ప్రెగ్నెన్సీ పుకార్లు.. ఇంకా టైమ్ ఉందన్న నటి

ఈమధ్య ఒకేసారి ఇద్దరు హీరోయిన్లపై ప్రెగ్నెన్సీ రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లలో ఒకరు లావణ్య త్రిపాఠి కాగా, రెండో హీరోయిన్ శోభిత ధూళిపాల. ఇద్దర్లో లావణ్య త్రిపాఠి తను గర్భం దాల్చిన విషయాన్ని…

ఈమధ్య ఒకేసారి ఇద్దరు హీరోయిన్లపై ప్రెగ్నెన్సీ రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లలో ఒకరు లావణ్య త్రిపాఠి కాగా, రెండో హీరోయిన్ శోభిత ధూళిపాల. ఇద్దర్లో లావణ్య త్రిపాఠి తను గర్భం దాల్చిన విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు శోభిత కూడా క్లారిటీ ఇచ్చింది.

తన ప్రెగ్నెన్సీపై వస్తున్న పుకార్లను శోభిత ఖండించింది. ఈ మేరకు ఆమె టీమ్ ప్రకటనిచ్చింది. శోభిత తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోందని, ఇంకా మాతృత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె టీమ్ స్పష్టం చేసింది.

కొన్ని నెలల కిందటే పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య-శోభిత. అంతలోనే ఆమె గర్భం దాల్చినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. దీనికి కారణం శోభిత చీరకట్టు. వేవ్స్ సమ్మిట్ కు భర్త నాగచైతన్యతో కలిసి హాజరైన శోభిత, తన గర్భాన్ని కవర్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించిందంటోంది బాలీవుడ్ మీడియా.

దీంతో ఆమె ప్రెగ్నెంట్ అయి ఉంటుందంటూ స్టోరీలు రాసింది. కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఈ ఊహాగానాల్ని ఇటు నాగచైతన్య, అటు శోభిత ఎవ్వరూ ఖండించకపోవడంతో చాలామంది అది నిజం అనుకున్నారు. తాజాగా వచ్చిన స్టేట్ మెంట్ తో శోభితపై ఇన్నాళ్లూ వచ్చిన పుకార్లు ఆగిపోయాయి.

2 Replies to “ప్రెగ్నెన్సీ పుకార్లు.. ఇంకా టైమ్ ఉందన్న నటి”

Comments are closed.