జ‌గ‌న్‌కు అడుగు దూరంలో లిక్క‌ర్ కేసు

జ‌గ‌న్ పేరు లిక్క‌ర్ కేసులో ప్ర‌ముఖంగా వినిపించ‌డం. రానున్న రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని వంక‌ర్లు తిరుగుతుందో చూద్దాం.

వైసీపీ హ‌యాంలో మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌ని కూట‌మి గ‌ట్టిగా చెబుతోంది. మ‌ద్యం వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం దోపిడీకి పాల్ప‌డ్డార‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ విశ్వ‌సిస్తోంది. దోపిడీదారులెవ‌రో తేలుస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా మ‌ద్యం స్కామ్ నిగ్గు తేల్చేందుకు ప్ర‌భుత్వం సిట్ వేసింది.

ఇప్ప‌టికే న‌లుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ప‌దుల సంఖ్య‌లో నిందితులుగా గుర్తించారు. ఈ క్ర‌మంలో ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు దాఖ‌లు చేసిన మెమోలో మ‌రో ముగ్గురిని కొత్త‌గా నిందితులుగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఆ ముగ్గురూ వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత ద‌గ్గ‌రివాళ్లు కావ‌డం గ‌మ‌నార్హం.

లిక్క‌ర్ కేసులో ఏ31గా ధ‌నుంజ‌య‌రెడ్డి, ఏ32గా కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, ఏ33గా గోవింద‌ప్ప‌ బాలాజీని నిందితులుగా చేర్చారు. ఈ ముగ్గురు ఇప్ప‌టికే త‌మ‌ను అరెస్ట్ చేస్తార‌నే ఆందోళ‌న‌తో న్యాయ పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ దొర‌క్క‌పోవ‌డంతో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అయితే హైకోర్టులో ఈ నెల 7న విచార‌ణ‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో, అక్క‌డ ఏం చెబుతారో చూసిన త‌ర్వాతే విచారిస్తామ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

ఒక‌వైపు న్యాయ పోరాటం సాగిస్తుండ‌గానే, మ‌రోవైపు తాజాగా వాళ్ల‌ను నిందితులుగా చేర్చ‌డం కీల‌క ప‌రిణామంగా చెప్పొచ్చు. దాదాపు కేసు కొలిక్కి వ‌చ్చిన‌ట్టే అని ప్ర‌భుత్వ పెద్ద‌లు అంటున్నారు. ఇక ప్ర‌ధాన టార్గెట్ వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు చేయ‌డం ఒక్క‌టే మిగిలింది. ఎందుకంటే, సిట్ ద‌ర్యాప్తులో ప‌లువురి నుంచి సేక‌రించిన స‌మాచారం ఆధారంగానే కొత్త‌గా ముగ్గుర్ని నిందితులుగా చేర్చిన‌ట్టు సిట్ అధికారులు తెలిపారు.

ఇక ఈ ముగ్గుర్ని కూడా విచారించాక‌, వైఎస్ జ‌గ‌న్‌ను నిందితుల జాబితాలో చేర్చే అవ‌కాశం వుంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎందుకంటే సిట్ విచార‌ణ‌లో అంతిమ ల‌బ్ధిదారు జ‌గ‌నే అని చెప్పారంటూ నిత్యం క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్నారు. అందుకే జ‌గ‌న్ పేరు లిక్క‌ర్ కేసులో ప్ర‌ముఖంగా వినిపించ‌డం. రానున్న రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని వంక‌ర్లు తిరుగుతుందో చూద్దాం.

24 Replies to “జ‌గ‌న్‌కు అడుగు దూరంలో లిక్క‌ర్ కేసు”

  1. లెవెన్ అన్నాయ్, మనం ఎప్పుడో మధ్యనిషేధం చేసాం క0దా??. దానికి నిన్ను మెచ్చుకోవాల్సింది పోయి, శాలువా కప్పి సన్మానించాల్సింది పోయి , అవార్డు గివార్డ్ ఇవ్వాల్సింది పోయి, ఇదేందయ్యా ఇది.

    లిక్కర్ స్కాం అంటున్నారు?? 

    .

    అరెస్ట్ చేస్తాం అంటున్నారు. .. 

  2. అయితె ఇక అన్న పార్టి మూసుకొవటమెనా?

    అయినా అన్నకి అంత డబ్బు పిచ్చి ఉంటె ఎలా?

    1. 27k schools developed, 15k hospitals developed, 17 govt medical colleges, solar power agrement al r his developments only, unlike stayed in hyderabad like lokesh n NCB up to 2022

  3. మాడామోహన గాణ్ణి “ఎర్రి బాగులోన్ని చేసి, కేవలం ఉత్త్తుత్తి బటన్లు నొక్కే ఎవ్వారానికే పరిమితం చేసి.. వాడికి తెలియకుండా, కేతిగాళ్ళు, జుట్టు పోలిగాళ్ళు, జోకర్లు అందరూ కల్సి పార్టీని అన్నీ విధాలా మింగినారు కదరా.. చివరికి ఆడి హారతి సిమెంట్ ని కూడా వదల్లేదు కదరా.. మీయమ్మ కడుపులు మాడా 

  4. ఈ రోజు ఓబుళాపురం మైనింగ్ కేసులో మహామేత పరిపాలన అంతా అవినీతిమయం అని రుజువు అయింది. ఆ వార్త ఏది GA?

  5. బాలాజీ గోవిందప్ప  సాక్షి డైరెక్టర్ అంటే….సాక్షి కూడా అంతిమ లబ్ది “దారు” నే..ఇంకో అడుగు దూరం లో సాక్షి చైర్మన్ కి కూడా నా???

  6. ఇదొక time pass case. నిజమైన అవినీతి ఏదైనా ఉంటే కూటమి పాలనలో liquor సిండికేట్ గా మారి shops తమ వారికి వచ్చేటట్టు చేసుకొన్నారు కోట్లు చేతులు మారాయి belt shops mafia నడుస్తుంది. పచ్చమీడియా పాతాక శీర్షిక లు పెట్టి రాసాయి గమనించగలరు

  7. .TDP party is meant for protecting properties and fostering growth of one section of people. CBN did more quid pro co then  YS jagan. CBN sent jagan to jail and Jagan sent CBN to jail. This time jagan if sentenced to bars he may take action that TDP never imagined. It will lead to massacre once he come back to power.

  8. Even after one lakh crore of allegations….. he got into power….Rural AP is waiting to see him again to get the benefits

  9. కేసు వంకర్లు తిరుగుతుందా.. చేతి వంకర, నోటి వంకర గాళ్ళు రాసే రాతలు మాత్రమే ఇలా ఉంటాయి.. ఇంకా అన్నని సపోర్ట్ చేస్తున్నావంటే అశుద్ధం తిని బతకాల్సి వస్తుంది.. అవినీతి పరులను, నేరస్తులను వెనకేసుకు రావడం ఇకనైనా మానుకోండి సార్ .. కుటుంబం మొత్తం తినే తిండి మంచిదై ఉండాలి

Comments are closed.