వెండితెరపై సూపర్ సక్సెస్ అయిన కొంతమంది హీరోలు, రియల్ లైఫ్ లో మాత్రం వైవాహిక బంధంలో అంత సక్సెస్ కాలేకపోయారు. అమీర్ ఖాన్ అలాంటి నటుడే. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ నటుడు, వైవాహిక బంధాన్ని మాత్రం చివరి వరకు కొనసాగించలేకపోయాడు.
ఇప్పటికే ఇద్దరు మహిళల్ని పెళ్లాడి, వాళ్లకు విడాకులిచ్చిన అమీర్, ఇప్పుడు మరో మహిళను తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఈ సందర్భంగా అమీర్ వైవాహిక జీవితాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కెరీర్ ప్రారంభంలోనే రీనా దత్తాను చూసి ఇష్టపడ్డాడు అమీర్. ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. 20 ఏళ్ల వయసులో రీనాను అమితంగా ప్రేమించాడు అమీర్. ఆమెకు రక్తంతో ప్రేమలేఖ కూడా రాశాడు. ఆ వయసులో అంతకుమించి ఆలోచనలేం వస్తాయి.
ఆ మరుసటి ఏడాదే, అమీర్-రీనా పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అమీర్ వయసు 21 ఏళ్లు. ఇంట్లో పెద్దల్ని కాదని ఇద్దరూ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వాళ్ల పెళ్లి ఖర్చు 10 రూపాయలు. 50 పైసలు పెట్టి టికెట్ తీసుకొని బస్సెక్కారు. రిజిస్టర్ ఆఫీస్ లో దిగారు. మిగిలిన 9 రూపాయలు అక్కడ ఖర్చయ్యాయి. ఇది 1986లో జరిగింది.
అమీర్-రీనా 16 ఏళ్లు కలిసి కాపురం చేసి విడిపోయారు. వాళ్ల కాపురానికి గుర్తుగా జునైద్, ఐరా కూడా పుట్టారు. ఆ తర్వాత కిరణ్ రావులో కొత్త ప్రేమను చూశారు అమీర్. 2005లో అమీర్-కిరణ్ పరిచయం జరిగింది. లగాన్ సెట్స్ లో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ తర్వాత అశుతోష్ గోవారికర్ తీసిన పలు యాడ్స్ కోసం కలిసి పనిచేశారు. ఇద్దరూ బాగా క్లోజ్ అయింది ఈ యాడ్స్ టైమ్ లోనే.
పెద్దగా టైమ్ తీసుకోకుండానే ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. ఆశ్చర్యంగా కిరణ్ రావుతో కూడా సరిగ్గా 16 ఏళ్లు కాపురం చేశారు అమీర్. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఆజాద్ రావు జన్మించాడు. కొన్నేళ్ల కిందట కిరణ్ రావుతో కూడా విడిపోయారు అమీర్.
కిరణ్ రావుతో విడిపోయిన మూడేళ్లకే గౌరీ స్ప్రాట్ కు కనెక్ట్ అయ్యారు అమీర్. ఇంకా చెప్పాలంటే.. కిరణ్ తో విడిపోతున్నట్టు 2021 డిసెంబర్ లో ప్రకటించిన అమీర్.. గౌరీతో 2024 డిసెంబర్ నుంచి రిలేషన్ షిప్ మొదలుపెట్టాడు. గౌరికి తన మొదటి భర్త ద్వారా బాబు జన్మించాడు. ప్రస్తుతం అబ్బాయికి ఆరేళ్లు.
60 ఏళ్ల వయసులో మరో పెళ్లి తనకు సూట్ అవుతుందా లేదా అనే విషయం తనకు తెలియదని, గౌరి మాత్రం తన జీవిత భాగస్వామి అని ప్రకటించారు అమీర్. ఇదీ ఈ హీరో ముగ్గురు భార్యల కథ.
Pawankalyan 2



















That is 10 years validity this is 16 years validity…

Mahanubavudu
Comedy haa


కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
విచిత్రం ఏమిటంటే , ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న నటుల వ్యక్తిగత మత పరమైన ఇష్టాలు వేరేగా ఉన్నాయి, జెమిని గణేశ్ , కమలహాసన్ ఒకలా , పవన్ కళ్యాణ్ ఇంకోలా, ఆమిర్ఖాన్ ఇంకొకలా,
Madhaaa pichii
ఏముంది ఇందులో చెప్పుకోడానికి ముందు వయస్సు…తరువాత కెరీర్..ఆపై వచ్చిన సంపాదన…తోడు..
Mari dhaneee madha pichii antaru telugu movie industry lo kuda mega family vundhi same type
Mari dhaneee madha pichii antaru pawankalyan
All women are hindus while this guy is …..
how about our local star hero with 3 wives ?
He married hindu ladies only why couldn’t he get a good woman in his community. Why he put his children name Muslim names