జరగండి..జరగండి.. పవన్ వస్తున్నాడు!

హరిహర వీరమల్లు కోసం ఏదో ఒక సినిమా తన రిలీజ్ డేట్ ను త్యాగం చేయాల్సిందే. ఆ సినిమా ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది.

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కొలిక్కి వచ్చింది. పవన్ సెట్స్ పైకి వచ్చారు. సినిమా షూటింగ్ పూర్తిచేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే నెలాఖరుకు సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్. అదే కనుక జరిగితే కింగ్డమ్ సినిమా వాయిదా పడుతుంది.

ఒకవేళ ఈ నెల కాకుండా వచ్చే నెల విడుదల చేయాలనుకుంటే పరిస్థితేంటి? పవన్ సినిమా వస్తుందేమో అనే భయం ఇప్పుడు చాలామందిలో పట్టుకుంది. జూన్ మొదటి వారంలో విడుదల చేస్తే ఆ ప్రభావం థగ్ లైఫ్ సినిమాపై పడుతుంది.

పోనీ మూడో వారం లేదా నాలుగో వారం రిలీజ్ చేద్దామంటే కుబేర, కన్నప్ప సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాలు తమ విడుదల తేదీలు ప్రకటించి సిద్ధంగా ఉన్నాయి.

ఎలాగూ లేట్ అయింది కాబట్టి, జూన్ వదిలేసి జులైలో రిలీజ్ పెట్టుకుందామంటే అక్కడ తమ్ముడు సినిమా సిద్ధంగా ఉంది. విశ్వంభర కూడా వస్తుందంటున్నారు. అయితే ఏఎం రత్నం అక్కడివరకు ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఏళ్లుగా సినిమాను మోస్తున్న ఈ నిర్మాత, వీలైనంత త్వరగా ఆ భారాన్ని దించుకోవాలనుకుంటున్నాడు.

పవన్ సినిమా రిలీజ్ చేయాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం 2 వారాలు గ్యాప్ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి గ్యాప్ దొరికేలా లేదు. సో.. హరిహర వీరమల్లు కోసం ఏదో ఒక సినిమా తన రిలీజ్ డేట్ ను త్యాగం చేయాల్సిందే. ఆ సినిమా ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది.

9 Replies to “జరగండి..జరగండి.. పవన్ వస్తున్నాడు!”

  1. రెండు రోజుల్లో ఎత్తేసే చిత్రానికి రెండు వారాలు గ్యాప్ ఎందుకు ? ఇంత లేట్ అయినా సినిమాకి టెంపో/కాంటీనుయూటీ మిస్ అవ్వడం కామన్

    1. ఎమ్ పీకలేనోడే ఇతరులని ఎమ్ పీకుతాడు అని అంటాం మనం పీకేది ఏముండదు ap lo 174 మంది mla లను 

    2. ఎమ్ పీకలేనోడే ఇతరులని ఎమ్ పీకుతాడు అని అంటాం మనం పీకేది ఏముండదు ap lo 174 మంది mla లను 

    3. ఎమ్ పీకలేనోడే ఇతరులని ఎమ్ పీకుతాడు అని అంటాం మనం పీకేది ఏముండదు ap lo 174 మంది mla లను పీకిండు 25 మంది ఎంపీ లను పీకిండు నిన్ను ఎవడు పీకలేడు నీదగ్గర ఏముంది

    4. ఎమ్ పీకలేనోడే ఇతరులని ఎమ్ పీకుతాడు అని అంటాం మనం పీకేది ఏముండదు ap lo 174 మంది mla లను 

    5. ఎమ్ పీకలేనోడే ఇతరులని ఎమ్ పీకుతాడు అని అంటాం మనం పీకేది ఏముండదు ap lo 174 మంది mla లను @

Comments are closed.