హిట్-1 వచ్చింది, హిట్-2 వచ్చింది, తాజాగా హిట్-3 కూడా థియేటర్లలోకి వచ్చింది. అసలు ఈ ఫ్రాంచైజీలో దర్శకుడు శైలేష్ కొలను ఎన్ని సినిమాలు తీస్తాడు.. దీనిపై అతడి ఆలోచన ఏంటి? తాజాగా ఈ విషయాల్ని వెల్లడించాడు శైలేష్.
ఇప్పటికి ముగ్గురు హీరోలతో 3 సినిమాలొచ్చాయి. కార్తితో హిట్-4 తీయబోతున్నాడు. హిట్-4తో సోలో హీరోల కథలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. హిట్-5ను ఈ నలుగురు హీరోల్లో ఇద్దరితో చేస్తాడంట. ఇక హిట్-6 సినిమాను మిగిలిన మరో ఇద్దరితో పూర్తిచేస్తాడట.
ఇక హిట్-7లో ఈ నలుగురు హీరోలూ నటిస్తారంట. అలా హిట్-7 సినిమాతో ఈ ఫ్రాంచైజ్ ను ముగిస్తానని ప్రకటించాడు శైలేష్. ప్లానింగ్ అయితే పెద్దగానే ఉంది, ఎంతవరకు బండి లాగిస్తాడో చూడాలి.
వెంకటేష్ కు సైంధవ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడు, మరోసారి అవకాశం వస్తే, వెంకీతో పాటు ఆ సినిమా నిర్మాతకు ఓ సక్సెస్ ఇస్తానని చెబుతున్నాడు. కెరీర్ లో తను బాగా ఇబ్బంది పడిన మూమెంట్ ఏదైనా ఉందంటే, అది సైంధవ్ ఫ్లాప్ మాత్రమే అంటున్నాడు. ఆ సినిమా ఫెయిల్యూర్ కు పూర్తి బాధ్యత తనే తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.
Good decision..stry batti chustey hit 3 antha excitement ivledu but voilent part kosam ayte chudachu ..
Call boy jobs vunnai hiprinceprince19@gmail.com come number istha