నిజంగా ‘సర్ ప్రైజ్’ అయ్యానంటున్న హీరోయిన్

రాబిన్ హుడ్ సినిమాలో తను చేసిన ‘అదిదా సర్ ప్రైజు’ సాంగ్ వివాదాస్పదమవ్వడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెబుతోంది.

తొలిసారి ఐటెమ్ సాంగ్ చేసింది. అది కాస్తా వివాదాస్పదమైంది. ఎట్టకేలకు తన వివాదాస్పద ఐటెమ్ సాంగ్ పై స్పందించింది కేతిక శర్మ. రాబిన్ హుడ్ సినిమాలో తను చేసిన ‘అదిదా సర్ ప్రైజు’ సాంగ్ వివాదాస్పదమవ్వడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెబుతోంది.

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల రియాక్ట్ అయినట్టే కేతిక కూడా స్పందించింది. షూట్ చేస్తున్నప్పుడు అదంత వివాదాస్పదమౌతుందని అస్సలు ఊహించలేదంటోంది కేతిక.

“ఆ పాట చూసిన ప్రేక్షకులు అసౌకర్యానికి గురయ్యారని తెలిసి చింతిస్తున్నాను. కెరీర్ లో నాకు ఇదొక అనుభవం. ఆ అనుభవాల పాఠాల నుంచే ఎదుగుతాను. ఎంచుకుంటే కంటెట్ పై ప్రస్తుతం మరింత దృష్టి పెట్టాను.”

ఇలా ‘అదిదా సర్ ప్రైజ్’ పాటపై స్పందించింది. ఓ డాన్సర్ గా కంటే నటిగా నిరూపించుకోవాలని ఉందంట కేతిక శర్మకి. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక చేస్తున్న పాత్రతో పాటు.. సాయిపల్లవి, కీర్తిసురేష్ చేస్తున్నలాంటి పాత్రలు చేయాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

One Reply to “నిజంగా ‘సర్ ప్రైజ్’ అయ్యానంటున్న హీరోయిన్”

Comments are closed.