ఎట్టకేలకు పవన్ కల్యాణ్ సెట్స్ పైకి వచ్చాడు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను కొలిక్కి తీసుకొచ్చాడు. పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే వాళ్లు ఇక్కడితో ఆగడం లేదు. తమ హీరో నుంచి ఇదే ఊపు కోరుకుంటున్నారు.
ఎలాగూ సెట్స్ పైకి వచ్చారు కాబట్టి, పనిలోపనిగా ఓజీ సినిమా కూడా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. గ్యాప్ ఇస్తే మళ్లీ ఎప్పుడు సినిమాల వైపు వస్తారో తెలియదని, కాబట్టి ఇదే స్పీడ్ లో ఓజీ కూడా పూర్తిచేయాలంటూ తెగ పోస్టులు పెడుతున్నారు.
ఓజీ షూట్ కూడా దాదాపు కొలిక్కి వచ్చేసింది. మరో వారం పది రోజులు పవన్ కల్యాణ్ అందుబాటులోకి వస్తే సినిమా మొత్తం పూర్తవుతుంది. అందుకే ఫ్యాన్స్ ఈ డిమాండ్ ఎత్తుకున్నారు.
నిజానికి పవన్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఉంది. అది వస్తుందనే ఆశ అభిమానులకు లేదు. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలపై మాత్రమే వాళ్లు ఫోకస్ పెట్టారు.
పవన్ ఎప్పుడు, ఎక్కడ కనిపించినా ఓజీ..ఓజీ అంటూ గోల చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాను కూడా పవన్ తొందరగా పూర్తిచేస్తే ఓ పనైపోతుంది. ఆ తర్వాత ఆయన మరో ఆలోచన లేకుండా పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టొచ్చు.
ఇప్పుడీ సినిమాలు చూడకపోతే చస్తారెంట్రా?