ప్లానింగ్ అంటే ఇదేనా నిధి..?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కుతున్న జాట్ సినిమాలో ఆమె ఐటెంసాంగ్ చేయబోతోందంట

చాన్నాళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తోంది. అదృష్టమో, కాకతాళీయమో కానీ పవన్ కల్యాణ్ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్. ఇలా 2 పెద్ద సినిమాల్లో నటిస్తున్న ఏకైక హీరోయిన్ నిధి మాత్రమే.

ఆమె కూడా ఈ 2 సినిమాలపై చాలా హోప్స్ పెట్టుకుంది. అవి తన కెరీర్ ను మలుపుతిప్పుతాయని భావిస్తోంది. అందుకే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు మరో ప్రాజెక్టు అంగీకరించడం లేదు. క్రేజ్ వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులతో పాటు, పెంచిన రెమ్యూనరేషన్ అందుకోవాలనేది ఆమె ఆలోచన.

అయితే ఉన్నఫలంగా నిధి అగర్వాల్ తన ఆలోచనను మార్చుకున్నట్టుంది. ఓవైపు చేతిలో 2 పెద్ద సినిమాలు పెట్టుకొని, మరోవైపు ఐటెంసాంగ్ చేయడానికి ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కుతున్న జాట్ సినిమాలో ఆమె ఐటెంసాంగ్ చేయబోతోందంట. ఇదే కనుక నిజమైతే ఆమెది రాంగ్ ప్లానింగ్ అనుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే, ఇన్నాళ్లూ వెయిట్ చేసి, సరిగ్గా హరిహర రిలీజ్ అయ్యే టైమ్ కు ఆమె ఐటెంసాంగ్ కు ఓకే చెప్పడం ఎలాంటి ప్లానింగో ఆమెకే తెలియాలి.

3 Replies to “ప్లానింగ్ అంటే ఇదేనా నిధి..?”

Comments are closed.