ఆ కమెడియన్ తో కామెడీ కాదు సుమా!

ప్రతి రాత్రి బెట్టింగ్ లు ఆడడం ఎంతో కొంత సంపాదించడం, పోగొట్టడం అలవాటు అని తెలుస్తోంది.

ఆయనో పరభాష కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. కేవలం నటుడు మాత్రమే కాదు. నిర్మాతల కష్టాలు ఎలా వుంటాయో తెలిసిన నటుడు. కానీ ఇప్పుడు మాత్రం నిర్మాతలకు కాస్త నరకం అంటే ఎలా వుంటుందో చూపించేస్తున్నాడని తెలుస్తోంది.

కాస్త వైవిధ్యంగా వుంటుంది సినిమాకు అని నిర్మాతలు వెంట పడుతున్నారు. రోజుకు మూడున్నర లక్షలు ఇస్తేనే చేస్తాను అంటున్నారట. కాస్త పెద్ద పాత్ర అయినా టోకున కాకుండా మూడున్నర లక్షల లెక్కన లెక్క పెట్టి ఇవ్వాల్సిందే. మరీ ఎక్కువ రోజులు అంటే అప్పుడు కాస్త ఆలోచించి, కాస్త కన్సెషన్ ఇస్తారట.

అయితే ముందుగా పదిహేను లక్షలు బ్లాక్ లో ఇవ్వాల్సిందే. బ్లాక్ మనీ దొరకడం లేదు అన్నా ఒప్పుకోరట. అక్కడతో అయిపోలేదు కష్టాలు. రోజు సాయంత్రం పర్టిక్యులర్ టైమ్ అవగానే వదిలేయాల్సిందే. ఇక రాత్రయితే సదరు కమెడియన్ పర్సనల్ లైఫ్ చిత్రంగా వుంటుందని తెలుస్తోంది. మందు కొట్టడం మామూలే. అదేమీ వింతా కాదు, విడ్డూరమూ కాదు. కానీ బెట్టింగ్ అన్నది ఆ కమెడియన్ వీక్ నెస్ అని తెలుస్తోంది. ప్రతి రాత్రి బెట్టింగ్ లు ఆడడం ఎంతో కొంత సంపాదించడం, పోగొట్టడం అలవాటు అని తెలుస్తోంది.

పొరపాటున ముందుగా అనుకున్న రోజు కాకుండా వేరే రోజు కాల్ షీట్ అడిగితే, వేరే షూట్ వుందని, అది క్యాన్సిల్ చేసుకోవాలి కనుక, ఆ ఖర్చులు అన్నీ ఇస్తేనే వస్తానని చెప్పడం కామన్ అని, అవసరం తప్పదు కనుక ఇవ్వాల్సిందే అని ఓ నిర్మాత చెప్పారు. అవసరం మన వాళ్లది కనుక తప్పది భరించాల్సిందే.

10 Replies to “ఆ కమెడియన్ తో కామెడీ కాదు సుమా!”

  1. త్వరలో మనం ఒకప్పుడు బాగా బతికిన కమెడియన్ ఇప్పుడు పూట గడవడం కష్టం గా అని యూట్యూబ్లో చూస్తాం బెట్టింగ్ లు పేకాట లలో సంపాదించిన వాడిని ఇంతకు ముందు చూడలేదు ఇకముందు కూడా చూడలేము 

  2. సంక్రాంతి కి వస్తున్నాం సినిమా లో నరేష్ పక్కన పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఉంటాడు, ఆయన అయి ఉంటాడు.

  3. సిద్ధార్థ్ గాడి గతి ఏమైందో అందరికీ తెలుసు…అరవ సోది గాళ్లను తెచ్చి చేయించు కోవాల్సిన అవసరం.లేదు

Comments are closed.