ఆ ఒక్కటి వదిలేసిన పవన్ కల్యాణ్

తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇవ్వకుండానే ప్రసంగం ముగించారు పవన్. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడిన రోజే పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు

జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారనే ఆసక్తి అందర్లో ఉండేది. అదే ఆసక్తి ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో కూడా ఉంది. ఎందుకంటే, ఈ వేదికపై నుంచైనా పవన్ తన సినిమాలపై క్లారిటీ ఇస్తారని వాళ్లు ఎదురుచూశారు.

ఎన్నో అంశాలపై మాట్లాడిన పవన్ కల్యాణ్, ఈ ఒక్క అంశాన్ని మాత్రం వదిలేశారు. తన సినిమాల ప్రస్తావన ఆయన తీసుకురాలేదు. పార్టీ కార్యక్రమంలో సినిమాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ తన ప్రసంగంలో పవన్ రాజకీయాలకు అతీతంగా చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి సినిమాల గురించి కూడా స్పందిస్తే బాగుండేదని.

పవన్ ను పొలిటికల్ గా ఎంతమంది ఇష్టపడినప్పటికీ.. ఆయన సినిమాలు చేస్తే చూడాలని ఆశపడే వాళ్లు చాలామంది ఉన్నారు. చంటి సినిమాలో మీనాలా తనను పెంచారని, తొలిప్రేమ హిట్టయిన తర్వాత కూడా కూడా ఇంటికి ఆలస్యంగా వస్తే నాన్న తిట్టారని చెప్పుకొచ్చారు పవన్.

దీంతో పవన్ లైన్లోకి వచ్చారని, అదే ఊపులో తన అప్ కమింగ్ సినిమాల గురించి మాట్లాడతారని చాలామంది ఎదురుచూశారు. కానీ తన ప్రసంగాన్ని అట్నుంచి ఇంకెటో తీసుకెళ్లిపోయారు. నిజానికి ఆది నుంచి పవన్ ప్రసంగం అలానే సాగింది. ఏదో మొదలుపెట్టి, ఇంకేదో మాట్లాడి, మరెక్కడో ముగించారు.

అలా తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇవ్వకుండానే ప్రసంగం ముగించారు పవన్. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడిన రోజే పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు. కానీ తన సినిమాల గురించి ఆయన ప్రస్తావించలేదు.

14 Replies to “ఆ ఒక్కటి వదిలేసిన పవన్ కల్యాణ్”

  1. బడి పిల్లలకు సంచు(bag)లు పంచే కార్యక్రమానికి వచ్చి, పెద్దవాళ్ళ రాజకీయాలగురంచి

      1. That is their interest. It doesn’t need to speak. Where ever they like they can share their info. But as fans we done need to expect too much. They are some limts

  2. Kodiguddu meeda eekalu peeke rakam…

    460 jana sainikula tyagala gurtuga…movies gurinchi matladoddani munde chepparu kada gorre… vinapada nattu natisthunnava

  3. పేటీఎం గ్రేట్ ఆంధ్ర నీకు ఏదో ఒకటి నెగటివ్ న్యూస్ మెగా ఫ్యామిలీ మీద వెతికి బ్యానర్ పెట్టి శునకానందం చెందటం తప్ప మీ పేటీఎం బ్యాచ్కు ఇంకోటి ఏమీ లేదు హిందూ ధర్మము గురించి సనాతన ధర్మం గురించి హిందువుగా పవన్ కళ్యాణ్ కు ఉన్నంత గట్స్ రాజకీయ నాయకునికి లేవు జై పవన్ కళ్యాణ్ జై సనాతన ధర్మ

Comments are closed.