ఆ పేరు కోసం ఆ రెండు రంగాల పోటా పోటీ…!

‘ఆపరేషన్‌ సిందూర్‌’ ….దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి సర్వనాశనం చేయడానికి ఉద్దేశించిన ఆపరేషన్కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పెట్టిన పేరు ‘ఆపరేషన్ సిందూర్’ .…

‘ఆపరేషన్‌ సిందూర్‌’ ….దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి సర్వనాశనం చేయడానికి ఉద్దేశించిన ఆపరేషన్కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పెట్టిన పేరు ‘ఆపరేషన్ సిందూర్’ . ఈ ఆపరేషన్ ద్వారా ఏం జరిగిందో అందరికీ తెలుసు. మోదీ ఏ ముహూర్తాన ఈ పేరు ఖరారు చేశారోగాని అది దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది.

ఉగ్రవాదులు జరిపిన దాడిలో మహిళలు తన భర్తలను కోల్పోయారు కాబట్టి, వారు తమకు ప్రాణప్రదమైన, తమ గౌరవానికి ప్రతీక అయిన తమ నొసటి సిందూరాన్ని కోల్పోయారు కాబట్టి వారి కన్నీటిని తుడిచే విధంగా, వారికి ఉపశమనం కలిగించే విధంగా ఆపరేషన్ సిందూర్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఈ పేరు చాలా బాగుందని, శక్తిమంతంగా ఉందని భావించిన పలువురు సినిమా నిర్మాతలు ఈ టైటిల్తో సినిమా తీయాలనుకుంటున్నారు. ఈ టైటిల్ను రిజిస్టర్ చేయించడానికి పోటీలు పడుతున్నారు.

అలాగే వ్యాపార దిగ్గజాలు పలువురు ఆపరేషన్ సిందూర్ను ట్రేడ్మార్క్గా వాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం ఒకటో, రెండో కాదు, ఏకంగా 15 బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. అనుమతికోసం ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్‌లో దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఇందులో జీ స్టూడియోస్, టీ సిరీస్ వంటి ప్రముఖ సంస్థలు ఉండటం విశేషం.

అయితే జియో స్టూడియోస్‌ తన అప్లికేషన్‌ను ఉపసంహరించుకుంది. తమ అనుమతి లేకుండా కంపెనీ తరఫున ఒకరు దరఖాస్తు చేశారని తెలిపింది. ఆ పేరును వినియోగించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ టైటిల్కోసం దరఖాస్తు చేసిన ఒక నిర్మాత మాట్లాడుతూ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడుల అంశంతో సినిమా తెరకెక్కుతుందా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. అందరి దృష్టిని ఆకర్షించగలిగే పేరు తమ సినిమాలకు పెట్టేందుకు దర్శక, నిర్మాతలు ఉత్సాహం చూపిస్తుంటారని అన్నారు.

ఇక ఆపరేషన్ సిందూర్ పేరు ట్రేడ్‌మార్క్ కోసం పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ కూడా ఉంది. ‘ఆపరేషన్ సిందూర్ ‘ ను వర్క్‌మార్క్‌గా నమోదు చేయాలని కోరుతూ ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ వద్ద దరఖాస్తు చేసినట్టు లైవ్‌లా నివేదిక పేర్కొంది. ముఖేష్ అంబానీతో పాటు ఆపరేషన్ సిందూర్ పదం కోసం చైత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, అలోక్ కొఠారి అనే ముగ్గురు వ్యక్తులు కూడా ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.