బన్నీ-అట్లీ మూవీ.. ఒక డౌట్ క్లియర్

ప్రస్తుతానికైతే అట్లీతో ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదని స్పష్టం చేసింది. సో.. బన్నీ-అట్లీ సినిమాలో సమంత లేనట్టే.

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఎనౌన్స్ చేసిన వెంటనే వినిపించిన మొదటి పేరు సమంత. ఈ ప్రాజెక్టులో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం గట్టిగా నడిచింది. దీనికి ఓ కారణం ఉంది.

అట్లీ దర్శకత్వంలో సమంత నటించింది. పైగా సమంత అంటే అట్లీకి ఇష్టం. ఇక సమంతాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. తన ఫేవరెట్ యాక్టర్ గా ఓ సందర్భంగా బన్నీ పేరు చెప్పింది సమంత.

ఇన్ని ఇష్టాలు కలిసిన తర్వాత కాంబినేషన్ సెట్ అవ్వడం పెద్ద కష్టం కాదు కాబట్టి “సమంత హీరోయిన్” అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చేసింది సామ్.

అట్లీ తనకు మంచి స్నేహితుడని భవిష్యత్తులో అతడి దర్శకత్వంలో కచ్చితంగా నటిస్తానని తెలిపిన సమంత.. ప్రస్తుతానికైతే అట్లీతో ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదని స్పష్టం చేసింది. సో.. బన్నీ-అట్లీ సినిమాలో సమంత లేనట్టే.

దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చ మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతానికైతే జాన్వి కపూర్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి.

3 Replies to “బన్నీ-అట్లీ మూవీ.. ఒక డౌట్ క్లియర్”

  1. ఇంటర్నేషనల్ హీరో పక్కన, ఇంకా ఈ కంపు సమంత హీరోయిన్ ఏంటీ?? 

    టాలీవుడ్/AA మార్కెట్, క్రేజ్ ఇంకా ఎలేవేట్ అయ్యేవిదంగా, హాలీవుడ్ హీరోయిన్ ని పెట్టుకోవాలి. అదీ మార్కెటింగ్ స్ట్రాటెజీ అంటే..

    వాడికిష్టం ఇది అంటే ఇష్టం, దీనికి వాడంటే ఇష్టం అని 4th హ్యాండ్ హీరోయిన్ ని పెట్టుకుని, మళ్ళీ పాతాళం లోకి జారిపోవాలి అని ఎవ్వరూ కోరుకోరు.. 

  2. Great andhra garu 2nd may nundi Eroju varaku అమరావతి pai గంటకి oka article rasaru ippudu konchem అమరావతి ki rest ichi gali janardan reddy case gurunchi ఆయనకు జగన్ గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి rayochuga 

Comments are closed.