చిన్న హీరో.. నాలుగు కోట్లు

థియేటర్ అమ్మకాలు మహా అయితే అయిదారు కోట్లు వుండవు. నాన్ థియేటర్ అవుతుందో కాదో తెలియదు.

అతగాడో చిన్న హీరో. ఏ బ్యాకింగ్ లేకపోయినా, వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒకటో అరో మంచి హిట్ లు ఖాతాలో వున్నాయి. చాలా సినిమాలే ప్రొఫైల్ లో వున్నాయి.

లేటెస్ట్ సినిమా వల్ల నిర్మాతలు చాలా గట్టిగా నష్టపోయారు అనే మాట వుంది. ఇప్పుడు ఆ హీరోను సినిమా చేయమని అడిగితే నాలుగు కోట్లు అడుగుతున్నాడట. ఇప్పటికి ఒప్పుకున్నవి మూడు కోట్ల వంతున. వాటిని ఎలాగూ ఫినిష్ చేయాలి.

తరువాత చేయమని ఎవరైనా అడిగితే నాలుగు కోట్ల వంతున పారితోషికం అడుగుతున్నారట. ఆయనకు నాలుగు ఇస్తే టెక్నీషియన్లు, డైరక్టర్, హీరోయిన్ ఇతర నటులు అంతా కలిసి కనీసం మూడు నుంచి అయిదు కోట్లు కావాలి. ప్రొడక్షన్ కు మరో అయిదారు కోట్లు కావాలి. అంటే మొత్తం 16 నుంచి 20 కోట్ల మేరకు ఖర్చవుతుంది.

థియేటర్ అమ్మకాలు మహా అయితే అయిదారు కోట్లు వుండవు. నాన్ థియేటర్ అవుతుందో కాదో తెలియదు. ఇలాంటపుడు రెమ్యూనిరేషన్లు ఇలా వుంటే ఎలా?

13 Replies to “చిన్న హీరో.. నాలుగు కోట్లు”

  1. నాలుగు కాకపోతే నలభై ఇవ్వండి వాడికి, తర్వాత నలభై కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ గా సినిమా తీశామని ప్రజల చెవిలో పువ్వులు పెట్టండి, ఎంత హడావిడి చేసినా టిక్కెట్లు తెగక, తర్వాత నెత్తి మీద గుడ్డ వేసుకు తగలడండి.. 

  2. సినిమా తీసే పరిజ్ఞానం సెల్ ఫోన్  వాడేవాడికి వచ్చేసింది..ఈ హీరోలు అని చెప్పుకుంటూ అడుక్కుంటున్న వాళ్ళని వదిలేసి ఏ bakaraa ని పెట్టుకున్న డబ్బులొచ్చేస్తాయి.. ఇక కీరోయిన్ ని ఎవర్తినైన కొత్తగా చూపెడుతూ తేప సన్నివేశాలెక్కువ పెట్టి వాటినే ట్రైలర్లగా వదిలితే హైప్ వస్తాది

  3. కనీసం ఆ చిన్న హీరో పేరు కూడా రాయలేనప్పుడు ఆర్టికల్ రాయడం ఎందుకు దండగ 

Comments are closed.