ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలో ఉంది. కానీ కాకినాడ జిల్లా పిఠాపురంలో మినహాయిస్తే, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో జనసేన ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులకు టీడీపీ వ్యూహాత్మకంగా చెక్ పెట్టింది. దీంతో తాము అధికారంలో ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీగా ట్రీట్ చేస్తున్నారని జనసేన నేతలు వాపోతున్నారు. ఇందుకు పిఠాపురం మినహా, ఏ అసెంబ్లీ నియోజకవర్గం మినహాయింపు కాదనే చర్చకు తెరలేచింది.
జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీ నాయకులే పెత్తనం చెలాయిస్తున్నారు. ఇదంతా పైస్థాయి నుంచి ఆదేశాలు రావడంతోనే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. తన వెంట ఉంటూనే, తన చావు కోసం ఎదురు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను చనిపోతే, ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు ఎమ్మెల్యే కావచ్చని కొందరు కోరుకుంటున్నారని పరోక్షంగా టీడీపీ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. అలాగే పైన అధికారం తమదని, తాము చెప్పిన వాళ్లకే పనులు చేయాలని, లేదంటే ఉద్యోగాలు వుండవని హెచ్చరిస్తున్నారంటూ బొలిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా టీడీపీ నాయకుల గురించే బొలిశెట్టి ఆవేదన అని అందరికీ తెలుసు.
సీనియర్ నాయకుడైన బొలిశెట్టి పరిస్థితే ఇలా వుంటే, ఇక జూనియర్లు, అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులున్న చోట జనసేన శ్రేణుల పరిస్థితి ఎంత దయనీయంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెనాలిలో కూడా టీడీపీ, జనసేన మధ్య పెద్ద ఫైట్ జరుగుతోంది. తెనాలి నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ టీడీపీ కార్యకర్తలపై కేసులు కూడా పెట్టించినట్టు సమాచారం.
జనసేన నాయకులు గట్టిగా నిలబడిన చోట రెండు పార్టీల మధ్య వార్ జరుగుతోంది. లేదంటే బాధను దిగమింగుకుని గడపాల్ని వస్తోందని జనసేన నేతలు వాపోతున్నారు. జనసేన ఎమ్మెల్యేలున్న చోట కూడా, వాళ్లు చెప్పిందల్లా చేయాల్సిన పనిలేదని అధికారులకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. అందుకే జనసేన ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారుతున్నామనే ఆవేదనలో ఉన్నారు. ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనే చర్చ లేకపోలేదు.
టీడీపీ-జనసేన జగన్ 5 ఏళ్ళు పైశాచికంగా ప్రవర్తించడం వల్ల కలిసిన బంధం…. ఇప్పుడు అప్పుడే విడిపోరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా….టీడీపీ జనసేన కి చెక్ పెడితే, బీజేపీ ద్వారా పవన్ టీడీపీ కి తిరిగి చెక్ పెట్టగలడు… అక్కడ ఎవ్వరూ డమ్మీలు లేరు, తల వంచుకుని కూర్చోలేదు….రోజా నెల్లూరు అనిల్, దువ్వాడ శ్రీనివాస్ అలాగే విజయ సాయి గారు, బాలినేని గారు, లావు కృష్ణ దేవరాయలు ఇలా ఎందరో వైకాపాలో లో సొంత పార్టీలోనే శత్రువులు ఉండేవారు అని చెప్పారు పబ్లిక్ గా…. టీడీపీ జనసేన వేరు వేరు పార్టీలు ఆ మాత్రం ఉంటాయి గొడవలు అన్ని నియోజిక వర్గాల్లో…. అది మామూలే…. అధినాయకులు కలిసి ఉన్నంత వరకు ఏమి మారవు
Yemmo Sir cbn ni namalemu vadu okka nakkaa putakaaa
అంతకుముందు వాళ్ళు కూడా పైశాచికం చూపించారు గా…అప్పుడు మళ్ళా వీళ్ళు ర్రేపు మల్ల వాళ్ళు…బాగుంది…
పాపం ఎన్ని తంటాలు పడుతున్నావో? వాళ్ల మధ్య చిచ్చు రేపడానికి . సాక్షి, గ్రేట్ ఆంధ్ర, అబాసపాలు అయిపోయారు. అయిపోయింది రా బాబు జగన్ పని ఇంకా నువ్వు జగన్ డబ్బా కొట్టకు
Babuuu bolli politics avanni ardham kavalante inkko 5 years paduthundhi