పోసాని కృష్ణమురళిని ప్రభుత్వం, పోలీసులు ఎలా ఆడుకుంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆకుదాకా వచ్చిన అన్నం నోటిదాకా అందకుండా పోయినట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఇప్పటికే నాలుగు కేసుల్లో అరెస్టు అయిన పోసానికి అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. ఇక ఇవాళ జైలు నుంచి విడుదల కాబోతున్నారనగా, బాపట్ల పోలీసులు మరో కొత్త కేసు నమోదు చేసి, ఆయన అరెస్టుకు వీలుగా పీటీ వారెంట్ కోసం కోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు. దీంతో విడుదల వాయిదా పడింది.
ఒకవేళ ఈ కేసులో కూడా బెయిల్ తెచ్చుకున్నప్పటికీ, మరో చోట కేసు నమోదు చేసి మళ్లీ పీటీ వారెంట్ మీద అరెస్టు చేయడానికి పోలీసులు ముందుగానే రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటారనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఒకసారి కక్ష కట్టిన తర్వాత, పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారిని ఎన్ని రకాలుగా వేధించగలరో ముందుగా పసిగట్టారు గనుకనే, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టు దాకా వెళ్లకుండానే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే తరహా చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదంలో పడ్డారు. ఆయన గతంలో “వ్యూహం” సినిమా విడుదల సమయంలో పెట్టిన సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లాలో కేసులు నమోదైన తర్వాత, ప్రస్తుతం పోసాని ఎదుర్కొంటున్న ఇక్కట్ల తరహాలో రాబోయే భవిష్యత్ పరిణామాలు అన్నింటినీ రామ్ గోపాల్ వర్మ ముందుగానే ఊహించారు. ఈలోగా మరికొన్ని కేసులు కూడా నమోదు అయ్యాయి. వర్మ ఏం జరుగుతుందో అంచనా వేశారు. పోలీసులకు అందుబాటులోకి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. ఈ లోగా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
అలాగే, తన మీద వివిధ ప్రాంతాల్లో నమోదు అవుతున్న అన్ని కేసులను ఒకే కేసుగా విచారణ పరిధిలోకి చేర్చేలా మరో కేసు కూడా హైకోర్టులో వేశారు. ఆ తర్వాత కోర్టు పురమాయింపు మేరకు విచారణకు హాజరయ్యారు. తదుపరి కఠిన చర్యలేమీ తీసుకోవద్దనే సూచన ఉన్నది గనుక, ఆయన అరెస్టు జరగలేదు. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు గనుకనే కాస్త సేఫ్ జోన్ లో ఉన్నారు.
పోసాని కృష్ణమురళి ఆ విషయంలో విఫలమయ్యారు. రెండో కేసు నమోదు కాగానే, తన మీద నమోదు అయ్యే అన్ని కేసులను ఒకే పరిధిలోకి చేర్చాలని, అవే కారణాలు, అవే పోస్టులకు సంబంధించి కొత్త కేసులు నమోదు కాకుండా చూడాలని ఆయన కోర్టును ఆశ్రయించి ఉండాల్సిన అవకాశం ఉంది. అయితే ఆ పని జరగలేదు. తత్ఫలితమే, ఇప్పుడు బాపట్ల కేసు! బెయిల్ దక్కినా కూడా, బయటకు రాకుండా చూడడం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Varma vadiki undi time nuvvu bada padoddu
ఎన్ని వోడ్కా పెగ్గులు వేసినా నిద్ర రాధమ్మ౧
Varma has BigBoss support. Posani became Aatalo Banana.
What YCP legal team is doing? Why didn’t they advise Posani?
Varma has Big-Boss Support. Posani became Aatalo banana
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
“పోసాని కృష్ణమురళిని ప్రభుత్వం, పోలీసులు ఎలా ఆడుకుంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు.”..yes, we also watched how they behaved…teach the lesson so that pichodi and his che ddi should never repeat what they did between 2019-24