపు నవ్వుకుంటారు.

తాజాగా భారత్, పాకిస్తాన్మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే కదా. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసి ఉగ్రవాదులు శిబిరాలను ధ్వంసం చేసింది కూడా. ఈ సందర్భంగా పాల్ మీడియాతో మాట్లాడుతూ భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని తాను ఆపుతానని చెప్పాడు. పగలు రాత్రి లేకుండా, కంటి మీద కునుకు లేకుండా రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నానని చెప్పాడు.

ఇటీవల రహస్యంగా మూడు రోజుల పాటు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులను కలుసుకున్నట్లు చెప్పాడు. ఆ అమెరికా నాయకులు తనతో ‘యుద్దాన్ని ఆపే శక్తి నీకే ఉందయ్యా’ అన్నారట. ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీని , హోం మంత్రి అమిత్ షాలను కలిసిన తర్వాత తాను పాకిస్తాన్ కు వెళ్తున్నట్లు చెప్పాడు. యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలోనే తాను ఉన్నట్లు చెప్పాడు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో తను పాకిస్తాన్ వెళ్లినట్లు చెప్పాడు.

ఏపీ మాజీ సీఎం జగన్ అసలు క్రిస్టియన్ కాదని, ఆయన చిన్నజీయర్ స్వామి భక్తుడని పాల్ అన్నాడు. తన ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే గత ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడిపోయాడని చెప్పాడు. రెండు రోజుల కిందట తెలంగాణ అప్పుల గురించి పాల్ మాట్లాడాడు. రాష్ట్రానికి ఎక్కడా అప్పులు పుట్టడం లేదని రేవంత్ రెడ్డి అన్నాడు కదా. వెంటనే పాల్ రంగంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి బయటికి వెళ్తే తమను భిక్షగాళ్ల మాదిరిగా చూస్తున్నారని.. ఎవరూ నమ్మడం లేదని అన్నాడని, అక్కడిదాకా పరిస్థితి ఎందుకు వచ్చిందని, అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పాల్ ప్రశ్నించాడు.

ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? అని కోపగించుకున్నాడు. గత వారం తాను వాషింగ్టన్ డీసీకి వెళ్లానని, అక్కడ అనేకమంది వ్యాపారులను కలుసుకున్నానని చెప్పాడు. తనతో పాటు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు వస్తే తాను వ్యాపారులతో మాట్లాడి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించేవాడిని కదా అని చెప్పాడు.

దీనివల్ల ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేవి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే అవకాశం ఉండేదన్నాడు. కానీ ఇవన్నీ చేద్దామని అడిగితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రారని చెప్పాడు. వస్తామని చెబుతారని, కానీ ముందుకు మాత్రం రారని నిష్టూరాలాడాడు. ఇప్పటికైనా వారు ముందుకు వస్తే తన వంతుగా సహాయం అందిస్తానని చెప్పాడు. ఆయన జోకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపం …ఏమిటో కేఏ పాల్.

13 Replies to “మళ్లీ జోకులు పేల్చిన మెగా కమెడియన్…!”

  1. ఒక కె ఎ పాల్ ( కపాల్ అని ఎవరో సోషల్ మీడియాలో పేరు పెట్టారు), ఒక నిత్యానంద స్వామి 

  2. కమిడియన్ అంటూ KA పాల్ బొమ్మ వేగయానె అనిపించింది ఈ పాల్ ఎమన్నా జగన్ ని విమర్సించాడా అని.

    ఈయన జగన్ ని క్రిస్టియన్ కాదు అన్నడు అంట! పొని నెను క్రిస్టియన్ నె అని జగన్ ని చెప్పమను. సరిపొద్ది!

    1. కదా.. ఆర్టికల్ ఓపెన్ చేయగానే .. పాల్ ఫోటో చూడంగానే అర్థమైపోయింది.. 

      వీడు జగన్ గురించి ఏదో కౌంటర్ ఇచ్చినట్టున్నాడు.. అందుకే కమెడియన్ గా మారిపోయాడు అని అర్థమైపోయింది..

      ఆర్టికల్ చదివాకా .. నా గెస్ కరెక్ట్ అని కంఫర్మ్ అయిపొయింది..

  3. KA పాల్ జగన్ ని విమర్సిస్తె ఈయన కమెడియన్ అన్న విషయం GA కి గుర్తుకువస్తుంది.

    ఉండవల్లి జగన్ ని విమర్సిస్తె ఈయన ఉసరవల్లి అన్న విషయం GA కి గుర్తుకువస్తుంది.

    JC దివకర్ రెడ్డి చంద్రబాబు ని విమర్సిస్తె అయన నికార్సుగా మాట్లాడె వ్యక్తి అయిపొతాడు.

    JP జగన్ పదకాలని మెచ్చుకుంటె ఆయన మెదావి అన్న విషయం GA కి గుర్తుకువస్తుంది.

  4.  అప్పట్లో ఇదే పాలు కనుచూపు కోసం YSR, జగన్   పాల్ హెలికాపర్ దగ్గర ఎదురు చూపులు చూసిన సంగతి గుర్తు లేదా ? 

     అప్పట్లో పాల్ టైమ్ బాగా వున్న రోజులో,

    పాల్  మంచినీల బాటిల్ జగన్ మోసేవాడు.

  5. ఇలాంటి వాళ్ళ మాటలు విని జనాలు మతం మారుతున్నారు. ఖర్మ.

  6. పాకిస్తాన్ వెళ్తాడా? KA PAL గా వెళ్లి, పాల్కి ఖాన్ గా తిరిగి వస్తాడు (ఒకవేళ వస్తే)

Comments are closed.