అనుమానాలు నిజం చేస్తున్నావా బన్నీ?

ముంబయిలోని అమీర్ ఖాన్ నివాసానికి వెళ్లాడు బన్నీ. ఇంత సడెన్ గా వీళ్లిద్దరూ ఎందుకు కలిశారనేది చర్చనీయాంశంగా మారింది.

బన్నీ-అట్లీ సినిమా ప్రకటించిన వెంటనే చాలా పుకార్లు తెరపైకొచ్చాయి. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోందని, బాలీవుడ్ కు చెందిన ఓ పాపులర్ నటుడు కూడా కీలక పాత్రలో కనిపిస్తాడంటూ ప్రచారాలు మొదలయ్యాయి.

వీటిలో ఓ పుకారుపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. బన్నీ సినిమాలో తను నటించడం లేదని సమంత పరోక్షంగా వెల్లడించింది. కుదిరితే భవిష్యత్తులో అట్లీ దర్శకత్వంలో నటిస్తానని కూడా ఆమె ప్రకటించింది.

ఇక మిగిలిన మరో పుకారు ఇంకా లైవ్ లోనే ఉంది. బన్నీ-అట్లీ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ కు చెందిన పెద్ద నటుడు నటించబోతున్నాడనే ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ నేరుగా వెళ్లి అమీర్ ఖాన్ ను కలవడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్టయింది.

ముంబయిలోని అమీర్ ఖాన్ నివాసానికి వెళ్లాడు బన్నీ. ఇంత సడెన్ గా వీళ్లిద్దరూ ఎందుకు కలిశారనేది చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ లో బన్నీ ఇప్పుడు హాట్ టాపిక్. షారూక్ లాంటి నటుడు కూడా పుష్ప-2 సక్సెస్ ను, బన్నీ క్రేజ్ ను ఓపెన్ గా చర్చించాడు. కాబట్టి అమీర్-బన్నీ మీటింగ్ స్నేహపూర్వకంగా జరిగి ఉండొచ్చు. మరికొంతమంది మాత్రం బన్నీ ఊరికే అలా వెళ్లి ఎవ్వర్నీ కలవడని, కచ్చితంగా తన కొత్త సినిమా కోసమే అయి ఉంటుందని చర్చించుకుంటున్నారు

2 Replies to “అనుమానాలు నిజం చేస్తున్నావా బన్నీ?”

Comments are closed.