ఏనాటి నుంచో అరువు రేపు అని గోడ మీద రాసుకున్నట్లు, అదిగో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మాట వినిపిస్తూనే వుంది. కానీ కదలడం కనిపించడం లేదు. పవన్ ఎప్పుడు వస్తారో తెలియదు. సినిమాకు అప్పట్లో జన్ట్ ఓ నాలుగైదు రోజులు షూట్ చేసారు. ఆ షూట్ కే థియేటర్ లో గ్లింప్స్ విడుదల చేసి హడావుడి చేసారు. ఇది జనసేన ప్రచారానికి పనికి వచ్చింది తప్ప మరేమీ లేదు. అక్కడ నుంచి మరి ముందుకు కదలలేదు.
ఇప్పుడు వినవస్తున్న వార్త ఏమిటంటే, ఈ సినిమా ఎప్పటికీ ముందుకు కదలకపోవడంతో, సినిమా ఓటిటి హక్కులు తీసుకుంటామని అప్పట్లో మాట ఇచ్చిన అమెజాన్ సంస్థ ఇప్పుడు వెనక్క వెళ్ళిపోయిందని తెలుస్తోంది. ఇన్ టైమ్ లో సినిమా రాకపోవడంతో మాట వెనక్కు తీసుకునే అవకాశం అమెజాన్ కు వచ్చింది.
పవర్ స్టార్ ఇటు హరి హర, అటు ఓజి సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. వాటి తరువాత ఉస్తాద్ సినిమా.ఈ లెక్కన ఎప్పటికి అవుతుందో తెలియదు. నిర్మాతలు మైత్రీ మూవీస్ కు ఓపిక వుండొచ్చు. కానీ అమెజాన్ కు వుండాలని లేదు కదా?
షూటింగ్ పూర్తి కానీ సినిమాకి ott డీల్ వెనక్కు వెళితే ఏమిటి నష్టం….షూటింగ్ అయ్యాక ఐపీల్ ఆక్షన్ మళ్ళీ అందరూ పోటీ పడతారు…. పెర్మనెంట్ గా ద్వారాలు ఏమి మూసేయాలా, ప్రోడక్ట్ చూసి వద్దు అనలేదు, అమెజాన్ వాళ్ళు….
బాబు ga గారు అదేదో పెద్ద ఉపద్రవం లాగా చెప్తున్నావ్ సినిమా పూర్తి ఐతే వాళ్లే ఎగేసుకొని వస్తారు అప్పటిదాకా షుగర్ ఆపుకో