గడిచిన మూడేళ్లు గా రీతు వర్మ మంచి లైనప్ సెట్ చేసుకుంది. కానీ ఆమెను దురదృష్టం వెంటాడుతోంది. ఈ మధ్య కాలంలో సాలిడ్ హిట్ కొట్టలేకపోయింది. దీంతో ఇప్పుడు ఓటీటీ పై ఆమె ఫోకస్ షిఫ్ట్ చేసింది.
ఓటీటీలో దేవిక అండ్ డానీ అనే సిరీస్ చేసింది రీతు వర్మ. తెరపై పద్ధతిగా కనిపించే హీరోయిన్లు, ఓటీటీకి వచ్చేసరికి బోల్డ్ గా మారిపోతుంటారు. ఆ మధ్య తమన్నా ఎంత రెచ్చిపోయిందో అందరం చూశాం.
అయితే రీతు వర్మ మాత్రం అలాంటి బోల్డ్ అంశాల జోలికి వెళ్లలేదు. వెండితెరపై ఎలాగైతే మంచి పాత్రలు ఎంచుకుందో, ఓటీటీకి కూడా అదే పంథా ఫాలో అవుతోంది. దేవిక అండ్ డానీ సిరీస్ లో దేవిక అనే మ్యూజిక్ టీజర్ రోల్ పోషించింది రీతు.
శివ కందుకూరి కీలక పాత్ర పోషించిన ఈ సిరీస్ లో సుబ్బరాజు, కోవై సరళ లాంటి సీనియర్లు కూడా నటించారు. త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ సిరీస్ తో మరోసారి సక్సెస్ ట్రాక్ పైకి రావాలనుకుంటోంది. సుధాకర్ చాగంటి నిర్మాణంలో బి.కిషోర్ తెరకెక్కించిన ఈ సిరీస్ కు అన్నీతానై ప్రచారం చేయబోతోంది రీతు వర్మ.