పుష్ప మళ్లీ గెలిచాడు కానీ..!

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, పుష్ప-1, దువ్వాడ జగన్నాధమ్ లాంటి కొన్ని సినిమాలు 20+ టీఆర్పీలు తెచ్చుకున్నాయి.

టీవీల్లో పెద్ద సినిమాల రేటింగ్స్ మరీ తీసికట్టుగా తయారయ్యాయి. ఓటీటీ విజృంభన తర్వాత టీవీలకు రీచ్ తగ్గిపోయింది. దీనికి తగ్గట్టే సినిమాల టీఆర్పీలు కూడా ఉన్నాయి. థియేటర్లలో అరివీర భయంకరంగా ఆడిన సినిమాలక్కూడా టీవీల్లో 6-7 రేటింగ్స్ రావడం గగనమైపోయింది.

ఇలాంటి టైమ్ లో పుష్ప-2 బుల్లితెరపైకొచ్చింది. 12.6 రేటింగ్ తెచ్చుకుంది. రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాల టీఆర్పీలతో పోల్చి చూస్తే ఇది చాలా బెటర్. కానీ టీఆర్పీ చరిత్ర చూసుకుంటే, పుష్ప-2 స్థానం చాలా దిగువన ఉంది.

మరీ ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పుష్ప-2ను చాలామంది పోల్చిచూశారు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఏకంగా 18.1 టీఆర్పీ వచ్చింది. దీన్ని పుష్ప-2 బీట్ చేస్తుందని అంతా ఎదురుచూశారు. కానీ రేటింగ్స్ లో పుష్ప-2 వెనకబడింది.

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, పుష్ప-1, దువ్వాడ జగన్నాధమ్ లాంటి కొన్ని సినిమాలు 20+ టీఆర్పీలు తెచ్చుకున్నాయి. పుష్ప-2 మాత్రం ఈ లిస్ట్ లోకి చేరలేకపోయింది.

కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప-2 లాంటి సినిమాలు బుల్లితెరపై సినీ వీక్షకుల సంఖ్య కాస్త పెరుగుతుందనే సానుకూల సంకేతాల్ని ఇండస్ట్రీకి ఇచ్చాయి. చతికిలపడిన సినిమాల శాటిలైట్ మార్కెట్ పెరగడానికి ఇది కాస్త దోహదపడుతుందేమో.

6 Replies to “పుష్ప మళ్లీ గెలిచాడు కానీ..!”

  1. Nee Bonda raa. Zee TV strategically telecasted “Sankranthiki..” on TV first and then released on OTT. That’s why it got good TRP

  2. ఈ సినిమా కి వచ్చిన కలెక్షన్ లకి ott ప్లాట్ఫారం లో ఆరు నెలలు అయినా టాప్ ఫైవ్ లో ఉండాలి. ఎక్కడో పదో స్థానంలో ఉంది.

Comments are closed.