బ్యాక్ టు బ్యాక్ పోలీసు పాత్రలు

హిట్-2 క్లైమాక్స్ లో అర్జున్ సర్కార్ గా నానీని పరిచయం చేశారు. హిట్-3ని అతడితో కంటిన్యూ చేశారు. మరి హిట్-4 సంగతేంటి? దీనికి కూడా సమాధానం దొరికేసింది. Advertisement హిట్-3 క్లయిమాక్స్ లో కార్తీని…

హిట్-2 క్లైమాక్స్ లో అర్జున్ సర్కార్ గా నానీని పరిచయం చేశారు. హిట్-3ని అతడితో కంటిన్యూ చేశారు. మరి హిట్-4 సంగతేంటి? దీనికి కూడా సమాధానం దొరికేసింది.

హిట్-3 క్లయిమాక్స్ లో కార్తీని పరిచయం చేశారు. త్వరలోనే కార్తి హీరోగా “హిట్-ది ఫోర్త్ కేస్” రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. నాలుగో భాగంలో పోలీసాఫీసర్ రత్నవేల్ పాండియన్ గా కార్తి కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో కార్తి ఉన్నాడని, అతిథి పాత్ర పోషించాడంటూ కొన్ని రోజుల కిందటే పుకార్లు వచ్చాయి. ఇప్పుడా పుకార్లు నిజమయ్యాయి. హిట్-4లో అతడి పాత్ర ఎంత విలక్షణంగా ఉంటుందనేది మరో 4 రోజుల్లో బయటపెట్టబోతున్నారు.

ఆశ్చర్యంగా కార్తి నుంచి వరుసగా పోలీసు కథలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ హీరో సర్దార్-2 చేస్తున్నాడు. ఇందులో ఇన్ స్పెక్టర్ విజయ్ ప్రకాష్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక వా వాథియార్ అనే మరో సినిమాలో కూడా పోలీస్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు హిట్-4లో కూడా అతడు పోలీస్ గానే కనిపించబోతున్నాడు.

One Reply to “బ్యాక్ టు బ్యాక్ పోలీసు పాత్రలు”

Comments are closed.