గాలి జనార్దన్‌ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష!

ఓబుళాపురం మైనింగ్ కేసులో క‌ర్ణాట‌క మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జ‌నార్దన్ రెడ్డిని దోషిగా తేలుస్తూ నాంప‌ల్లి సీబీఐ కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

ఓబుళాపురం మైనింగ్ కేసులో క‌ర్ణాట‌క మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జ‌నార్దన్ రెడ్డిని దోషిగా తేలుస్తూ నాంప‌ల్లి సీబీఐ కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. గాలి జనార్ద‌న్‌రెడ్డితో పాటు మ‌రొ ముగ్గురిని దోషులుగా గుర్తిస్తూ ఏడేళ్ల శిక్ష విధించింది. ప్ర‌తి ఒక్క‌రికి ప‌ది వేల జ‌రిమానాతో పాటు ఓఎంసీ కంపెనీకి రూ. 1ల‌క్ష జ‌రిమానా విధించింది.

అనంత‌పురం జిల్లాలోని ఓబుళాపురం, మ‌ల్ప‌న‌గుడి గ్రామాల్లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్ర‌మంగా తవ్వ‌కాలు, ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉమ్మ‌డి ఏపీలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2009లో సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు వెంట‌నే రంగంలోకి దిగిన అధికారులు కీల‌క ఆధారాలు సేక‌రించారు. సూమారు 14 ఏళ్ల సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం నేడు కోర్టు తీర్పు వెల్ల‌డించింది.

బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గనుల సరిహద్దులను చెడగొట్టి అక్రమంగా తవ్వకాలు నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. గాలి జనార్ధన్ రెడ్డికి రెండో నిందితుడిగా (A2) తీర్పు వెలువడగా, అతని బావమరిది మరియు ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి (A1), మాజీ మైనింగ్ శాఖ అధికారి వి.డి. రాజగోపాల్ (A3), మైన్స్ & జియాలజీ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ మెహఫుజ్ అలీ ఖాన్ (A7)లు కూడా దోషులుగా తేలారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీబీఐ అధికారులు వారిని అరెస్ట్ చేశారు. కాగా ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ అధికారి బి. కృష్ణానందంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

2007 నుంచి 2009 మధ్య కాలంలో జరిగిన ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 884 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచి వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. వారి ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని ఈకేసులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కాగా, గాలి జనార్ధన్ రెడ్డి ప్ర‌స్తుతం కర్ణాటకలోని గంగావతి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) పార్టీని స్థాపించిన ఆయ‌న‌ 2024 మార్చి 25న తిరిగి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

29 Replies to “గాలి జనార్దన్‌ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష!”

    1. కర్ణాటక లో గాలి గాడిని.. ఆంధ్ర లో ధూళి గాడిని.. అన్నదమ్ములిద్దరిని కలిపి ఉతికేయాలని నిర్ణయించుకొన్నారేమో..

      వేడి వేడి గంజిలో ఉడకేసి.. బండకేసి ఉతికితే.. తెల్లటి తెలుసుపుతో వస్తారులే..

    2. వచ్చేదే, కానీ అన్న సింగిల్ సింహం, మోడీ గారి మెడలు వంచినాడు కదా, వాషింగ్ మిషన్ వేయలేక పోయారంట 

  1. ఏమి ఫామిలీ రాజా…పెద్ద కొడుకు (అప్పట్లో ఇలానే చెప్పుకున్నారు) , చిన్న కొడుకు ఇద్దరు చిప్ప కూడు తిన్నారు

  2. 2009 లో  కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ కి ఫిర్యాదు చేసిందా??? ఏంట్రా అందరూ నీ సైట్ చదివి నిజం అని నమ్మేస్తారు అనుకుంటున్నావా ఎట్లా??

  3. పుట్టు పూర్వోత్తరాలు టీవీ5 సాంబయ్య చెప్తున్నాడు లే..మహమే..@త నుండి పిల్ల మే..#త వరకు ఈ గాలి గాడి వ్యవహారం…

  4. మరి ఇందులో వాస్తవాలను చక్కగా పక్కకు తప్పించారు. ఇందులో. ఓబుళాపురం మైన్స్ ను ఆ నాటి ysr హయాం లో జరిగింది  సబిత ఇంద్ర రెడ్డి  గారు మంత్రి.  ఇలాంటి ముఖ్యమైన కేసులో   కేవలం అధికారులకే శిక్ష అన్యాయం ఇది పై నా ఉన్న. వాలు నీతి మంతులు

    1. Not only officers but also beneficiaries were convicted. In quid pro quo cases, Jagan was also a beneficiary. Janardhan Reddy received 7 years of imprisonment for a ₹840 crore fraud, whereas the charges against Jagan Reddy amount to ₹43,000 crore. How much jail time should he receive?

  5. ఈ రోజు ఓబుళాపురం మైనింగ్ కేసులో మహామేత పరిపాలన అంతా అవినీతిమయం అని రుజువు అయింది.

  6. లెవెన్ అన్న ఇక గెలిచేది చచ్చేది లేదు కానీ ఇప్పటికైనా లండన్ జంప్ అయితే

    జైలు తప్పించోకోవచ్చు.

  7. మొత్తానికి సబితా ఇంద్రారెడ్డి ని తెలంగాణ ముక్కోడు కేసీఆర్ , శ్రీ లక్ష్మి ని జగన్ రెడ్డి వ్యవహాత్మకంగా తప్పించారు ఇదెక్కడి తీర్పు ? వీళ్ళద్దరు మైనింగ్ కి అనుమతి ఇవ్వకుంటే అసలు ఈ దోపిడీ జరిగేది కాదు కానీ ఈ ఇద్దరినీ తప్పించారు

  8. అక్రమాస్తుల కేసుల్లో మన అన్నని అరెస్టు చేసినప్పుడే.. మైనింగ్ కేసుల్లో గాలి రెడ్డిని కూడా అరెస్టు చేశారు.. ఇన్నాళ్ళకి విజయవంతంగా గాలి అన్నకు 7 సంవత్సరాలు పడింది.. ఒక్క కేసుకే 7 పడితే ..మరి మన అన్న మీద ఉన్న కేసులకు మినిమం 11 పడతాదేమో 

  9. అక్రమాస్తుల కేసుల్లో జగన్ ను అరెస్టు చేసినప్పుడే.. ఓబుళాపురం కేసుల్లో గాలి జనార్ధన్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అత్యంత క్లిష్టమైన కేసును సీబీఐ నిరూపించింది. ఇప్పుడు అన్నీ కళ్ల ముందే జగన్ అక్రమాస్తుల కేసుల్ని నిరూపించడం పెద్ద విషయం కాకపోవచ్చు. ఆ కేసులో ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు చూస్తే.. జగన్ కానీ సహ నిందితులు కానీ బయటపడతారని ఎవరూ అనుకోరు. కానీ వివిధ రకాల పిటిషన్లు వేసి జగన్ అండ్ కో విచారణను ఆలస్యం చేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు .. హైకోర్టుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ కేసుల విచారణ ఊపందుకునే అవకాశం ఉంది.

  10. 884 కోట్ల నష్టంలో ఎంత రికవరీ చేసారు?  మొత్తం రికవరీ చెయ్యాలి కదా. లేకపోతె ఏడేళ్లు జైల్లో ఉంది, తర్వాత ఎంజాయ్ చేస్తాడు.

  11. next మాడా రెడ్డేనా అని ప్రజలు, నెటిజన్లు మాట్లాడుకుంటున్నారట ఎంకి!!

Comments are closed.