హరి హరా.. ఏపీ 100 కోట్లు

ఆంధ్ర (సీడెడ్ కాకుండా) 100 కోట్లు చెబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎప్పటి నుంచో వార్తల్లో వుంటూ వస్తున్న సినిమా హరి హర వీర మల్లు. చాలా అంటే చాలా లేట్ అయింది. చాలా ఖర్చు అయింది. నిర్మాత ఎ ఎమ్ రత్నం పడిన కష్టాలు ఇన్నీ అన్నీ కావు. క్రిష్ వుండగానే ఎన్ని సార్లు షూట్ క్యాన్సిల్ అయిందో, వాయిదా పడిందో, ఎన్నికల కారణంగా ఆగిన వైనం, తరువాత దర్శకుడు మారిపోవడం ఒకటి కాదు. రెండు కాదు. బోలెడు కష్టాలు. ఏం మార్చరో, ఎలా పూర్తి చేసారో ఎఎమ్ రత్నంకే తెలియాలి.

సరే, మొత్తానికి కాస్త పాచ్ వర్క్ మినహా మిగిలినదంతా పూర్తయింది. విడుదలకు హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన వర్క్ పూర్తికి సహకరిస్తామన్నారు. మే రెండో వారం లేదా మూడో వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

గతంలో హరి హర వీరమల్లు సినిమా హక్కులకు విపరీతమైన డిమాండ్ వుండేది. ఇన్ టైమ్ లో వస్తే రికార్డులు బద్దలు కొట్టే అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తి వుంది కానీ ఇంకా ఎవరూ బోణీ కొట్టలేదు. వన్స్ ఒకరు బోణీ కొడితే ఇక చకచకా అమ్మకాలు సాగిపోతాయి.

నిర్మాత ఎ ఎం రత్నం ఇప్పుడు అదే పని మీద వున్నారు. సరైన వాళ్లతో ఒక బోణీ కొట్టిస్తే సర్రున ముందుకు వెళ్తుందని భావిస్తున్నారు. ఆంధ్ర (సీడెడ్ కాకుండా) 100 కోట్లు చెబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బాగుంటే అది పెద్ద మొత్తం కాదు. కానీ ముందుగా అంటే రిస్క్ అని భయపడొచ్చు. ఇప్పటికే ఎ ఎమ్ రత్నం కొందరు బయ్యర్లకు టచ్ లోకి వెళ్లారు. వాళ్లతో చర్చలు సాగిస్తున్నారు.

3 Replies to “హరి హరా.. ఏపీ 100 కోట్లు”

Comments are closed.