పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. ప్రభాస్ ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు అంశాలకు ఏమైనా సంబంధం ఉందా? పైపైన చూస్తే పెద్దగా సంబంధం లేనట్టే ఉంది. కానీ కొంతమంది మాత్రం సంబంధం ఉందంటున్నారు.
పహల్గామ్ ఘటన తర్వాత భారతీయ సినిమాల్లో నటిస్తున్న పాక్ నటీనటులపై నిషేధం విధించాలనే డిమాండ్స్ మరోసారి ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వి పేరు తెరపైకొచ్చింది.
ఇమాన్వి తండ్రిది పాకిస్థాన్ అని, కాబట్టి ఇమాన్వి కూడా పాకిస్థానీ అని కొంతమంది కామెంట్ చేశారు. తక్షణం ఆమెను ఫౌజీ ప్రాజెక్ట్ నుంచి తప్పించాలనే డిమాండ్స్ వెల్లువెత్తాయి. నిన్నట్నుంచి నడుస్తున్న ఈ ప్రచారంపై ఇమాన్వి స్పందించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో తనపై నడుస్తున్న ప్రచారంలో నిజం లేదంటోంది ఇమాన్వి. తన పక్కా ఆంగ్లో ఇండియన్ అని అంటోంది. ఇమాన్వి తల్లిదండ్రులు అమెరికాకు వలసవెళ్లారంట. అమెరికా పౌరసత్వం కూడా ఉందంట. ఇమాన్వి అక్కడే చదువుకొని ఇండియాకొచ్చిందంట.
భారత్ కు వచ్చిన తర్వాత నటిగా, డాన్సర్ గా కెరీర్ ప్రారంభించానని, భారతీయత తన రక్తంలోనే ఉందని, దయచేసి తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపాలని అందర్నీ కోరింది.
తను పాకిస్థానీ కాదని, తన కుటుంబంలో ఎవ్వరికీ పాకిస్థాన్ తో సంబంధం లేదని ఈ సందర్భంగా ఇమాన్వి స్పష్టం చేసింది. పేరున్న మీడియా సంస్థలు కూడా నిర్థారించుకోకుండా, తనపై తప్పుడు ప్రచారం చేయడం చూస్తే బాధేస్తోందని అంటోంది.
ఈస్ ఇట్
India lo actresses doraka ledha, Pakistan nunchi yendhuku bollywood lo models heroines chala mandhi vunnaru
తనను వచ్చి కలవందుకు పగ బట్టి మొత్తం ఒక పరిశ్రమ నే వేధించారు ఎవరో?