మరోసారి విజయ్-రష్మిక

విజయ్ దేవరకొండ-రష్మిక కాంబినేషన్ అన్నది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. చాలా కాలంగా ఆ ఇద్దరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

విజయ్ దేవరకొండ-రష్మిక కాంబినేషన్ అన్నది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. చాలా కాలంగా ఆ ఇద్దరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఎందుకో అలా అలా వెనక్కు జరుగుతోంది. ఇప్పటికీ గీత గోవిందం క్లిప్స్ చూస్తుంటే క్రేజీగా వుంటాయి. మళ్లీ ఎప్పుడు ఆ జోడీ తెర మీద కనిపిస్తుంది అని అనిపిస్తూ వుంటుంది. ఇప్పుడు ఆ రోజు రాబోతున్నట్లు తెలుస్తోంది.

టాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన రాహుల్ సాంకృత్యాయన్ మళ్లీ మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. మైత్రీ మూవీస్ నిర్మాత.

ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు విజయ్. ఒకటి కింగ్ డమ్. రెండోది దిల్ రాజు ప్రొడక్షన్. ఈ రెండింటి తరువాత చేయబోయేది మైత్రీ సినిమానే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఫిక్స్ అన్నది విశ్వసనీయ వర్గాల బోగట్టా.

ఇది చాలా భారీ, వైవిధ్యమైన సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా నే కింగ్ డమ్ తరువాత స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు సమాంతరంగా దిల్ రాజు ప్రాజెక్ట్ కూడా వుంటుంది. పరుశురామ్-గీతా కాంబినేషన్ అంటూ ఆ మధ్య గాలి వార్తలు వచ్చాయి కానీ అవేమీ నిజం కాదు.

2 Replies to “మరోసారి విజయ్-రష్మిక”

Comments are closed.