పాక్‌పై భార‌త్ దాడికి కౌంట్‌డౌన్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

ర‌ష్యా విక్ట‌రీ డే త‌ర్వాత పాక్‌పై భార‌త్ దాడి చేయొచ్చ‌ని ఆయ‌న ఎందుకంత న‌మ్మ‌కంగా చెప్పారో తెలియాల్సి వుంది.

క‌శ్మీర్‌లో ప‌ర్యాట‌కుల‌ను ఉగ్ర‌వాదులు పొట్ట‌న పెట్టుకోవ‌డంపై భార‌త్ తీవ్ర ఆగ్ర‌హంగా వుంది. ఉగ్ర‌వాదుల్ని పాక్ ప్రోత్స‌హిస్తుండ‌డంపై మ‌న దేశం ర‌గిలిపోతోంది. దీంతో ఆ దేశానికి త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌నే ఆలోచ‌న‌లో భార‌త్ వుంది. పాక్‌పై భార‌త్ దాడి చేయాల‌ని మెజార్టీ దేశ ప్ర‌జానీకం కోరుకుంటోంది. ఒక‌వేళ యుద్ధం వ‌స్తే, ఎలాంటి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే విష‌య‌మై మంగ‌ళ‌వారం నుంచి దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ చేప‌ట్ట‌నున్నారు.

మ‌రోవైపు భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దుల్లో సైనికుల మ‌ధ్య కాల్పులు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. మ‌రోవైపు జ‌మ్ము క‌శ్మీర్‌లో యుద్ధ‌వాతావ‌ర‌ణం నెల‌కుంది. ఈ ప‌రిస్థితుల్లో పాక్ మాజీ హైక‌మిష‌న‌ర్ అబ్దుల్ బాసిత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పాక్‌పై భార‌త్ దాడి చేయ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఈ నెల 10, 11 తేదీల్లో పాక్‌పై భార‌త్ సైన్యం దాడి చేసే అవ‌కాశం వుంద‌ని అబ్దుల్ బాసిత్ చేసిన ప్ర‌క‌ట‌న ఇరు దేశాల్లో యుద్ధ వాతావ‌ర‌ణాన్ని మ‌రింత పెంచింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ర‌ష్యా విక్ట‌రీ డే త‌ర్వాత పాక్‌పై భార‌త్ దాడి చేయొచ్చ‌ని ఆయ‌న ఎందుకంత న‌మ్మ‌కంగా చెప్పారో తెలియాల్సి వుంది.

ఇదే సంద‌ర్భంలో కేంద్ర హొమ్‌, ర‌క్ష‌ణ శాఖ‌ల ఉన్న‌తాధికారులు త్రివిధ ద‌ళాల‌తో కీల‌క స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. అందుకే ఏ క్ష‌ణ‌మైనా ఏమైనా జ‌ర‌గొచ్చ‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. పాక్ మాజీ హైక‌మిష‌న‌ర్ చెప్పిన ప్ర‌కారమైతే పాక్‌పై దాడికి కౌంట్‌డౌన్ మొద‌లైన‌ట్టే అని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

6 Replies to “పాక్‌పై భార‌త్ దాడికి కౌంట్‌డౌన్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!”

  1. అంతకంటే ముందే మనం ఇజ్రాయిల్ సహాయంతో ఐరన్‌ డోమ్‌ నిర్మాణం చేసుకోవాలి 

Comments are closed.