సక్సెస్ కోసం రూటు మార్చిన హీరో

ఇప్పుడు కాస్త రూటు మార్చి కొత్త దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు. ఈ డైరక్టర్ పేరు కుమార్ సాయి. కొత్త దర్శకుడైనా ఈ సీనియర్ హీరోకు హిట్టిస్తాడేమో చూడాలి.

రకరకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నాడు. కొత్త జానర్లు టచ్ చేస్తున్నాడు. నిర్మాతలు మారుతున్నారు, దర్శకులూ మారుతున్నారు. గోపీచంద్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. వచ్చినవి వచ్చినట్టే వెళ్తున్నాయి. అందుకే ఈసారి ఈ హీరో రూటు మార్చాడు.

గోపీచంద్ కొత్త సినిమా లాంఛ్ అయింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత, థ్రిల్లర్ సబ్జెక్ట్. ఇది కాదు ఇక్కడ మేటర్. ఈసారి కొత్త దర్శకుడితో కలిసి వర్క్ చేయబోతున్నాడు గోపీచంద్.

చాలా ఏళ్ల తర్వాత గోపీచంద్ ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఈమధ్య ఇతడు శ్రీనువైట్ల, మారుతి, శ్రీవాస్ లాంటి దర్శకులతో పనిచేశాడు. వీళ్లెవ్వరూ గోపీచంద్ కు హిట్టివ్వలేకపోయారు.

ఇప్పుడు కాస్త రూటు మార్చి కొత్త దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు. ఈ డైరక్టర్ పేరు కుమార్ సాయి. కొత్త దర్శకుడైనా ఈ సీనియర్ హీరోకు హిట్టిస్తాడేమో చూడాలి.

ఇప్పటికే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు గోపీచంద్. ఇప్పుడు కొత్త దర్శకుడి సినిమాను కూడా లాంఛ్ చేశాడు. ఈ ఏడాది ఈ రెండు సినిమాల్ని పూర్తిచేయబోతున్నాడు.

వీటిలో కొత్త దర్శకుడితో చేయబోయే సినిమానే ముందుగా రిలీజయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, చారిత్రక నేపథ్యంలో రాబోతున్న సంకల్ప్ రెడ్డి సినిమాకు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉంది.

15 Replies to “సక్సెస్ కోసం రూటు మార్చిన హీరో”

  1. వీడు, కల్యాణ్ రామ్, నితిన్ ఇంక సినిమాలు మానేసి సీరియల్స్ చేసుకోడం బెటర్. 

        1. Movies tiyyala vadda annadi producers istam… Movie hit idda leda annadi movie lo matter ni batti decide iddi… Heros pani time ki shoot ki velli work cheyyadam.. nv cheppinavallalo evari meda attitude or schedule ki raru ani or no other negative complaints levu…  Nee lanti ulfagallu daridrulu anentha tappu ithe em cheyyadam ledu vallu

    1. Correct ga chepparu..atleast kalyan ram movies konchem best..movie kosam efforts pedathadu…ee nithin n gopichand lu ithe edo money kosam ala natisthunnaru anthe..veellaki edupugottu daily serials ithe best

  2. Gopi Chand, Nitin like heros FOCUSING more on Style, Dresses, Heroine. 

    NO FOCUS on story or direction, so they fail and the producers too fail. He can’t select good stories.Period.

Comments are closed.