పూరి-ఛార్మి విడిపోతున్నారా?

పూర్తిగా కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వంపై మాత్రమే దృష్టి పెట్టబోతున్నాడని, ఇతర అంశాలేవీ పట్టించుకోడంటూ కూడా కొందరు చెప్పుకొచ్చారు.

తెరవెనక అసలేం జరుగుతోంది? పూరి జగన్నాధ్, చార్మి విడిపోవడం ఏంటి? విడదీయలేని బంధం కదా వీళ్లది. పూరి జగన్నాధ్ ఓ సినిమా తీశాడంటే దానికి నిర్మాతగా చార్మి ఉండాల్సిందే. మరి ఇప్పుడేంటి కొత్తగా ఈ గాసిప్స్?

పూరి జగన్నాధ్ కొత్తగా సినిమాలేం ప్రకటించలేదు. అయితే ఆయన ఎవరితో సినిమా చేసినా, దానికి నిర్మాతగా లేదా కనీసం సహ-నిర్మాతగా చార్మి ఉండడమనేది కామన్. పూరి తదుపరి చిత్రానికి మాత్రం ఆమె భాగస్వామిగా ఉండదంటున్నారు చాలామంది.

రీసెంట్ గా పూరి జగన్నాధ్ పై కొన్ని కథనాలు, స్టేట్ మెంట్స్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి కూడా. అతడు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీగా ఉన్నాడని, చేతిలో 3-4 కథలు పెట్టుకున్నాడని అంటున్నారు. ఈసారి పూరి, పూర్తిగా కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వంపై మాత్రమే దృష్టి పెట్టబోతున్నాడని, ఇతర అంశాలేవీ పట్టించుకోడంటూ కూడా కొందరు చెప్పుకొచ్చారు.

అంటే దానర్థం, పూరి-ఛార్మి బంధం వీగిపోయినట్టేనని భావిస్తున్నారు చాలామంది. అయితే ఇలా అనుకొని అలా కటీఫ్ చెప్పుకునే బాండింగ్ కాదిది. తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. లైగర్ బాకీలు ఇంకా గాల్లోనే ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించి కూడా పూరి-ఛార్మి మధ్య తేలాల్సిన డబ్బు పంచాయితీ ఏదో ఉందని సమాచారం.

3 Replies to “పూరి-ఛార్మి విడిపోతున్నారా?”

Comments are closed.